What Are the Benefits of Performing Pooja with Patri in Bhadrapada Masam?

 

What Are The  Benefits Of Performing  Pooja with Patri in Bhadrapada Masam

భాద్రపద మాసంలోనే పత్రితో పూజ ఎందుకు చేయాలి ?  వాటి ఉపయోగాలు

 

 వినాయకుని పూజకు మనం వాడే పత్రిలో ఆకులు, కాయలు, పూలు, పండ్లు ఉన్నాయివీటిలో ఎనలేని ఔషధ గుణాలున్నాయి. కేవలం స్పర్శామాత్రంతో కొన్ని రకాల అతి సామాన్య వ్యాధులను నయం చేయగల శక్తి వీటికి ఉంది. కొన్ని రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్ని యిస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయి. మన పూర్వీకులకు వీటి గుణాలు తెలుసు. ఆ ఔషధాలన్నింటినీ నట్టింటికి రప్పించేందుకు చేసిన ప్రయత్నమే ఈ పూజ అని గుర్తించాలి

భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది. గుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి, సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోంది. కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే, పదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం. తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది. వినాయకుని పూజించే పత్రిలో ప్రధానంగా ఉండాల్సినవి గరిక, తులసి, నేరేడు, మారేడు, మరువం, ఉమ్మెత్త, ఉత్తరేణి తదితర ఔషధ గుణాలున్న పత్రాలు. వీటివల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుందో తెలుసుకుందాం.

తులసి : తులసివల్ల జరిగే మేలు గురించి ఏకంగా ఒక పుస్తకమే రాయొచ్చు. కఫం మొదలైన అనేక రోగాలను తగ్గిస్తుంది.

జిల్లేడు: చర్మ వ్యాధులను, శ్వాసకోశ వ్యాధులను జిల్లేడు నశింపచేస్తుంది. నరాలకు సత్తువనిస్తుంది. జిల్లేడు ఆకులనుండి వచ్చే మొత్తం శరీరంలోని దోషాలను నివారిస్తుంది. శరీరానికి ఆరోగ్యం కలిగిస్తుంది.

రేగు : అతిసారం, రక్తదోషాలను మటుమాయం చేస్తుంది. కేశ వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. రేగు ఆకులనే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి.

మరువం :  మరువపు పరిమితం వాతావరణాన్ని ఆహ్లాదంతో నింపుతుంది. శ్వాస, చెవి సమస్యలు తగ్గుతాయి.

రావి : రావి ఆకులు మానసును కేంద్రీకరించేందుకు తోడ్పడతాయి.

దానిమ్మ : దానిమ్మ పూలు, బెరడు, కాయలను ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. వర్షాకాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలవంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఉత్తరేణి : ఉత్తరేణి వేరును మొహం కడుక్కోవడానికి ఉపయోగిస్తుంటారు. ఉత్తరేణి అత్యుత్తమ ఔషధ గుణాలు కలిగి ఉందని నిర్ధారించారు.

బిల్వపత్రం : సూక్ష్మక్రిములను హరిస్తుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. గాలి చొరని గర్భగుడుల్లో బిల్వపత్రాలతో పూజించడంవల్ల స్వచ్చత చోటు చేసుకుంటుంది.

నేరేడు : నేరేడు కాయ అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది. నేరేడు ఆకుల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి మంచిది.

మారేడు : త్రిదోషాలను హరిస్తుంది. సకల దోషాలను హరిస్తుంది.

గరిక : ముక్కు సంబంధమైన అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

మాచీ పత్రి వ్రణాలు, దద్దుర్లు, వాత రోగాలు, నులిపురుగులను తగ్గిస్తుంది. కొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదు. అతి దాహాన్ని హరిస్తుంది.

జమ్మి : ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది దసరా పండుగ. శమీ పూజ చేస్తాం కదా! కఫ, శ్వాస రోగాలను తగ్గించడంలో జమ్మి చెట్టు ఆకులు, బెరడు బాగా పనిచేస్తాయి.

మునగాకు : కఫాన్ని, వాతాన్ని హరించి శ్వాసను క్రమబద్ధం చేస్తుంది

Leaves or Patri used in Ganesh Chaturthi and their effect

1. Machi Patram


Scientific Name:    Artemisia vulgaris/ Imperata Cylindrica
Disease Cure:    Skin diseases (leprosy, leucoderma), nervous diseases, and abdominal related.


2. Brihathi Patram


Scientific Name:     Solanum indicum/ Carisssa Carandass
Disease Cure:     Asthma, cough, constipation. Also used for women in post natal period.


3. Bilva patram


Scientific Name:     Aegle marmeolus
Disease Cure:     Used for Dysentery. It also purifies water.


4. Durvara Patram


Scientific Name:     Cyanodon dactylon/ Cyanodon Dacry
Disease Cure:     Skin diseases, arresting bleeding, and anaemia.


5. Dattura Patram


Scientific Name:     Stramonium
Disease Cure:     Joint pains, abdominal, skin diseases, hair fall. Also used in poisonous bites.


6. Badari patram


Scientific Name:     Zizyphus mauritiana/ Z.jujba
Disease Cure:     Digestive disorders, wounds and injuries, blood impurities, maintaining the voice.


7. Apamarga Patram


Scientific Name:     Achyranthus Aspera
Disease Cure:     Used for digestive disorders and also used for poisonous bites.


8. Tulasi patram


Scientific Name:     Ocimum sanctum
Disease Cure:     Used for respiratory diseases, skin diseases, purifies air, water and surroundings.


9. Choota Patram


Scientific Name:     Azadarcata indica/ Mangifera indica
Disease Cure:     Used in Diabetics, for cracked heals, diseases of throat.


10. Karaveera Patram


Scientific Name:     Thevetia Nerifolium/Nerium indicum
Disease Cure:     Used for leprosy, wounds and injuries, hair fall, lice.


11. Vishnu Kranta Patram
Scientific Name:     Evolvulus Aisinoides/Convolvulus pluricaucis
Disease Cure:     Nervous related, memory power.


12. Daadimee Patram
Scientific Name:     Punica granatum
Disease Cure:     Used for Dysentery, Vata/Pitta/Kapha dosha.


13. Devadaaru Patram
Scientific Name:     Cedrus deodar
Disease Cure:     Skin diseases, wounds/injuries.


14. Maruvaka patram
Scientific Name:     Origanum Vulgara
Disease Cure:     Diseases of the heart.


15. Sindhuvaara
Scientific Name:     Vitex Nergunda
Disease Cure:     Anti venom drugs. Its juice cleanses the eyes.


16. Jajee
Scientific Name:     Myristica fragrams
Disease Cure:     Indigestion.


17. Gandaki Patram
Scientific Name:     Sterculia Urens/Latha Durva
Disease Cure:     Heart related, Piles, Skin diseases.


18. Shami Patram
Scientific Name:     Prosopis specigera
Disease Cure:     Respiratory problems.


19. Aswatha Patram
Scientific Name:     Ficus religiosa
Disease Cure:     Its bark is used in preparation of many medicines. It is also used for arresting bleeding.


20. Arjuna Patram
Scientific Name:     Morinda Tinctoria/Terminelia Arjuna
Disease Cure:     Heart diseases and wounds and septics. The famous tonic, Arjunarishta, is prepared with these leaves.


21.  Arka
Scientific Name:     Calotrophis Procera
Disease Cure:     The leaves have white milky juice which is a reliable medicine for the poison of scorpion, centipede, rat etc. It cures external wounds and ulcers.

 

 

0 Comments To "What Are the Benefits of Performing Pooja with Patri in Bhadrapada Masam?"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!