ఉగాది ప్రత్యేకం
“తెలుగు తేజం “ తుర్లపాటి
*
పుట్టింది
కరెంట్ కూడా లేని మారు మూల
పల్లెలో.
* MSc పట్టా అందుకున్నది బోటనీ సబ్జెక్ట్ లో.
* మక్కువ పెంచుకున్నది జర్నలిజంలో.
* ప్రశంసలు, పురస్కారాలు తెలుగులో చేసిన రచనలకు.
* విశిష్ట వ్యక్తి జీవన సాఫల్య యాత్ర
కొంత మంది జీవితాలు సినిమాల్లో ట్విస్టుల్లా అనూహ్య మలుపులు తిరుగుతూనే ఉంటాయి. అయితే ఎన్ని మలుపులు ఎదురైనా వాటిని కూడా తమ లక్ష్య సాధన కోసం సద్వినియోగం చేసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే రచయిత, సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి నాగభూషణ రావు. తెలుగు భాషాభిమాని అయిన తుర్లపాటి నిత్య విద్యార్థి.
40
ఏళ్ళుగా
అనేక విశిష్ట రచనలు చేసి అనేక
పురస్కారాలను,
ప్రశంసలను
అందుకున్న తుర్లపాటి అనన్య
సేవలకు గుర్తింపుగా ఈ మధ్యనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వీరిని తెలుగు భాషారత్న జీవన
సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
కృష్ణా జిల్లా (ప్రస్తుత ఎన్టీ ఆర్ జిల్లా) అడవి రావులపాడు గ్రామంలో 1957లో కనీసం కరెంట్ సౌకర్యం లేని పల్లెలో పుట్టి మిడిమిడి చదువులతోనే అంచలంచలుగా ఎదుగుతూ ఈరోజున తెలుగుతల్లి ముద్దుబిడ్డల్లో ఒకరుగా నిలిచారు. “తెలుగు తేజం”గా భాసిల్లుతున్నారు.
1978లో సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పొంది, అనంతరం జర్నలిజం పట్ల ఆకర్షితులై అనేక పత్రికలు, టివీ సంస్థల్లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. తెలుగు భాష పట్ల మక్కువతో వందలాదిగా విశిష్ట రచనలు చేసి పలువురి ప్రశంసలందుకున్నారు.
వారి రచనల్లో కొన్ని :
*
అదిగో
హరివిల్లు -
జాతీయ
ప్రతిభా పురస్కారం అందుకున్న
ఆకాశవాణి రూపకం (హరివిల్లులోని
ఏడు రంగుల గురించి వినడమేగాని
ఆ రంగులు చూడలేని 10
ఏళ్ళ
పాపకి నేత్రదానం వల్ల చూపు
వస్తుంది.
ఆస్పత్రి
నుంచి డిశ్చార్జ్ అయి బయటకు
రాగానే ఎండా-వాన
ఫలితంగా ఆకాశంలో హరివిల్లు
ఏర్పడుతుంది.
అప్పుడు
అమ్మ “చూడు కన్నా,
అదిగో
హరివిల్లు.
ఏడు
రంగులు అవిగో చూడరా..”
అనడంతో
రూపకం ముగుస్తుంది.
**
గంగ
పుత్రుల వ్యధ (జాలర్ల
సాంఘిక,
ఆర్థిక
అంశాలపైన)
**
ఇస్లామిక్
కట్టడాలలో హిందూ శిల్ప శైలి
(పరిశోధనాత్మక
కథనం)
**
గ్రామదేవతల
పుట్టుక -
సామాజిక
అవసరాలు
**
క్రికెటానందం
(క్రికెట్
సంక్షిప్త చరిత్ర)
**
నరుడే
వోనరుడైతే (టెనెంట్
ఓనర్ గా మారితే ఎలా ప్రవర్తిస్తాడు
-
ఆకాశవాణి
హాస్య నాటిక )
**
సెలవుపెట్టి
చూడు -
ఆకాశవాణి
హాస్య నాటిక
**
ఒక్క
క్షణం -
(ఓర్పు,
సహనంతో
ఒక్క క్షణం ఆలోచించగలిగితే
ఎన్నో ప్రమాదాలు ,
ఇబ్బందులు
తొలిగిపోతాయి)
ఆకాశవాణి
రూపకం
*.
పంచతంత్రం
(పంచ
భూతాలు -
పర్యావరణం
)
**
మంచి
పాటలు -
మనసులోని
మాటలు
**
నిప్పు
రవ్వ (రచన,
సమర్పణకి
గాను బంగారు నంది -
TV 5 అరగంట
డాక్యమెంటరీ)
- ( ఓపెన్
కాస్ట్ మైన్స్ లో కార్మికులు
వారి కుటుంబాలుండే పల్లెల్లో
కనిపించే వాస్తవ స్థితిగతులు)
**
బరువుల
బాల్యం (ఆడ
పిల్లల వ్యధలు)
**
బాలికలతో
మరణమృదంగం (బాలికలను
అపహరించుకుని వెళ్ళి సర్కస్
కంపెనీకి అమ్మడం.
వారు
తప్పించుకుని మీడియా,
పోలీసుల
సాయంతో వారి సొంత ఇళ్ళకు
చేరడం)
ఈ
కార్యక్రమం (టివి
5)
ఐక్యరాజ్య
సమితి పరిధిలోని UNICEF
వారి
అవార్డు అందుకుంది.
సమర్పణ
:
తుర్లపాటి
** 90 ఏళ్ళ టాకీ :
“తెలుగు సినిమాకు పట్టాభిషేకం - ఒక పరిశీలన” (రాబోయే రచన)
** సూట్ కేస్ : కథ (ఆంధ్రప్రభ)
(అది విజయవాడ. తెల్లవారుఘామున తలుపు చప్పుడుతో కామేశం నిద్ర లేచాడు. వచ్చిన వాడు చిన్ననాటి స్నేహితుడికి స్నేహితుడనని చెబుతాడు . అతడు వెళ్తూ సూట్ కేస్ వదిలి వెళ్తాడు . తెరిచి చూస్తే అందులో…)
** తెలుగు భాషా పరిణామక్రమం - సోషల్ మీడియా పాత్ర (2024 Feb 21 న ఆంధ్ర విశ్వకళా పరిషత్ (Andhra University - visakhapatnam) తెలుగు విభాగం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్ర సమర్పణ
**
భారత
దేశ స్వాతంత్ర్యోద్యమం -
తెలుగు
తేజం పింగళి వెంకయ్య (
2023 ఆగస్ట్
15న
ఇంగ్లండ్ లోని బేసింగ్ స్టోక్
హిందూసొసైటీ వారు నిర్వహించిన
సెమినార్ లో పరిశోధన పత్రం
సమర్పణ )
**
చిదంబర
రహస్యం -
ఒక
వినూత్న కోణం (పరిశోధనాత్మక
రచన -
Channel5am లో
డాక్యుమెంట్రీ)
ఏకపాత్రలు
:
1. శ్రీ రామకృష్ణ పరమహంస (రచన, పాత్రపోషణ)
(1998 లో NTR Memorial cultural trust వారు విజయవాడలో నిర్వహించిన రాష్రస్థాయి పోటీలో ద్వితీయ బహుమతి)
2. శ్రీ షిర్డీ సాయిబాబా (రచన, పాత్రపోషణ)
(ఆంధ్రప్రభ - ఇండియన్ ఎక్స్ ప్రెస్ కల్చరల్ అసోసియేషన్ వారు 1997లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రధమ బహుమతి)
3. గిరీశం (రచన, పాత్రపోషణ)
4. శ్రీ రాఘవేంద్ర స్వామి (రచన , పాత్రపోషణ)