దసరా మహోత్సవములు - 2016
నవరాత్రి (దసరా):
మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ, సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని మీకు తెలిసిన ముతైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి. ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి.
వ.సం | వారము | తిది | శ్రీ అమ్మవారి అలంకరములు |
01 -10- 2016 | శనివారం | ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి | శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి |
02 -10- 2016 | ఆదివారం | ఆశ్వయుజ విదియ | శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి |
03 -10- 2016 | సోమవారం | ఆశ్వీయుజ శుద్ధ విదియ (వృద్ధి) | శ్రీ గాయత్రి దేవి |
04 -10- 2016 | మంగళవారం | ఆశ్వయుజ శుద్ధ తదియ | శ్రీ అన్నపూర్ణా దేవి |
05 -10- 2016 | బుధవారం | ఆశ్వయుజ శుద్ధ చవితి | శ్రీ కాత్యాయని దేవి |
06 -10- 2016 | గురువారం | ఆశ్వయుజ శుద్ధ పంచమి | శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి |
07 -10- 2016 | శుక్రవారం | ఆశ్వయుజ శుద్ధ షష్ఠి | శ్రీ మహాలక్ష్మీ దేవి |
08 -10- 2016 | శనివారం | ఆశ్వయుజ శుద్ధ సప్తమి | శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) |
09 -10- 2016 | ఆదివారం | ఆశ్వయుజ శుద్ధ అష్టమి | శ్రీ దుర్గాదేవి |
10 -10- 2016 | సోమవారం | ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి) | శ్రీ మహిషాసురమర్ధినీ దేవి |
11-10-2016 | మంగళవారం | ఆశ్వీయుజ శుద్ధ దశమి (విజయదశమి) | శ్రీ రాజరాజేశ్వరీ దేవి |
ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము,ఆ తల్లికి ఇష్టమైన రంగు.
వ.సం | శ్రీ అమ్మవారి అలంకరములు | రంగు | నైవేద్యం |
1 | శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి | నీలం రంగు | ఉప్పు పోంగల్ |
2 | శ్రీ గాయత్రి దేవి | పసుపు రంగు | పులిహోర |
3 | శ్రీ మహాలక్ష్మి దేవి | లేత రంగు | కొబ్బరి అన్నం |
4 | శ్రీ అన్నపూర్ణా దేవి | ఆకాషం రంగు | అల్లం గారెలు |
5 | శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి | కనకంబరం రంగు | పెరుగన్నం |
6 | శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) | తెలుపు రంగు | రవ్వకేసరి |
7 | శ్రీ దుర్గా దేవి | మేరున్ రంగు (ముదురు ఎరుపు) | కదంబం (వెజిటబుల్, రైస్ కలిపి వండే ఐటం ) |
8 | శ్రీ మహిషాసురమర్ధినీ దేవి | ఎర్రటి ఎరుపు రంగు | బెల్లమన్నం |
9 | శ్రీ రాజరాజేశ్వరి దేవి | ఆకుపచ్చ రంగు | పరమాన్నం |
ఇలా 9 రోజులు తొమ్మిది రకాలనివేదనలు వంటకాలతో ఆ తల్లికి నివేదనలు చేసి ప్రసన్నులు కావచ్చు.
Note: HTML is not translated!