Which Are Idols Used For Pooja
పూజలో ఎలాంటి విగ్రహాలు పెట్టుకోకూడదు
అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయికానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి.
అందంగా వున్నాయికదా అని మార్కెట్ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. చెక్క విగ్రహాలగురించి కిందటి పోస్టులో చెప్పుకున్నాము. మరి మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాంకదా మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదు అంటారా మట్టి విగ్రహాలకు కూడా పగుళ్ళు వస్తాయి. మరి అలాంటివాటిని పూజించకూడదుకదా. గణపతి నవరాత్రులలో, దసరాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు. ఎక్కువకాలం పూజ చెయ్యరుకదా.
అలాగే ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజా సమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. చిన్ముద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు, మనవంక శాంతంగా, చిరునవ్వుతో చూస్తున్నట్లు వుంటే మనకి ఎనలేని ప్రశాంతత లభిస్తుంది..ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అంతకన్నా మన పూజకి పరమార్ధం ఏముంటుంది?
Note: HTML is not translated!