ఈ రోజు నృసింహ జయంతి .21/05/2024

ఈ రోజు నృసింహ జయంతి .

లక్ష్మీ నృసింహ
కరావలంబ స్తోత్రము
--
ఆది శంకరాచార్యుడు

శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో దేశ సంచారము చేయుచూ శ్రీశైలమునకు వచ్చినపుడు శ్రీ సంకరులను ఒక కాపాలికుడు చంప నిశ్చయించెను. ఒక గొప్ప రాజును గాని, యోగిని గాని బలి యిచ్చినచో కపాలి (ఈశ్వరుడు) తనకు కోరిన వరములిచ్చునని కాపాలికుని విశ్వాసము. శ్రీ శంకరులు దీనికి అంగీకరించి, నాశిష్యులవలన నీకు అపాయము కలుగకుండా చూచుకొనుము అని చెప్పిరి.
కాపాలికుడు కత్తి నెత్తిన పెట్టు సమయమున శ్రీ శంకరులు అంగరక్షకులైన పద్మపాదు అను శిష్యునకు తమ గురువు ఆపదలో ఉన్నట్లు స్పురించి, అతడు నృసింహ మంత్రమును జపించుచూ గురుసన్నిధికి రాసాగెను. ఇంతలో భగవంతుడు నృసింహరూపమున వచ్చి ఆ కాపలికుని చీల్చి చంపి, శంకరులను కాపాడెను. ప్రత్యక్షమైన శంకరుని చూచి పరవశులై శ్రీ శంకరులవారు స్తుతించుచూ ఈ స్తోత్రమును చెప్పిరి. ఈ స్తోత్రమును పటించువారికి ఎట్టి ఆపదలు కలుగవని భక్తుల

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్

సంసారసాగర విశాల కరాళకామ
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారకూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత
నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ
ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్
ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారదావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారసాగర నిమజ్జన మహ్యమానం
దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి
కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

అంధస్యమే హృతవెవేకమహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

మతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
స్వామీ నృసింహ: సకలం నృసింహ:

ప్రహ్లాద మానససరోజ విహారభృంగ
గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ
శృంగార సంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా

యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ
మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ

శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే

ఈ శ్లోకాలు చదివిన, మనకు మానసిక ఆనందం, ఆరోగ్యం గ్రహబాధ నివారణకి ఈ పారాయణ వల్ల విముక్తి లభిస్తుంది….

1::
శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !
యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||
తా:: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.
2::
బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత!
లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ ||
తా:: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.
3::
సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |
వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా:: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.
4::
సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |
ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా::ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.
5::
సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,
దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా::ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.
6::
సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః !
ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
తా::దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది Tags: narasimha jayanti 2024 NArasimha Swamy Swathi Nakshtram

Products related to this article

Trayodasha Mukhi Rudraksha

Trayodasha Mukhi Rudraksha

త్రయోదశిముఖి రుద్రాక్ష త్రయోదశముఖి అనగా పదమూరు ముఖముల రుద్రాక్ష. దీనికి పదమూడు ధారలుంటాయి. త్రయోదశ ముఖ రుద్రాక్ష దేవతల రాజైన ఇంద్రుని స్వరూపానికి ప్రతీక. అందువలన ఈ రుద్రాక్ష ధరించినవారిపై అందరి దే..

₹14,200.00

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

Get a 999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali, a sacred Hindu religious item with 108 names of Lord Narasimha engraved on it. A beautiful and spiritual piece for your collection...

₹130.00 ₹150.00