హనుమాన్ జయంతి 2024

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.

1. ప్రసన్నాంజనేయస్వామి.

2. వీరాంజనేయస్వామి.

3. వింశతిభుజాంజనేయ స్వామి.

4. పంచముఖాంజనేయ స్వామి.

5. అష్టాదశ భుజాంజనేయస్వామి.

6. సువర్చలాంజనేయ స్వామి.

7. చతుర్భుజాంజనేయ స్వామి.

8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.

9. వానరాకార ఆంజనేయస్వామి

తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!

దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.

ఆయన అష్టసిద్ధులు ?￰

1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.

2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.

3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.

4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.

5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.

6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.

7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.

8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.

 హనుమంతుని ప్రదక్షిణాలు ?￰

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.

'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'

శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం

తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం

శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన

శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''

అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.


Products related to this article

Rahu Ketu Puja For KalaSarpa Dosha To Nullify The Malefic Effects (Puja Performed On Tuesday)

Rahu Ketu Puja For KalaSarpa Dosha To Nullify The Malefic Effects (Puja Performed On Tuesday)

Rahu Ketu Puja For KalaSarpa Dosha To Nullify The Malefic Effects (Puja Performed On Tuesday)All the pooja materials required for the Rahu Ketu pooja will be provided by us . This pooja will be p..

₹751.00

Worship Lord Ganesha on Sankatahara Chaturthi and Remove all obstacles in life

Worship Lord Ganesha on Sankatahara Chaturthi and Remove all obstacles in life

Worship Lord Ganesha on Sankatahara Chaturthi and Remove all obstacles in life Sankastahara chaturdhi on this day means you'll be blessed with peace and prosperity in the coming times. Devotees u..

₹751.00

Go Seva

Go Seva

గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లేనని పురాణాలు చెపుతున్నాయి. గోవులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. మంచి సంతానం కలుగుతుంది. సులభంగా దైవానుగ్రహం లభి..

₹251.00