వనగౌరీ వ్రతం, అరణ్యగౌరీ వ్రతం - శీతలా షష్ఠి
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి - అరణ్య గౌరీ వ్రతం - వనగౌరీ వ్రతం - శీతలా షష్ఠి.
శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా.
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః
రాసభోగర్దభశ్చెవ ఖరో వైశాఖనందనః,
శీతలావాహనశ్చెవ దూర్వాకందనికృన్తనః
ఈ రోజు గౌరీవ్రతం చేయడమే కాక ముఖ్యంగా స్త్రీలు షష్ఠీ దేవిని, కార్తికేయుని కలిపి అరణ్యమందు లేదా కదంబవృక్షపు నీడలో గానీ, ఇంటిలో కానీ పూజిస్తే వారి గర్భములు నిలిచి చక్కటి సంతానము కలుగుతుంది. సంతానము గలవారికి రక్షణ లభిస్తుంది. ఈ రోజున ఋగ్వేదంలోని ఆరణ్యక సూక్తం పఠించడం / పఠింపజేయడం మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ఈ రోజున శివ,పార్వతుల కళ్యాణము జరిపించడం కూడా కళ్యాణదాయకం. ఉత్కళ రాష్ట్రం మొదలైన అనేక ప్రాంతాలలో ఈ కళ్యాణం జరిపించడం ఎక్కువగా ఆచరణలో ఉంది. శీతలాషష్ఠి కూడా కనుక ఈ రోజున శీతలాదేవి స్తోత్రమును, నామములను జపించడం వలన రోగబాధలు నశించి శీతలాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చును.
శీతల షష్ఠి నాడు శివు, పార్వతి దేవి కళ్యాణం
శీతల షష్ఠి నాడు భారతదేశం అంతటా, ముఖ్యంగా ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లాలో శివ, పార్వతీ దేవ