నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి

బ్రహ్మవైవర్త పురాణములోని భీమ- వ్యాస సంవాదము
ద్వాపర యుగముందు కుంతీపుత్రులలో మధ్యముడైన భీముడు ఒకరోజు
శ్రీవ్యాసమహర్షి ఇట్లు ప్రశ్నించెను. ఓ పూజ్యులైన తాతగారు ! నా మనవి దయతో వినవలెనని కోరుచున్నాను. నా యొక్క జ్యేష్ఠులు ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు,తల్లియగు కుంతీదేవి అట్లే నాకంటే చిన్నవారైన అర్జును నకులసహదేవులు మరియు ద్రౌపదియు ప్రతి మాసము బహుళ శుద్ధ ఏకాదశిలో ఉపవాసము ఉండి కృష్ణనామము చేయుచు తమ జీవితములను ధన్యము చేసుకొనుచుండెడివారు. నేను మాత్రము ఎల్లప్పుడూ తిండికొరకై కాలము వృథాచేయుచుండుటచే నా తల్లి,అన్నగారు, తమ్ములు, ద్రౌపది మొదలగు వారందరూ ఏకాదశీ వ్రతము చేయమని
కోరుచుండిరి. కానీ నా ఉదరంలో వృకమును అగ్ని ఉన్న కారణముగా ఏకాదశీ ఉపవాసము ఉన్న యెడల చచ్చిన పరిస్థితి కలుగునని భయముతో ఏకాదశీ ఉపవాసము తప్ప దాన ధర్మముల వంటి ఉత్కృష్టమైన మరియే ఇతర మార్గములు ఉన్నచో చెప్పమని కోరెను. అందుకు వ్యాసమహర్షి ఇట్లనెను. ' ఓ భీమ ! ఎంతటి కష్టమైనను నరక యాతన నుండి విముక్తి పొంది భగవద్దామము అనగా శాశ్వతశాంతి పొందవలెనను కోరిక ఉన్నయడల ప్రతిమాసంలో వచ్చు రెండు ఏకాదశులను తప్పక ఆచరించవలెను'.
వ్యాసుని ఉపదేశము విని భీముడు
భయముతో ఓ పితామహా ! ఏమియు తోచుటలేదు. ఒక ఏకాదశి ఉపవాసము మాత్రము చేయగలను. అని పలికెను. అప్పుడు వ్యాసుడిట్లనెను. 'ఓ భీమ ! రాబోవు 'మిథున రాశి' లేక 'వృషభ రాశి ' లో సూర్యడుండగా జ్యేష్టమాసంలో శుద్ధ ఏకాదశి వచ్చును. దానికి 'నిర్జల' ఏకాదశి అని పేరు. ఆ తిథియందు నీరు కూడా త్రాగరాదు. ప్రాతః కాలములో స్నానము చేసి అనంతరము ఆచమనము, పూజ, భగవస్మరణ మొదలైన విధులను సక్రమముగా ఆచరించవలెను. సాధువుల సాంగత్యంలో ఉండి. భగవంతుని నామ - రూప - గుణ - లీలా కథలు, శ్రవణ కీర్తనములు, చేసినచో నీ జీవితము ధన్యమగును. దీనికంటే సులభమైన ఉపవాసము మరియొకటి లేదని నా అభిప్రాయము. మృత్యుసమయమున యమదూతలు ఈ వ్రతమంచరించినవారి వద్దకు వచ్చుటకు కూడా భయపడుదురు. అంతేకాక యమదూతలకు బదులుగా శ్రీ విష్ణుపార్షదులు దివ్యరూపము ధరించి వైకుంఠమునకు తీసుకొని వెళ్ళెదరు. ఈ వ్రతము ఆచరించి అన్నదానము, గోదానము చేసినచో సర్వపాపములు తొలగును. ఈ విధంగా వ్యాసులవారి ఆజ్ఞను అనుసరించి భీముడు జ్యేష్ఠమాసములో వచ్చు శుద్ధ ఏకాదశీ వ్రతము చేసిన కారణముగా దీనికి 'పాండవ నిర్జల ఏకాదశీ' అను పేరు వచ్చెను. ఈ తిథియందు పుణ్యనదీ స్నానము, పవిత్ర నిష్టవంతులగు వారికి దానము, యజ్ఞయాగాదులు, యోగము చేసినచో భగవదనుగ్రహ పాత్రులగుదురు.
శ్రద్ధా భక్తులతో ఈ నిర్జలా ఏకాదశిని ఆచరించి, దాని మాహాత్మ్యమును శ్రవణ, కీర్తన, స్మరణములు చేయుదురో అట్టి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును.

జై శ్రీమన్నారాయణ

Products related to this article

999 Silver Foil Frame with Plastic Stand Big

999 Silver Foil Frame with Plastic Stand Big

Elevate your home decor with our exquisite 999 silver foil frame with a plastic stand.Silver Coated Foil Frame Dimensions:Height: 9 cmsWidth: 12 cms..

₹220.00

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

Get a 999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali, a sacred Hindu religious item with 108 names of Lord Narasimha engraved on it. A beautiful and spiritual piece for your collection...

₹130.00 ₹150.00