వాగ్దేవతలు ::
తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం ::
"అ" నుండి "అః" వరకు "అఆఇఈఉఊఋౡ ఎఏఐఒఓఔఅంఅః"
ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు.
ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని"
అనగా "వశపరచుకొనే శక్తి కలది" అని అర్ధం.
"క" నుండి "భ" వరకు "కఖగఘఙచఛజఝఞటఠడఢణతథదధనపఫబభ"
ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం" అని అంటారు.
ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల
అధిదేవత "కామేశ్వరి".! అనగా "కోర్కెలను మేలుకొలిపేది" అని అర్ధం.*
"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".!
అనగా "సంతోషాన్ని వ్యక్తం చేసేది"
అని అర్థం.
"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి
"విమల".! అనగా "మలినాలను తొలగించే దేవత" అని అర్థం.
"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత
"అరుణ".! అనగా "కరుణను మేలుకొలిపేదే
అరుణ" అని అర్థం.
ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని."
అనగా "జయమును కలుగ చేయునది" అని అర్థం.
అలాగే "య" నుండి "ఱ" వరకు "యరలవశషసహళక్షఱ" ఉన్న 11 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం"
అంటారు.
అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన
దేవత "సర్వేశ్వరి." అనగా "శాశించే శక్తి కలది సర్వేశ్వరి" అని
అర్థం.
ఆఖరులోని ఏడు అక్షరాలైన "శ, ష, స, హ, ళ, క్ష, ఱ" లకు
అధిదేవత "కౌలిని" అనగా "కులదేవతల రూపంలో ఆరాధింపబడునది" అని అర్థం.
ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అని అంటారు. ఈ బీజ
శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.
వారసవాహిక అనేది ఆంగ్లభాష లోని 'క్రోమోజోమ్' (ఆంగ్లం
chromosome) కి తెలుగు సేత.
జీవకణంలో ఉన్న కణికలో ఉన్న జన్యు పదార్థంలో ఉన్న సన్నటి దారాల
లాంటి పదార్ధాన్ని వారసవాహికలు అని తెలుగులో అందాం.
అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక
దేవతాశక్తి ఉంది.