ఏడాదికి ఒకసారి ఈ విగ్రహానికి చెమటలు పడుతాయి అని తెలుసా?
సిక్కర్ సింగరవేలన్ దేవాలయం హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం.
మీరెప్పుడైనా దేవుడు విగ్రహానికి చమటలు పట్టడం చూశారా? ఒకవేళ లేదు అనేది మీ సమాధానమైతే తమిళనాడులోని సిక్కల్ సింగార్ వేలన్ దేవాలయానికి వెళ్లండి. అక్కడి మూలవిరాట్టు విగ్రహం నుంచి చమట వస్తుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం.రాక్షసరాజైన సురపద్మ అనే అతడు ప్రజలను, మునులను, దేవతలను తీవ్రంగా హింసించేవాడు. అతని ఆగడాలను సహించలేని ప్రజలు శివుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకొంటాడు. అతడి నుంచి తమను కాపాడమని విన్నవించుకొంటారు.అయితే శివుడు సురుపద్ముడికి వరం ఇచ్చినందువల్ల ఆ త్రినేత్రుడు ఆ రాక్షసరాజును సంహరించడానికి వీలుకాదు. దీంతో ఆ పార్వతీ వల్లభుడు కార్తికేయుడిని సురపద్ముడి పైకి యుద్ధానికి పంపుతాడు. ఆ సమయంతో పార్వతీదేవి కార్తికేయుడుకి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది. ఆ ఆయుధం ఇచ్చిన స్థలమే సిక్కల్.ఈ దేవాలయంలో ప్రధానంగా ఆచరించే ఉత్సవం అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలో వస్తుంది. కార్తికేయుడు ఆ రాక్షసరాజు పై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవం మొత్తం ఆరు రోజుల పాటు జరుగుతుంది.ఎంతో ఘనంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు జరిగే ఘట్టాల గురించి చెప్పుకోవాలి. ఈ ఐదోరోజున కార్తికేయుడు తన ఆయుధాన్ని తన తల్లి నుంచి పొందాడని చెబుతారు. ఈ ఘటనను గుర్తుచేసుకొంటూ వేల్ వంగం తిరువిఝూ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.ఆ సమయంలో ఇక్కడ విగ్రహానికి చెమటలు పడుతాయి. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. అంతేకాకుండా ఆ చమటను పురోహితులు పట్టువస్త్రంతో ఎప్పటికప్పుడు తుడిచివేస్తుంటారుఅటు పై ఈ చమటను తీర్థం రూపంలో భక్తుల పై చల్లుతారు. ఆ చమటను తమ పై పడాలని కోరుకొంటూ భక్తులు ఆశిస్తుంటారు. ఆ చమట ఎవరి పై పడుతుందో వారికి సకల శుభాలు జరుగుతాయిని నమ్ముతారు.ఇలా కొన్ని గంటల పాటు జరిగిన తర్వాత విగ్రహం నుంచి చమట రావడం కొద్ది కొద్దిగా తగ్గుతూ చివరికి నిలిచిపోతుంది. అటు పై ఆరోరోజూ అసుర సంహారం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొంటూ కూడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఈ దేవాలయం తమిళనాడులోని నాగపట్టిణం దగ్గర్లోని సిక్కల్ గ్రామంలో ఉంది. ఇది నాగపట్టణం నుంచి పశ్చిమ దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శత్రుసంహార పూజలు కూడా జరిపిస్తుంటారు.