ధర్మరాజు దుర్గాస్తుతి

ధర్మరాజు దుర్గాస్తుతి

పాండవుల వనవాసము పూర్తయి అజ్ఞాత వాసము చేయడానికి విరాటనగరం పొలిమేర చేరారు. ధర్మ రాజు ఆయుధాలను శమీ వృక్షముపైన భద్రపరచమని తమ్ములకు సూచించాడు. అజ్ఞాత వాసం విజయవంతంగా పూర్తిచేసి తమ రాజ్యాన్ని తిరిగి పొందేలా వరమీయమని దుర్గాదేవిని స్తుతించాడు ధర్మరాజు.

పశు ప్రవృత్తిని రూపుమాపి ధర్మ స్థాపన చేయుటకు ఈ విశ్వం లో సనాతన స్త్రీ శక్తి మూర్తి అయిన దుర్గాదేవి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. సోదరులు, ద్రౌపది ముకుళిత హస్తాలతో ధర్మరాజును అనుసరించగా దుర్గామాతను ఈవిధంగా స్తుతించారు.

చతుర్భుజే చతుర్వక్రేపీనశ్రోణి పయోధరే|

మయూర పింఛవలయే కేయూరాఙ్గద ధారిణి||

భాసిదేవి యథా పద్మానారాయణ పరిగ్రహః||

స్వరూపం బ్రహ్మ చర్యం చ విశదం తవఖేచరి |

కృష్ణచ్ఛ విసమా కృష్ణా సంకర్షణ సమాననా॥

"ఓ దుర్గాదేవీ ! నాలుగు భుజములతో శోభించు విష్ణురూపి ణియు, నాలుగు ముఖములలో వెలయు బ్రహ్మ స్వరూపిణియు అయివున్నావు. సుందర అవయవములతో శోభించుచున్నావు. నెమలి ఈకలను వలయముగాను, కేయూరములు, అంగదములు మొదలగు ఆభరణములను ధరించి ఉన్నావు. నారాయణ పత్ని లక్ష్మీ దేవిగా ప్రకాశించుచున్నావు. ఆకాశము నీ సంచార మార్గము. బ్రహ్మ చారిణివై పరమ ఉజ్జ్వలముగా దర్శనమీయుచున్నావు. నీ ప్రకాశ వంతమైన కాంతి శ్యామ సుందరుడైన శ్రీ కృష్ణుని పోలియున్నది.

అందుచే నిన్ను కృష్ణా అని స్తుతించుచున్నారు.” నిమీల నేత్రాలతో సభక్తి పూర్వకంగా స్తుతించుచున్న ధర్మరాజు, అతని సోదరుల హృదయ నేత్రమునందు దుర్గాదేవి నిలిచియున్నది. ఆమె కరుణా కటాక్షములను పొందవలెనను కాంక్షతో ఆమెను కీర్తించసాగారు.

“వర, అభయ ముద్రలను ధరించి ఇంద్ర ధ్వజమువలె వెలుగు చున్నావు. కమలము, ఘంటతో కరుణ చూపుచున్నావు. పాశము, ధనస్సుతో అభయమిచ్చుచున్నావు. స్త్రీ శక్తి స్వరూపిణియై శ్రీ మాత గా ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను నొసగుచున్నావు. మీ వదనము చంద్ర తేజ శోభితమై యున్నది. కిరీటము, జడ అనిర్వచనీయం.

బ్రహ్మ చారిణియై సకల భువనములను పవిత్ర మొనర్చుచున్నా వు. మయూర పింఛములు కలిగిన మీ దివ్య ధ్వజము విశ్వమునాక్ర మించినది. ముల్లోకములను రక్షించుటకు మహిషాసురుని వధించి న దేవేశ్వరీ! మమ్ములను ప్రసన్నురాలిపై దయ చూపుము. మాకు శ్రేయస్సును కలుగజేయుము. జయ విజయ నామములు కల్గిన నీకు ఎల్లవేళలా యుద్ధములందు విజయము చేకూరునట్లే మాకును జయము కలుగునట్లు వరమీయుము. వింధ్య పర్వత వాసి ని అయిన నీవు మహాకాళివై ఖడ్గమును, మంచపుకోడును ధరించి ధైర్యమును ప్రసాదించుచున్నావు. ఎవరైతే నిన్ను అనుసరిస్తున్నారో వారికి మనో వాంఛం ఫలములు ఒసగుచున్నావు. ఇచ్చానుసారము సంచరించు ఓ దేవీ! సంకటములను రూపుమాపుము.

ప్రాతఃకాలమున స్మరించు వారికి ఈ భూమిపై పుత్ర, ధన, ధాన్యాలను అందించుచున్నావు. ఓ దుర్గామాతా! జనులను దుర్గతుల నుండి, దుఃఖముల నుండి ఉద్దరిం చుచున్నావు. అందుకే నిన్ను దుర్గయని స్తుతించుచున్నారు. అరణ్యములలో చోరుల బారి నుండి సదా మమ్ములను కాపాడుచున్నావు. నిన్ను పూజించినవారికి, బంధనము, మోహము, పుత్ర నాశ ము, ధననాశంలాంటి సమస్త భయములు లేకుండా చేసి కాపాడు చల్లనితల్లీ! రాజ్యభ్రష్టుడనై నీ అనుగ్రహానికై శరణు వేడుచున్నాను.

ప్రణతశ్చయథా మూర్ధ్నా తవదేవి సురేశ్వరీ!

త్రాహిమాం పద్మ పత్రాక్షీ సత్యే సత్యాభవ స్వనః

శరణం భవమే దుర్గే శరణ్యే భక్తవత్సలే||

నీ పాదపద్మములపై నా శిరస్సు నుంచి నమస్కరించుచు న్నాను. మమ్ములను రక్షించుము. ఓ కమల నేత్రీ! సత్య స్వరూపిణి! దుర్గాదేవీ నీ మహిమను సత్యముగా చూపి శరణాగతులమైన మమ్ము భక్తవత్సలియై శరణు చూపుము.” అని ధర్మరాజు ప్రార్థించి, అజ్ఞాత వాసమును విజయవంతంగా దుర్గాదేవి కరుణతో పూర్తిచేసి శ్రీ కృష్ణ భగవానుని అనుజ్ఞతో మహా భారత యుద్ధం చేసి విజయులై ధర్మ పాలన చేసారు

Products related to this article

Deeksha Tulasi Mala

Deeksha Tulasi Mala

Deeksha Tulasi Mala ..

₹120.00

Deepavali Lakshmi Devi Puja Vidhanam Book

Deepavali Lakshmi Devi Puja Vidhanam Book

Deepavali Lakshmi Devi Puja Vidhanam Book..

₹15.00

Deepavali Pooja Kit

Deepavali Pooja Kit

Deepavali Pooja Kit  - Available Items1. Gomati Chakra                (11 Pieces)2. Pasupu                13. Kumk..

₹1,151.00