ఆశ్వియుజ పూర్ణిమ

ఆశ్వియుజ పూర్ణిమ :

  ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఓషధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మర్నాడు ఉదయం పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి. శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే శరత్ పూర్ణిమను బృందావనంలో 'రాసపూర్ణిమ' అంటారు. శ్రీకృష్ణుడు ఈరోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలో పరుగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేశారట. పూర్ణిమక కోశాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరి పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

Products related to this article

Handmade Floral  Lakshmi Ganesha T-lights (1 Pair)

Handmade Floral Lakshmi Ganesha T-lights (1 Pair)

Handmade Floral  Lakshmi Ganesha T-lights..

₹350.00

Handicraft Matki Diya

Handicraft Matki Diya

Handicraft Matki Diya ·         A traditional handmade decorative diya creating an ambiance during Pooja, Navratri, Dussera,Diwali, Parties.·  ..

₹220.00

Brass Lotus Diya Set of 4 With Display Box Packing (Mixed Colours Available)

Brass Lotus Diya Set of 4 With Display Box Packing (Mixed Colours Available)

Brass Lotus Diya Set of 4 With Display Box Packing (Mixed Colours Available)Product Description:Product Name : Lotus Diya Metal : Brass Dimensions: 7.6 *7.6 *3.8 Centimeters ..

₹650.00