సాధారణంగా దేవతార్చనలో మనం ఏదేవతను ఆరాధించినా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన అన్నది విశేషంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ నామాలు చెప్పడంలో అనేక ఆంతర్యాలున్నాయి. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము.
ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఈనామాలన్నీ అర్థం చేసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం వస్తుంది. అందుకు ఆ దేవతా జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో నిబద్ధించి ఋషులు అందించారు. నామాల అర్థాలన్నీ కూడా మేళనం చేసి మనం చూస్తే ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అవగాహనలోకి వస్తుంది. అందుకు ఈ నామాలను ఋషులు అందించారు.
అంతేకాదు సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఇవి రెండూ అనంతత్త్వాన్ని తెలియజేసేటటువంటి నామాలు.
అనంతమైన భగవచ్ఛక్తిని అనుష్ఠానం చేసిన ఫలితం లభించడానికై ఈ సంఖ్యలో చెప్తారు. శతం, సహస్రం – ఈ రెండూ కూడా అనంతత్త్వానికి సంకేతం. అనంత పారాయణ చేసిన ఫలం లభించడానికై ఈ శతనామావళిని సమకూర్చారు.
పైగా అష్టోత్తర శతం అనగానే మొత్తం 108వస్తాయి. ఈ 108 కూడా భచక్రంలో ఉన్నటువంటి అంటే అంతరిక్షంలో ఉన్న రాశిచక్రం –
ఈ రాశిచక్రంలో 27 నక్షత్రాలుంటాయి. ఒక్కొక్క నక్షత్రానికీ నాలుగు పాదాలు. 27 X 4 = 108 పాదములు.
ఈ సమస్త అంతరిక్ష రాశి చక్రానికీ సంకేతంగా చెప్పబడతాయి. పరిపూర్ణతకు సంకేతం ఇది. అందుకు ఆ సంఖ్యా ప్రాధాన్యాన్ని ఇక్కడ అష్టోత్తర శతనామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలా ప్రతిదేవతకీ అష్టోత్తర శత నామావళి ఉంటాయి.
ఇప్పుడు లలితా దేవికి సంబంధించిన శతనామావళి. ఈ శతనామావళికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇలాంటి ప్రత్యేకత ఇక ఏ నామాలలోనూ మనకు కనపడదు. అది గమనించుకోవలసిన అద్భుతమైన అంశమిది. సాధారణంగా సహస్రనామాలు గానీ, అష్టోత్తర శతనామాలు గానీ స్తోత్ర రూపంలో శ్లోక రూపంలో ఉంటాయి. వాటిని పూజలో వినియోగించేటప్పుడు నామావళిగా మార్చుతారు. అదెలాగు అంటే “శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ” అనే వాక్యం ఉంది. దీనిని శ్లోకపాదం అంటారు. అనుష్టుప్ అనే ఛందస్సులో రచించినటువంటి శ్లోకంలో మొదటి పాదం ఇది. మొత్తం 16 అక్షరాలుంటాయి ఇందులో. అయితే ఇవి మూడూ నామాలే. వీటిని పూజలో వినియోగించేటప్పుడు ప్రతి నామానికీ ‘చతుర్థ్యంతము’ చేయాలి. అనగా చతుర్థీ విభక్తిని కలపాలి. ‘నమః’ అన్న శబ్దాన్ని చేర్చాలి. శ్రీమాతా అన్న నామాన్ని నమస్కారంగా వినియోగించితే ‘శ్రీమాత్రే నమః’ అనాలి. అలాగే ‘శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః’, ‘శ్రీ మహారాజ్ఞై నమః’ అని నమః కలిపి నామానికి చతుర్థీ విభక్తిని కలిపి ఈ నామాన్ని అన్నప్పుడు అది శ్లోకంలో ఇమడదు. విడినామంగా ఉంటుంది. ఆ ఛందస్సులో ఇమడదు. “శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ” ఒక లయాత్మకంగా ఛందోబద్ధంగా చదువుతున్నాం. దానిని నామావళి గా అర్చనగా చేస్తే ‘శ్రీమాత్రే నమః’ ‘శ్రీ మహారాజ్ఞై నమః’ ‘శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః’ అన్నప్పుడు విడి నామాలు అయిపోతున్నాయి.
లలితా సహస్రనామాలు ఏ బ్రహ్మాండపురాణం ఉత్తరఖండంలో చెప్పబడ్డాయో అదే బ్రహ్మాండపురాణంలో ఈ Tags: Devatha archana Pooja Hindu