కార్తీక మాస విధులు

కార్తీక మాస విధులు

  కార్తీకము బహుళార్థసాధకముగా  శివ కేశవ జగన్మాతలను,  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని యధాశక్తి పూజించుట ప్రధానము.

    ఆసక్తి, శక్తి కలిగినవారు.... ఈ మాసమంతా దీక్ష అవలంబించడం, మాసమంతా నక్త భోజన వ్రతమును ఆచరించటం ఉత్తమము.

     ఈ మాసమంతా......

1) సూర్యోదయానికి పూర్వమే కార్తీకస్నానం సంకల్పయుతముగా..

2) కార్తీక దీప ప్రజ్వలన ప్రాతః సాయంకాల ఉభయ సంధ్యలలో.

3) శక్తిమేరకు శివ అభిషేకమో, ఇష్టదేవతా అనుష్ఠానమో, అర్చనో, జపమో, పూజ నామపారాయణమో, అవశ్యం దానము అనుసరణీయమే.

4) "కార్తిక్యామిందువారేతు:స్నాన దాన జపాదికం  |

అశ్వమేధ సహస్రాణాం ఫలం ప్రోప్న్యాత్యసంశయః ||"

అని శాస్త్రము.

*భావం:*

కార్తీకమాసమంతా  ఆచరించలేని వారు కనీసం, కార్తీక సోమవారం నాడు అయినా  ఆచరించినట్లైతే వేలకొలదీ  అశ్వమేధయాగ ఫలాలు పొందగలరు.

5) అర్హత కలిగిన వారు తప్పనిసరిగా కార్తీక మాసంలో నిత్యం పితృతర్పణాలనివ్వాలి. కారణమేమంటే.......

"యావన్తః కార్తికేమాసి వర్తన్తే పితృతర్పణే!

తిలాస్తత్సంఖ్యకాబ్దాని పితరః స్వర్గవాసినః!!"

*భావం:*

కార్తిక మాసములోని తిలతర్పణాలలోని తిలలసంఖ్య ఉన్నన్ని సంవత్సరాలు పితరులు స్వర్గవాసులవుతారు.  కర్తకి ఇది మహా పుణ్యం.

6)  ఈ మాసమంతా ఎవరైతే, "శుచి-శుభ్రముగా, దీక్షగా గోసేవలో పాల్గొంటారో, గోమాతను పూజిస్తారో, గో స్తుతి పారాయణాలు చేస్తారో,  కార్తీకమాసం అంతా నిత్యము గోమాతకు తగిన ఆహారాన్ని, గ్రాసాన్ని సమర్పిస్తారో వారు సర్వ దేవీదేవతా మరియు పితృదేవతా అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

7) ఈ కార్తీకమాసంలో ఎవరైతే తులసి యందు మరియు చంద్రుని, రాధాకృష్ణులను ధ్యానిస్తారో వారి భాగ్యమే భాగ్యము.

8) కార్తీక మాసమంతా.........

"కార్తీక దామోదర త్రయంబకేశ్వరాయ నమః" అనే నామమంత్రాన్ని యధాతథంగా జపించాలి.

️ ( స్వతంత్రించి ఈ మంత్రానికి ఎలాంటి అక్షరాలు లేదా బీజాక్షరాలు జత చెయ్యకూడదు )

 

కార్తిక మాసంలో ప్రధానమైన ఇంకొక మంత్రం ఉన్నది

Products related to this article

Koti Vattulu

Koti Vattulu

koti vattulu Koti vattulu is mostly used in Sravana and Karthika Masam. By lightning these wicks deities will be pleased, shower blessings..

₹2,500.00 ₹3,000.00