నాగుల చవితి విశిష్టత ఏమిటి..?

నాగుల చవితి విశిష్టత ఏమిటి ? | Nagula Chavithi 2024 | Nagula Panchami 2024 |  Pooja Vidhanam in Telugu



November 4th - నాగుల చవితి

November 5th - నాగుల పంచమి

నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగ పంచమి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే భక్తులు.. ఈ రెండు రోజులు నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు నిర్వహించడం మంచిది.

నాగులకు.. అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక మాసంలో శుక్ల పక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగ దేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించు కోవచ్చు. అలాగే సంతాన సిద్దితోపాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని శాస్త్ర పండితులు చెబుతారు.

ఇక నాగుల చవితి పండగకు సంబంధించి పురాణ కధలను అందరు బలంగా నమ్ముతారు. ముఖ్యంగా నాగ దేవతను పూజించడం ద్వారా సర్ప దోషం తొలుగుతుందని భక్తులంతా బలంగా నమ్ముతారు.

1) శుక్ల పక్షం చవితి తిథి రోజు నాగ దేవతను ఆరాధించడం వల్ల.. సర్ప దోష నివారణ కలుగుతుంది.

2) సంతానం లేని వారు.. ఈ రోజు సర్ప దేవతలను పూజించాలి. తద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది. దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.

3) పల్లె ప్రాంతాల్లో రైతులు.. తమ పంటలను రక్షించుకునేందుకు నాగ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని.. అలాగే వ్యవసాయ భూమి సారవంతం కావాలని వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థిస్తారు. దీంతో పంటలు అధిక దిగుబడికి, పశు పక్ష్యాదులకు నాగదేవత రక్షణ చేకూరుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

నాగుల చవితి రోజు.. భక్తులు ఏం చేయాలి..

వివిధ ప్రాంతాల్లో పుట్టలుంటాయి. అలాగే పలు దేవాలయాల్లో నాగ ప్రతిమలు ఉంటాయి. పుట్టల్లో పాలు పోయ్యాలి. ఇక దేవాలయాల్లోని ప్రతిమల ముందు ఆవు పాలు ఉంచాలి. తులసి దళాలు, పువ్వులను స్వామి వారికి సమర్పించాలి. అలాగే పంచామృతం నైవేద్యంగా అందించాలి. స్వామి వారికి పాలు సమర్పించడం వల్ల సర్ప దోషాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే స్వామి వారికి నువ్వులతో చేసిన చిమ్మిలి ఊండతోపాటు బెల్లం, పెసరపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పించాలి.

 నాగ పంచమి రోజు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖ శాంతులు కలుగుతాయి. భార్య భర్తల మధ్య వున్నా విభేదాలు ఉంటే తొలగి సుకంగా వుంటారు, అలాగే సర్ప దోషంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన దోషాలు సైతం తొలుగుతాయని భక్తులు భావిస్తారు.

ఆ రోజు ఉదయం ఉదయం సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేసి సుబ్రహ్మణ్యాష్టం చదువుకోవాలి. కొంత మందికి గుడికి వెళ్లలేని వారు అభిషేకం చేయించుకున్నా మంచి ఫలితాలుంటాయి.  కుటుంబ అభివృద్ధి, పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, వివాహం కానివారికి వివాహం సంబంధం కుదరడం, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది.

Products related to this article

Ganapathi Homam Pooja Samagri

Ganapathi Homam Pooja Samagri

GANAPATHI HOMAMGanapathi Homam pooja Samagri kit includes the following items :S.No Product Name Quantity 1Pasupu ( Turmeric Powder)150 Grams 2Kumkuma 150 Grams 3Dry Bete..

₹3,851.00

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali

Get a 999 Pure Silver Sri Narasimha Ashtottara Shatanamavali, a sacred Hindu religious item with 108 names of Lord Narasimha engraved on it. A beautiful and spiritual piece for your collection...

₹130.00 ₹150.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

₹795.00