నేడు…క్షీరాబ్ది ద్వాదశి!

నేడు…క్షీరాబ్ది ద్వాదశి!

            *క్షీరాబ్ది ద్వాదశి వ్రతం:*

కార్తీకంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు ‘క్షీరాబ్ది ద్వాదశి.’ ‘కార్తీక శుక్లపక్ష ద్వాదశి’ ‘హరిబోధినీ ద్వాదశి’ అనీ, ‘యోగీశ్వర ద్వాదశి’ అని , ‘చినుకు ద్వాదశి,’ ‘కైశిక ద్వాదశి’ అనీ అంటారు.

ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు, ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీతో  కూడి బృందావనానికి వచ్చి, తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట!

కావున ఈ ద్వాదశి ని ‘బృందావన ద్వాదశి’ అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గరకు వస్తారు. ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి, సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా, ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే, సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.

దుర్వాస మహర్షి వారి చేత శపించబడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు; తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి, శ్రీమహావిష్ణువు ఆలోచనతో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు.

అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది ‘క్షీరాబ్ది ద్వాదశి’ అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి, నాలుగు నెలల తరువాత ‘కార్తిక శుద్ధ ఏకాదశి’ నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది ‘క్షీరాబ్ది ద్వాదశి’గా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి.

అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.

 

క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని, విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో, విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతాన్ని దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణ్వాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.

మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది.     ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి.

అందువల్లే తులసిని పూజించినవారి ఇంట, ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు. 

తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి. సత్యాదేవి తులాభారమున  రుక్మిణీదేవి తులసీదళము నుంచి తూచి, కృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.

గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధునికర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది.

వనవాసంలో సీతాదేవి కూడా తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది…

*పురాణగాథ:*

తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులు అను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందాన్నే తలదన్నిన అందగత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల  లేక పోవడంవల్ల, ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు, శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంఖచూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీ చేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి      దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు.

అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలయై సాలగ్రామ రూపాన ఉన్న తాను, లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు.

ఆనాటినుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.

#తులసి పూజ ఇలా చేయాలి:

తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి, వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి, అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలా చేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.   మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ, సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.

తులసీధాత్రీ సమేత దామోదర పూజ చేస్తారు. ఈరోజునే  క్షీరాబ్ది ద్వాదశి  అని కూడా అంటారు.

 

Products related to this article

Laksha Vattulu

Laksha Vattulu

One Lakh wicksDevotees who wish to get their wishes fulfilled by any deity will pledge to lit One Lakh wicks lamp. Once their desires are fulfilled will light One Lakh wicks before the deity. The wick..

₹270.00 ₹300.00

Koti Vattulu

Koti Vattulu

koti vattulu Koti vattulu is mostly used in Sravana and Karthika Masam. By lightning these wicks deities will be pleased, shower blessings..

₹2,500.00 ₹3,000.00

Laalcheee & Panchakattu Traditional Wear

Laalcheee & Panchakattu Traditional Wear

Explore the elegance of Laalcheee & Panchakattu Traditional Wear, a collection of timeless attire reflecting the rich cultural heritage of India. Crafted with exquisite craftsmanship and adorned w..

₹2,999.00