తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత.....

తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి 

తిరుమల, 2025 మార్చి 11:  తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Products related to this article

Brass Tirupathi Balaji Swarna Gopuram

Brass Tirupathi Balaji Swarna Gopuram

Bring home the divine aura with the Brass Tirupathi Balaji Swarna Gopuram. Perfect for temples, pooja rooms, and gifting on spiritual occasions. A symbol of devotion and prosperity...

₹3,500.00

Brass Small Shankh Chakra Set

Brass Small Shankh Chakra Set

Enhance your spiritual space with the Brass Small Shankh Chakra Set. A perfect blend of elegance and tradition for pooja rooms and temple decor. Ideal for gifting on auspicious occasions...

₹352.00