శ్రావణ సోమవారం వ్రతం
శ్రావణ మాసంలో ఆచరించవలసిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశిష్టమైనది. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరం. పరమశివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహాలాన్ని శ్రావణమాసంలోణే స్వీకరించి నీలకంఠుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున శివుడి కరుణాకటాక్షాలు పొందగారే వారు ఉపవాసం లేదా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు. సోమవారం రోజున పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివుడిని శక్తికొలదీ అభిషేకించి అర్చించాలి. ఈ రోజున పార్వతీదేవిణి కుంకుమ పూజ చేస్తే స్త్రీలకు ఐదవతనం చిరకాలం నిలిచి ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు. శ్రావణ సోమవారం నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివారాధన చేస్తాడట. శివుడిని భక్తితో అభిషేకించిన వారికి శివుడితో పాటు శ్రీమహావిష్ణువు కూడా అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రావణ సోమవార వ్రతాన్ని ఉత్తర భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఘనంగా నిర్వహిస్తారు.
Note: HTML is not translated!