దీపావళి నాలుగు రోజుల పండుగ.
1: మొదటిరోజు ధనత్రయోదశి
2: రెండవరోజు నరకచతుర్థశి
3: మూడవరోజు అమావాస్య దీపావళి
4: నాలుగవరోజు బలిపాడ్యమి.
ధనత్రయోదశి:
ఆశ్వీయుజ బహుళ త్రయోదశి (నరకచతుర్థశి ముందు వచ్చే తిథి) ధనత్రయోదశి అని అంటారు. దీనికే ధన్వంతరీ జయంతి అని మరొక నామం కూడా ఉంది. ధన్వంతరీ ఎవరంటే ... అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రం చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతిలో, మరొక చేతిలో, మూలికలు, చక్రం మిగతా చేతులలో ధరించి ఆశ్వీయుజ బహుళ త్రయోదశి రోజున ఉద్భవించాడు.
ధనత్రయోదశి కథ:
పూర్వం హిమ అనే రాజుకి ఒక్కడే సంతానం. ఆ బాలుడు క్షత్రియుడు కనుక కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలైన క్షత్రియ విద్యలు నేర్చుకున్నాడు. యువరాజు జాతకరీత్యా వివాహం అయిన నాలుగవ రోజున పాముకాటు వల్ల మరణిస్తాడు అని పురోహితులు తెలిపారు. అయినా ఒక రాకుమారి అతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. వారిరివురికీ వివాహం జరిగిన నాలుగవ రోజున రాకుమారి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి రాకుమారిడి గదిముందు బంగారు ఆభరణాలను రాశిగా పోసి, దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు వేసి, తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతూ ఉంటుంది. యముడు, రాకుమారుడి ప్రాణాలను తీసుకోవడానికి పాము రూపంలో వచ్చి గదిలోకి వెళ్ళడానికి సిద్ధపడతాడు. కానీ బంగారు ఆభరణాలపై దీ కాంతులు పడి దేదీప్యమానంగా వెలుగును ప్రసాదిస్తూ గదిని కాంతివంతం చేస్తుంది. పాముకి కళ్ళు కనబడక పోవడం, రాకుమారి పాడుతున్న పాటలు శ్రావ్యంగా ఉండడంతో పాటలను వింటూ అక్కడే ఉండిపోయాడు. ఈలోగా తెల్లవారిపోవడంతో, యమ ఘడియలు కూడా దాటిపోవడంతో యముడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆశ్వీయుజ బహుళ త్రయోదశి రోజు యముడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు. ఉత్తరభారతంలో ఆశ్వీయుజ బహుళ ధనత్రయోదశి రోజున ఇంటిముందు దీపాలు పెట్టి కార్తీకమాసం అయిపోయే వరకు దీపాలు వెలిగిస్తారు. పితృదేవతలు ధనత్రయోదశి రోజున ఇంటికి వస్తారని విశ్వాసం ఈ రోజున సంధ్యాసమయంలో తమ ఇంటిముందు దక్షిణదిశగా ఆరుబయట అన్నాన్ని రాశిగా పోసి దీపం వెలిగిస్తారు. ఈ దీపం వెలుగు పితృదేవతలకు దారి చూపిస్తుందని విశ్వాసం. దీన్నే యమదీపం అని కూడా అంటారు.
Note: HTML is not translated!