దీపావళి నాలుగు రోజుల పండుగ.
1. మొదటిరోజు ధనత్రయోదశి
2. రెండవరోజు నరకచతుర్థశి
3. మూడవరోజు అమావాస్య దీపావళి
4. నాలుగవరోజు బలిపాడ్యమి.
నరకచతుర్థశి :
ఆశ్వీయుజ బహుళ చతుర్థశినే నరక చతుర్థశి అని అంటారు. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రం అడుగులో దాక్కున్నాడు. దేవతలందరూ మహావిష్ణువుకి మొరపెట్టుకోగా, విష్ణుమూర్తి వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి, భూదేవిని సముద్రంలో నుండి పైకి తీసుకువచ్చాడు. ఆ సమయంలో భూదేవికి అసురసంధ్య సమయంలో నరకాసురుడు జన్మించాడు. అసురసంధ్య సమయంలో జన్మించడం వలన నరకాసురుడికి అసుర లక్షణాలు కలిగి ఉండేవాడు. నరకాసురుడు ఋషులను, మునులను వారు చేసే యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ వారిని శారీరకంగా కూడా వేధిస్తూ ఉండేవాడు. నరకాసురుడు లోకకంఠకుడైనా అతణ్ణి వధించరాదని, తన చేతులలోనే మరణించేలా శ్రీమహావిష్ణువు దగ్గర వరం పొందుతుంది భూదేవి. ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరించారు. నరకాసురుడు పెట్టే బాధలు తాళలేక మునులు, ఋషులు శ్రీకృష్ణుడిని అతడి నుండి కాపాడమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి బయలుదేరుతున్న సమయంలో సత్యభామ (భూదేవి) కూడా శ్రీకృష్ణుడి వెంట బయలుదేరింది. నరకాసురుడు, సత్యభామల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి నరకాసురుడు సత్యభామ చేతిలో ఆశ్వీయుజ కృష్ణ చతుర్థశి రోజు రాత్రి రెండు ఝాములకు మరణించాడు. నరకాసురుడు మరణించిన వార్త విన్న ప్రజలు, మునులు, ఋషులు మిగిలిన రాత్రి, మరుసటి రోజు పండగ జరుపుకున్నారు. కాబట్టి ఆ రెండురోజులు నరకచతుర్థశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధిపొందాయి. శ్రీకృష్ణుడు నరకాసురుడు మరణించే సమయంలో తన ఒంటిపై పడిన రక్తపుమరకలను వదిలించుకోవడానికి నూనెతో స్నానం చేశాడట. నరకచతుర్థశి రోజున హిందువులు తలకు నూనె పట్టించి తలస్నానం చేస్తారు. ఇది సాంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది. అలాగే నరకాసురుడి దిష్టిబొమ్మను ఈ రోజున తగలబెడతారు.
Note: HTML is not translated!