కార్తీక పురాణము - తొమ్మిదవ రోజు పారాయణం
అద్భుత పురుషుడికి అంగీసరుడు ఇలా ఉపదేశిస్తున్నాడు - నాయనా! ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను
అద్భుత పురుషుడికి అంగీసరుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ
శ్లో కర్మబందశ్స ముక్తైశ్చ కార్యంకారణ మేవ చ !
స్థూలసూక్ష్మం తథా ద్వంద్వం సంబంథో దేహముచ్యతే !!
కర్మబన్ధం, ముక్తి కార్యం, కారణ - స్థూలం సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే, దేహ మనబడుతుంది.
శ్లో అత్రబ్రూమ న్సమాధానం కొన్యోజీవస్య మేవహి
స్యయం వృచ్చ సిమాంకోహం బ్రహ్మై వాస్మి న సంశయః !!
జీవుదంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని? అని నువ్వే ప్రశ్నించుకుంటే 'నేనే బ్రహన్ నై వున్నాను. ఇది నిశ్చయము' అనే సమాధానమే వస్తుంది.
పురుష ఉవాచ : అంగీరసా! నువ్వు చెప్పిన వ్యాఖ్యాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు. నేనే 'బ్రహ్మన్ ను' అనుకోవడానికైనా 'బ్రహ్మన్' అనే పదార్ధం గురించి తెలిసి ఉండాలి కదా! ఆ పదార్థజ్ఞానం కూడా లేనివాడినైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను.
అంగీకసర ఉవాచ: అంతఃకారణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి, సాక్షి - సత్, చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలె రూపంగా ఉన్నా పిండశేషమూ, ఆకాశాది పంచభూతాల వలన పుట్టినదీ అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప 'ఆత్మ' మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలుగాని, ఆగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణంగాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేవివలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే 'ఆత్మగా' తెలుసుకో. ఆ 'ఆత్మ పదార్థమే నేనై వున్నాను' అనే విచిక్సను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమణి ఇతరాల చేత ఆకర్షంచబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తానూ నిర్వికారి అయి బుద్ధ్వాదులను ఐటం చలింప చేస్తున్నదే ఆత్మ వాచ్యమైన 'నేను'గా గుర్తుచు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరనరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాలనూ, వాది ఆద్యంతాలనూ గ్రహిస్తున్నదో అదే 'నేను'గా స్మరించు. ఘటాన్ని ప్రకాశింప చేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై 'నే' ననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి. సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య, అగోచర ప్రేమైకాకారమే 'నేను'గా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనదీ-జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలూ లేనిదీయే ఆత్మగా - అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా 'త్వమేనాహం'గా భావించు. ఈ విధంగా 'త్వం' (నీవు) అదే పదార్థజ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దర్థాన్ని గ్రహించాలి ('తత్' శబ్దానికి 'బ్రహ్మన్' అని అర్థం)
శ్లో అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విది ముఖేవ చ
వేదాంతానాం ప్రవృత్తిస్యా ద్విచార్య సుభాషితం !!
'అతః' శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. 'వ్యావృత్తి' అంటే - ఇది కాదు - ఇదీ కాదు - (నేతి=న+ఇతి, న+ఇతి = ఇది కాదు, ఇదీ కాదు) అనుకుంటూ = ఒకటొకటిగా ప్రతీదానినీ కొట్టి పారవేయడం - అంటే ఏ చెయ్యి 'బ్రహ్మన్ (ఆత్మ) కాదు ఈ కాలు 'ఆత్మ (బ్రహ్మన్)కాదు అనుకుంటూ - సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్నీ కూడా 'నేతి' (ఇది కాదు) అనుకుంటూ 'ఇది కాకపొతే మరి 'అది' ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది 'బ్రహ్మన్' (ఆత్మ) అని అర్థం. ఇక - సాక్షా ద్విధిముఖాత్ అంటే - 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ' అనే వాక్యాలద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లనే 'ఆత్మ' నరయగలగాలి అని అర్థం. ఆ 'ఆత్మ' సంసారం లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టి గోచరం కాదనీ, చీకటి నెరుగనిదని లేదా చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలులేనంతటి ఆనందమయమనీ, సత్వ ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ - పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయీ! ఏదైతే 'సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం'గా,వేదాలు కీర్తిస్తున్నాయో అ 'బ్రహ్మన్' "నేనే"నని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ. అదే నువ్వు, అదే నేను 'త దను ప్రవిశ్య' ఇత్యాది వాక్యాలచేత జీవాత్మరూపాన జగత్ప్రవేశమూ - ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము - కర్మఫల ప్రదత్వమూ - సర్వజీవ కారణకర్తృత్వమూ - దేనికైతే చెప్పబడుతూ వుందో అదే 'బ్రహ్మన్'గా తెలుసుకో. 'తత్ త్వమసి' = 'తత్' అంటే బ్రహ్మన్, లేదా ఆత్మ - త్వం అంటే నువ్వే - అనగా - నువ్వే పరబ్రహ్మన్ వని అర్థం. ఓ జిజ్ఞాసా! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మే ఆ పరమాత్మ - ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే 'తత్' శబ్దార్థం తనేననీ, 'త్వం' శబ్దసాధనమేగాని ఇతరం గాదనీ తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను, విను. తత్వమసి = తత్+త్వం+అసి. ఈ వ్యాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞాత్వ, సర్వజ్ఞాతా విశుష్టులైన జీవేశ్వరులను ప్రక్కనపెట్టి లక్ష్యార్థాలైణ ఆత్మలనే గ్రహించినట్లయితే 'తాదాత్మ్యం' సిద్ధిస్తుంది. (ముఖ్యార్థ వేధాశంక కలిగితే లక్షణావృత్తి నాశ్రయించాలి. అందులో 'భాగాలక్షణ' అనే దానివలన ఇది సాధింపబడుతూ వుంది. ఉదా ... సో యం దేవదత్త) ఆత్మసంపన్నా! 'అహం బ్రహ్మోస్మిన్' అనే వ్యాకార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో - శ్రవణమననాదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురు కటాక్షంవల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధకర్మ పీడిస్తూనే వుంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి - మోక్షం అంటారు. అందువల్ల, ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా వుండి, తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన -ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనేగాని, లేదా - ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాసపరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులు అవుతారు. 'నాయనా! బందించేవి - ఫలవాంఛిత కర్మలు. ముక్తిని ఇచ్చేవి - ఫలపరిత్యాగ కర్మలు' అని ఆపాడు అంగీరసుడు.
పదిహేడవ అధ్యాయం సమాప్తం
పద్దెనిమిదొవ అధ్యాయం
అంగీరసుడు చెప్పింది విన్న అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో ...
అంగీరసుడు ఇలా చెబుతున్నాడు: చక్కటి విషయాన్ని అడిగావు. శ్రద్ధగా విను. సుఖదుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని, దానికి అతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి, దానిద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహాదారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలయిన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి.
శ్లో స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్థవత్ !
ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం !!
స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే - ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందునా బ్రాహ్మణులకు ప్రాతఃస్నానం వేదోక్తమై వుంది.
శ్లో ప్రాతస్నానే హ్యశక్తశ్చే త్పుణ్యమాసత్రయోత్తమం !
తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే !!
మకరస్థే రవౌ మాఘే వైశాఖే మేషణే రవౌ !
ప్రతిరోజునా ప్రాతఃస్నానం చెయ్యలేనివాళ్ళు - తులా - కార్తీక, మకర, మాఘ, మేష - వైశాఖాలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ మూడు మాఆలైనా ప్రాతఃస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పున్యకాలాలలోగాని, చంద్ర, సూర్య గ్రహణ పర్వాలలోగాని స్నానం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలాలా బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వ ప్రజలకూ స్నానసంధ్యా జప, హోమ, సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదలినవాడు రౌరవ నరకగతుడై - పునః కర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా! పుణ్యాకాలలన్నింటా సర్వోత్తమమైనదీ కార్తీకమాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటికంటే వెలుగూ లేనట్లుగానే, కర్తీకమాసంతో సమానమైన పుణ్యకాలంగాని, కార్తీక దామోదరుడికన్నా దైవంగాని లేడని గుర్తించు. కర్మమర్మాన్ని తెలుసుకుని, కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు. నాయనా! విష్ణువు లక్ష్మీ సమేతుడై, ఆషాఢ హుక్ల దశమ్యాంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పునః హరిబోధినీ అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిడురలేస్తాడు. ఈ నడుమ నాలుగు మాసలనే చాతుర్మాస్య (వ్రతం) అంటారు. విశువుకు నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలూ కూడా ఎవరైతే హరిధ్యానం, పూజలూ చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా - నారదుడు అక్కడకు వెళ్ళి వారికి మ్రొక్కి 'హే శ్రీహరీ! భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్యసుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై వున్నారు. వారెలా విముక్తులు అవుతారో తెలియక నేను దుఃఖితుదిని అవుతున్నాను' అని విన్నవించాడు. నారదుడి మాటలను విశ్వసించిన నారాయణుడు, సతీసమేతుడై వృద్ధబ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ, బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీ నారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు. ఇలా ఒకటేమిటి? అతి తక్కువ పుణ్యకార్యాచరుణులనీ, అత్యధిక పాపాచరణాల్ని చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతనా మనస్కుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యధారూపాన్ని పొంది ఉండగా, జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు. అనేక విధాలుగా స్త్రోత్రించాడు.
పదిహేడు - పద్దెనిమిది అధ్యాయాలు సమాప్తం
తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!