స్పటికమాల - ఆరోగ్యం
ఈరోజు మీకు ఖర్చు అవ్వకుండా అనేక రోగాలు తగ్గే మార్గం చెబుతాను. "వైద్యో నారాయణో హరి" అన్నారు పెద్దలు.. అంటే వైద్యుడు అంటే దేవుడితో సమానం.. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ధన్వంతరి రూపంలో ప్రకృతి (ఆయుర్వేదం) వైద్యాన్ని, వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు.. అని వేదం చెబుతుంది.. ఇక అసలు విషయానికి వద్దాం..
ఈ క్రింది అనారోగ్యంతో బాధపడేవారికి ఇంకా ఎక్కువ ఉపయోగాలు
నిత్యం శిరోభారం (తలనొప్పి), వేడి పొంగడం( పెదాలమీద, ముక్కుల్లో నీటి కాయలు ఏర్పడతాయి), జ్వరం, అరికాళ్ళ మంటలు, అరచేతుల మంటలు, జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా సెగలు, నిద్రలేమి, మూత్రం పసుపు రంగులో రావడం, మనస్సు అదుపు కోల్పోవడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ఇలాంటి రోగాలు తగ్గాలంటే ఒక్కటే మార్గం.. మీకు మీ దగ్గరలోనే దొరికే ఖరీదునిబట్టి ఉంటుంది.. ఒకసారి కొంటే జీవితకాలం ఉపయోగపడుతుంది..
ఇంతకీ ఏంటి అని ఆతృతగా ఎదురుచుస్తున్నారా!
దీనికి జవాబు : స్పటిక మాల (100 కు పైగా)... స్పటిక మాల ధరిస్తే ఇలాంటి రోగాలన్నీ కచ్చితంగా పోతాయి..
ఈ స్పటికమాలను ఎలా గుర్తించాలి?
స్పటికమాలలోని పూసలను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది. ఇది వెలుగులో అంతగా గమనించలేరు కనుక చీకట్లో పరిశీలించండి.. రెండు పూసలని ఒకదానితో ఒకటి రాపిడి (కొడితే) నిప్పు రావాలి. లేదంటే పనికిరాదు..
ఎక్కడ దొరుకుతాయి : దేవాలయాల దగ్గర, ఇస్కాన్ దేవాలయాలలో, ఇప్పుడు ఆన్-లైన్ లోనూ దొరుకుతున్నాయి. చాలామంది గమనించే ఉంటారు! రుద్రాక్షలు తీసుకొని బోయవాళ్ళు, ఎరుకల వాళ్ళు తిరుగుతారు, వీళ్ళ దగ్గర కూడా మంచివే దొరుకుతాయి. రేటు కూడా బేరం ఆడొచ్చు.. కాకపోతే ఎక్కడ తీసుకున్నా ఒకసారి పరిశీలించి తీసుకోండి..
గమనిక : ఇక్కడ గమనించదగిన విషయం ఇంకొకటి కూడా ఉంది. అశుచిగా ధరించకూడదు. ఇవి ధరించి రతిలో పాల్గొనడం, మల విసర్జన చేయరాదు. స్త్రీలు బయట ఉండే మూడు రోజులు ధరించరాదు. స్నానం చేయకుండా ధరించకూడదు. ఎదుటివారిని దూషించడం, పతనం చేయాలనీ ఆలోచించడం, పరస్త్రీ వ్యామోహం, తాగుడు, అనవరపు వాగుడు, అనవసరపు ఆలోచనలు పనికిరావు.. దైవనామ జపం చేస్తే ఇంకా మంచిది.. కనుక ఈ కొన్ని జాగ్రత్తలు అయినా తీసుకొని స్ఫటిక మాలను ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. పైనవి అన్ని చేయకపోతే తగ్గవా? అంటే తగ్గుతాయి. దాని ప్రభావం దానిదే! కాని మనం పశువులం కాదు కదా! శాస్త్రాన్ని కూడా అనుసరిస్తే అనుకున్నదాని కంటే వేలరెట్లు ఫలితాలు వస్తాయి..