Procedure Of Kedareswar Vrat

Procedure Of Kedareswar Vrat


ఆచమనం :


ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా (గ్లాసు లేదా చెంబులోని నీళ్ళను ఉద్ధరిణి లేదా చెంచాతో ముందుగా ఒకసారి నీళ్ళను అరచేతిలో వేసుకుని చేతులు శుభ్రం చేసుకోవాలి. తరువాత పైన చెప్పిన ఒక్కొక్క నామం చదువుతూ మూడు సార్లు తీర్థంగా స్వీకరించాలి. మళ్ళీ ఒకసారి నీళ్ళును అరచేతిలో వేసుకుని చేతులు శుభ్రం చేసుకోవాలి)
గోవిందాయనమః: విష్ణవే నమః, మధుసూధనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః,శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమః.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్మృరేత్పుండరీ కాక్షం సదాహ్యాభ్యంతరం శుచిః

శ్రీ గోవింద గోవింద
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ఓంభూః ఓం భువః ఓగం సువః, ఓం మహః ఓంజనః ఓంతేపః ఓంగుం సత్యం ఓంతేత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.
ప్రాణాయామము చేసి దేశకాలాలను స్మరించి సంకల్పం చేసుకోవాలి.
మమోపాత్త దురతక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .... సంవత్సరే, ... ఆయనే, ... మాసే ... పక్షే ... తిథి ... వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ... నామధేయః (ధర్మపత్ని సమేత) మమధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివ్రుద్ధ్యార్థం, సర్వాభీష్ట సిద్ద్యర్థం సిద్ధి వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలాశారాధానం కరిష్యే.

కలసస్య ముఖే విష్ణుః కంటే రుద్రసమాశ్రితః, మాలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః అంగైశ్చ సాహితాసర్వే  కలశాంబు సమాశ్రితః


శ్లో     గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
    నర్మదా సొందు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
    కావేరి తుంగభద్రాచ కృష్ణవేన్యాచ గౌతమీ
    భాగీరదీచ ప్రఖ్యాతాః పంచాగంగాః ప్రకీర్తితితః
ఆయంతు దేవపూజార్థం మమ (యజమానస్య) దురతక్షయకారకాః కలశోధకేన పూజా ద్రవ్యాని సంప్రోక్షయః (కలశంలోని నీళ్ళను పూజా ద్రవ్యాలపై, దేవునిపై, తమ శిరస్సుపైన కొద్దిగా చల్లుకోవాలి)
ధ్యాయే గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
        శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ సముద్భవ శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం! శ్రీ మహా గణాధిపతయే నమః ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ! శ్రీ మహా గణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే-స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ! శ్రీ మహా గణాధిపతయే నమః పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ! ఆచమనీయం సమర్పయామి
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ! మధుపర్కం సమర్పయామి
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ! పంచామృత స్నానం సమర్పయామి
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే ! శుద్దోదక స్నానం సమర్పయామి
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబో దరహరాత్మజ ! వస్త్రయుగ్మం సమర్పయామి
రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ! ఉపవీతం సమర్పయామి
చంద నాగురు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ! గంధాన్ సమర్పయామి
అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాంస్తుండలాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే ! అక్షతాన్ సమర్పయామి
సుగంధ సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే ! పుష్పాణి పూజయామి

శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ:


ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం  మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం సర్వసిద్ధప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమారా గురవే నమః
ఓం కుంజరాసురభంజయాన నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటనే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విశ్వగ్ద్రుశే నమః
ఓం విశ్వరక్షావిదానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్కైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


దశాంగం గుగ్గులోపెతం సుగంధం, సుమనోహరం, ఉమాసుతే నమస్తుభ్యం గృహాణ వరదోభవ


దూపమాఘ్రాపయామి : సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్ని నాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ... దీపం దర్శయామి
సుగందాసుకృతాంశ్చైవమోదకాన్ ఘ్రుతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్
భక్షం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ... నైవేద్యం సమర్పయామి
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్య వినాయక ... సువర్ణపుష్పం సమర్పయామి
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ... తాంబూలం సమర్పయామి
ఘ్రుతవర్తి సహస్త్రై శ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ ... నీరాజనం సమర్పయామి


శ్రీకేదారేశ్వర పూజ:


శూలం ఢమరుకంచైవ - దదానం హస్త యుగ్మకే కేదరదేవమీశానం ద్యాయేత్ త్రిపుర ఘూతినమ్ ... శ్రీ కేదరేశ్వరాయనమః ... ధ్యానం సమర్పయామి
కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో
ఆగచ్చ దేవదేవేశ మద్భక్తా చంద్రశేఖర శ్రీకేదారేశ్వరాయనమః .... ఆవాహయామి
సురాసుర శిరోరత్న - ప్రదీపిత పదాంబుజ
కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్ శ్రీ కేదారేశ్వరాయనమః ... ఆసనం సమర్పయామి
గంగాధర నమస్తేస్తు - త్రిలోచన వృషభద్వజ
మౌక్తికాసన సంస్థాయ - కేదార నమోనమః శ్రీ కేదారేశ్వరాయనమః ... పాద్యం సమర్పయామి
అర్ఘ్యం గృహాణ భగవన్ - భక్త్యాదత్తం మహేశ్వర
ప్రయచ్చమే మనస్తుభ్యం - భక్తానా మిష్టదాయకం శ్రీ కేదారేశ్వరాయనమః ... అర్ఘ్యం సమర్పయామి
మునిభిర్నా రాదప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః
కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో శ్రీ కేదారేశ్వరాయనమః ... ఆచమనీయం సమర్పయామి
స్నానం పంచామృతైర్దేవ శుద్ధ శుద్ధోద కైరపి
గృహాణగౌరీరమణత్వద్భక్తేన మయార్పితం ... శ్రీ కేదారేశ్వరాయనమః పంచామృతస్నానం సమర్పయామి
నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం
స్నానం స్వీకురుదేవేశ - సదాశివ నమోస్తుతే ... శ్రీకేదారేశ్వరాయనమః స్నానం సమర్పయామి
వస్త్ర యుగ్మం సదాశుభ్రం - మనోహర మిదం శుభం
దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం ... శ్రీ కేదారేశ్వరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి
స్వర్ణ యజ్ఞోపవీతం కాంచనం చోట్టరీయకం
రుద్రాక్షమాలయా యుక్తం - దదామి స్వీకురు ప్రభో ... శ్రీకేదారేశ్వరాయనమః యజ్ఞోపవీతం సమర్పయామి
సమస్త గ్రంధద్రవ్యాణాం - దేవత్వమసి జన్మభూః
భక్త్యాసమర్పితం ప్రీత్యా - మయాగంధాది గృహ్యతామ్ ... శ్రీ కేదారేశ్వరాయనమః గంధాన్ ధారయామి
అక్షతో సి స్వభావేన - భక్తానామక్షయం పదం
దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీ యతాం భావాన్ శ్రీ కేదారేశ్వరాయనమః ... అక్షతాన్ సమర్పయామి
కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా శ్రీ కేదారేశ్వరాయనమః పుష్పాణి పూజయామి
తతః ఇంద్రాది లోకపాలక పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే (కుడివైపు) బ్రాహ్మణేనమః ఉత్తరభాగే (ఎడమవైపు) విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః

అథాంగ పూజ:


మహేశ్వరాయ నమః     -      పాదౌపూజయామి
ఈశ్వరాయ నమః         -      జంఘే పూజయామి
కామరూపాయ నమః    -     జానునీ పూజయామి
హరాయ నమః            -     ఊరూ పూజయామి
త్రిపురాంతకాయ నమః   -   గుహ్యం పూజయామి
భవాయ నమః             -    కటిం పూజయామి
గంగాధరాయ నమః      -    నాభిం పూజయామి
మహాదేవాయ నమః     -    ఉదరం పూజయామి
ప్శుపతయే నమః        -   హృదయం పూజయామి
పినాకినే నమః            -   హస్తాన్ పూజయామి
శివాయ నమః            -    భుజౌ పూజయామి
శితికంఠాయ నమః       -   కంఠం పూజయామి
విరూపాక్షాయ నమః     -    ముఖం పూజయామి
త్రినేత్రాయ నమః          -    నేత్రాణి పూజయామి
రుద్రాయ నమః            -    లలాటం పూజయామి
శర్వాయ నమః             -    శిరః పూజయామి
చంద్రమౌళయే నమః      -     మౌళిం పూజయామి
పశుపతయే నమః        -     సర్వణ్యాంగాని పూజయామి

కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ


ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వాసుదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపణాయే  నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారయే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషంకాయ నమః
ఓం వృషభరూఢాయ నమః
ఓం భాస్మోద్ధూళితవిగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్థర్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాసనే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం ఆహిర్బుద్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పాత్ర పుష్పపూజాం సమర్పయామి

అధసూత్రపూజ:


ఓం శివాయ నమః                 -      ప్రథమగ్రంధిం పూజయామి
ఓం శాంతాయ నమః               -     ద్వితీయగ్రంధిం పూజయామి
ఓం మహాదేవాయ నమః         -      తృతీయగ్రంధిం పూజయామి
ఓం వృషభద్వజాయ నమః       -      చతుర్థగ్రందిం పూజయామి
ఓం గౌరీశాయ నమః               -     పంచమగ్రందిం పూజయామి
ఓం రుద్రాయ నమః                -      షష్ఠగ్రందిం పూజయామి
ఓం పశుపతయే నమః            -      సప్తమగ్రందిం పూజయామి
ఓం భీమాయ నమః                -      అష్టమగ్రందిం పూజయామి
ఓం త్రయంబకాయ నమః         -      నవమగ్రందిం పూజయామి
ఓం నీలలోహితాయ నమః        -      దశమగ్రందిం పూజయామి
ఓం హరాయ నమః                -       ఏకాదశగ్రందిం పూజయామి
ఓం స్మరహరాయ నమః          -      ద్వాదశగ్రందిం పూజయామి
ఓం భర్గాయ నమః                 -      త్రయోదశగ్రందిం పూజయామి
ఓం శంభవే నమః                   -     చతుర్థగ్రందిం పూజయామి
ఓం శర్వాయ నమః                -     పంచదశగ్రందిం పూజయామి
ఓం సదాశివాయ నమః           -      షోఢశగ్రందిం పూజయామి
ఓం ఈశ్వరాయ నమః             -     సప్తదశగ్రందిం పూజయామి
ఓం ఉగ్రాయ నమః                 -      అష్టాదశగ్రందిం పూజయామి
ఓం శ్రీకంఠాయ నమః              -      ఏకోన వింశతిగ్రందిం పూజయామి
ఓం నీలకంఠాయ నమః           -      వింశతిగ్రందిం పూజయామి
ఓం మృత్యుంజయాయ నమః   -      ఏకవింశతి గ్రందిం పూజయామి

దశాంగం ధూపముఖ్యంచ - హ్యంగార వినివేశితం
ధూప సుగంధై రుత్పన్నం - త్వాంప్రిణయతుశంఖరశ్రీ కేదారేశ్వరాయనమః ధూపమాఘ్రాపయామి
యోగీనాం హృదయే ష్వేవ - జ్ఞానదీపాంకురోహ్యపి
బాహ్యదీపో మయాదత్తో - గృహ్యతాం భక్త గౌరవాత్ శ్రీకేదారేశ్వరాయనమః దీపం సమర్పయామి
తైలోక్యమసి నైవేద్యం - తత్తే తృప్తిస్తథాబహిః
నైవేద్యం భక్తవాత్వల్యాద్గ్రుహ్యతాం త్ర్యంబకత్వయా శ్రీ కేదారేశ్వరాయనమః మహానైవేద్యం సమర్పయామి
నిత్యానంద స్వరూపస్త్యం - మోగిహృత్కమలేస్థితః
గౌరీశభక్త్యామద్దత్తం - తాంబూలం ప్రతిగృహ్యాతామ్ శ్రీకేదారేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి
అర్ఘ్యం గృహాణ్ భగవాన్ - భక్త్యాదత్త మహేశ్వర
ప్రయచ్చ మే మనస్తుభ్యం - భక్తాన మిష్టదాయక శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం సమర్పయామి
దేవేశ చంద్ర సంకాశం - జ్యోతి సూర్యమివోదితం
భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః శ్రీకేదారేశ్వరాయనమః కర్పూర నీరాజన దర్శయామి
ఓం తత్సురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నోరుద్రఃప్రచోదయాత్
నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే శ్రీకేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
భూటన భువనాదీశ - సర్వదేవాది పూజిత
ప్రదక్షిణం కరోమిత్యాం - వ్రతం మే సఫలం కురు శ్రీకేదారేశ్వరాయనమః ప్రదక్షిణం సమర్పయామి
హరశంభో మహాదేవ - విశ్వేశామరవల్లభ
శివశంకర సర్వాత్మా - నీలకంఠ నమోస్తుతే శ్రీకేదారేశ్వరాయనమః నమస్కారాన్ సమర్పయామి
ఛతరమాచ్చాదయామి, చామరేణ విజయమి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి, సమస్తరాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార సమర్పయామి
అభీష్టసిద్ధిం కురుమే శివావ్యయ మహేశ్వర! భక్తానాం మిష్టదానార్థం మూర్తీకృతకళేభరః (పూజా తోరము తీసుకుంటున్న సమయంలో పఠించు మంత్రం)
కేదారదేవదేవేశ భాగవన్నంభికా పతే! ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభోః (తోరము కట్టుకోవడానికి పఠించు మంత్రం)
ఆయుశ్చ విద్యాం చ తథా సిఖంచ సౌభాగ్యవృద్ధిం కుర దేవ దేవ
సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే (వాయనం ఇచ్చే సమయంలో పఠించునది)
కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః
వ్రతిమాదాన మంత్రం
కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు శ్రీ రచంచలా!!
శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః సుప్రసన్నోవరదోభవతు మమ ఇష్టకామ్యర్థ సిద్ధిరస్తు


                పూజా విధానం సంపూర్ణం


                శ్రీ కేదారేశ్వర వ్రత కథ


పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్థభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమైన కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసింది అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు.
శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండుసభలో కూర్చుని ఉన్నారు. సిద్ధ-సాధ్య-కింపురుష-యక్ష-గంధర్వులు శివుడిని సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమథగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో కూర్చుని ఉన్నారు. నారద, తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమలా, వకుళ, నారికేళ, చందన, పనస, జంభూ వృరుక్షములతోను చంపక, పున్నాగ, పారిజాతి పుష్పాలతోను. మణిమయ మకుట కాంతులతో వెలుగొందు నదీ పర్వతములతోను, చతుర్థశ భువనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనందకోలాహలములలో భృంగురీటి అనబడే శివభక శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యం చేయసాగాడు. అతడు వినోద సంభారితమైన నాట్యభంగిమలతో సభాసదులను, శివుడ్ని మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతన్ని అభినందించి ప్రక్కనే ఉన్న పార్వతిని విడిచిపెట్టి సింహాసనంపై నుండి లేచి భృంగురీటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునుగా భృంగి మొదలు వందిమాగాదులు శివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి 'నాథా! నన్నువిడిచి మీకు మాత్రమే వీరు నమస్కరించారు. ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీనుండి నన్ను వేరుచేసి ఇలా ఎలా చేశారు' అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని దగ్గరకు తీసుకుని 'దేవీ!పరమార్థ విదులైన యోగులు నీవలన ప్రయోజనం కలుగజేయవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు' అని జవాబు ఇచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై వుండి అ దండప్రణామాలకు నోచుకోని అయోగ్యురాలిని అని కోపగించి ఈశ్వరునితో సమానంగా యోగ్యతను సంపాదించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. కైలాసాన్ని వదిలి శరభ శార్దూల గజాలు గల నాగ గరుడ చకవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప మొదలైన వాటితో సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథిమర్యాదలు చేశారు. తల్లీ నీవు ఎవరివి? ఎవరి దానవు? ఎక్కడినుండి వచ్చావు? నీ రాకకుగల అగత్యం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించా రు.
వారి ప్రశ్నలకు అమితంగా ఆనందించిన పార్వతి యజ్ఞయాగాల వంటి క్రతువులతో పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రులారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాదుడితో సమానమైన యోగ్యతను పొందడం కోసం తపస్సు చేయాలని సంకల్పించాను. దీని నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని తెలిపింది పార్వతి. మహర్షులారా! జగత్కల్యాణాన్ని అభిలషించేవారా! నేను ఆశించిన ఫలంపొంది శివుని అర్థాంగినయి తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతం ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతమిడిని కోరింది పార్వతి. జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైన ఏకవింశతి దారంతో చేతికి తోరణాన్ని కట్టుకుని షోడశోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. మరుసటిరోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారం తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజునుండి అమావాస్య వరకు పూజాక్రమంతో కేదారేశ్వరుడిని ఆరాదించాలి. ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభం పెట్టి ఇరువై ఒక్క సార్లు సూత్రాన్ని చుట్టి పట్టువస్త్రంతో దాన్ని కప్పి ఉంచి నవరత్నాలు గాని సువర్ణంగాని ఉంచి గంధపుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలను కడిగి కూర్చుబెట్టి కదళీఫలాలు పనసలు ఆరగింప చేసి తాంబూల దక్షిణలు ఇచ్చి వారిని తృప్తి పరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోబీష్టసిద్ధిని కలుగజేస్తాడు అని గౌతముడు పార్వతికి వివరించాడు.
గౌతమ మహర్షి చెప్పిన విధివిధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగ భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్ట అంతరంగితుడై ఆమె అభీష్టానుసారం తన శరీరంలో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. అప్పుడు జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసమైన కైలాసానికి చేరుకుంది.
కొంతకాలానికి శివ భక్తపరాయణుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకానికి దాన్ని వెల్లడి చేయాలని దివినుండి భువికి దిగివచ్చి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగారాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడు అయ్యాడు.

ఆ తరువాత ఉజ్జయినీ నగరంలో ఉన్న వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి జనకా మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగారు. అందుకు అతడు బిడ్డలారా! నేను దరిద్రుడను. సామానులను సమకూర్చగలిగేటంతటి వాడిని కాను, మీరు ఆలోచనను మానుకోండి అని చెప్పాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞే మాకు ధనం అనుమతిని ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిద్దరూ ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరణాలు కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తకంగా వ్రతం చేశారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందరరూపాలను ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయస్సు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామే పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామే భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రయిన వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవించాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తే భాగ్యవతి ఐశ్వర్య మధోమ్మత్తురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాడి ఇంట్లో ఆశ్రయం పొందింది.
ఒకరోజు ఆమె తన కుమారుడిని దగ్గరికి పిలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె దగ్గరకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం ఆర్జించి తీసుకుని రమ్మని చెప్పి

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

₹1,600.00

Job Joining Muhurtham

Job Joining Muhurtham

Job Joining Muhurtham ..

₹2,500.00

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil Ashta Mulika Oil is used for lightning Diya's before deities and it is best for lightning. This oil is prepared by mixiture of lifelong herbs with Lakshmi Tamara seeds, kasturi be..

₹180.00

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu..

₹22.00 ₹25.00

0 Comments To "Procedure Of Kedareswar Vrat"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!