కార్తీక మాసంలో ఏ ఏ రోజు ఏమి దానం చేస్తే బాగుంటుంది?
కార్తీకంలో ప్రతి రోజు అమూల్యమైనదే !! కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో మాత్రం అది కొద్దిమందికే తెలుస్తుంది. అందరికీ కార్తీక శుభదినాలను ఎలా ని ర్వహించుకోవాలి, ఏం చేయాలి, దేన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయో వేద పండితులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందామా..
♦ మొదటి రోజు : నెయ్యి, బంగారం.
♦ రెండవ రోజు : కలువపూలు, నూనె, ఉప్పు.
♦ మూడో రోజు : తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. ఉప్పు దానం చేయడం శుభప్రదం. ఫలితంగా శక్తి, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి.
♦ నాలుగో రోజు : కార్తీకశుద్ధ చవితి. నాగులచవితిని పురస్కరించుకుని వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. నూనె, పెసరపప్పు, దానం ఇవ్వాలి. సద్భుద్ది, కార్యసిద్ధి సాధ్యమవుతుంది.
♦ ఐదో రోజు : ఈ రోజును జ్ఞానపంచమి అంటారు. ఆదిశేషుని పూజించాలి. ఫలితంగా కీర్తి లభిస్తుంది.
♦ ఆరో రోజు : షష్టి రోజున బ్రహ్మచారికి ఎర్ర గళ్ళకండువా దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు.
♦ ఏడో రోజు : సప్తమి రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రని వస్త్రంలో గోధుమలు దానం చేయాలి. దీంతో ఆయుష్సు వృద్ధి చెందుతుంది.
♦ ఎనిమిదో రోజు : అష్టమినాడు గోపూజ చేస్తే విశేష ఫలితాలు ఇస్తుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది.
♦ తొమ్మిదో రోజు : నవమినాటి నుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఫలితంగా ఆత్మరక్షణ, సంతాన రక్షణ ఉంటుంది.
♦ పదో రోజు : విష్ణువుని పూజించాలి. స్వయంపాకం, నూనె దానాలు ఆచరించాలి. దీంతో కీర్తి, ధన లాభం కలుగుతుంది.
♦ 11వ రోజు : ఈ ఏకాదశికే బోదనైకాదశి అని పేరు ఉంది. ఈ రోజు శివుడు, విష్ణువుని పూజిస్తే ధనప్రాప్తి, పదవీ యోగం కలుగుతుంది.
♦ 12వ రోజు : దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఉసిరి, తులసి మొక్కల వద్ద దామోదరుడిని ఉంచి పూజించి దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగుతాయి.
♦ 13వ రోజు : పువ్వులు దానం చేయాలి. వనభోజనాలు పెట్టుకోవడం మంచిది. మన్మథుడిని పూజించడంతో వీర్యవృద్ధి, సంతానవృద్ధి, సౌందర్యవృద్ధి కలుగుతుంది.
♦ 14వ రోజు : పాషాణ చతుర్దశి వ్రతం చేస్తారు. దున్నపోతు, లేకుంటే గేదెను దానం చేస్తారు. యముడిని పూజించడంతో అకాల మృత్యువులు తొలగుతాయి.
♦ 15వ రోజు : కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానమాచరించి శివాలయాల వద్ద జ్వాలాతోరణం వెలిగించాలి. సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. చంద్రుడిని పూజించడంతో మనశ్శాంతి కలుగుతుంది.
♦ 16వ రోజు : కార్తీక బహుళపాడ్యమి. ఈ రోజున స్వథాగ్నిని పూజించాలి. ఆకుకూరలు దానం చేయాలి. ఫలితంగా పవిత్రత చేకూరుతుంది.
♦ 17వ రోజు : విదియ రోజున ఆశ్వనీదేవతను పూజిస్తారు. ఔషధాలు దానం చేయాలి. వనసమారాధన చేస్తారు. ఫలితంగా సర్వవ్యాధి నివారణ సాధ్యమవుతుంది.
♦ 18వ రోజు : తదియ రోజున పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించాలి. వారి చల్లనిచూపులు ప్రసరించి తెలివితేటలు వృద్ధి చెందుతాయి.
♦ 19వ రోజు : చవితినాడు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించాలి. ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే విఘ్నాలు తొలగుతాయి.
♦ 20వ రోజు : పంచమిరోజున నాగేంద్రునికి పూజలు చేయాలి. చీమలకు నూకలు చల్లడం, కుక్కలకు అన్నం పెట్టడంలాంటివి చేయడంతో సంతానవృద్ధికలుగుతుంది.
♦ 21వ రోజు : షష్టినాడు గ్రామదేవతలకు పూజచేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
♦ 22వ రోజు : సప్తమినాడు జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి.
♦ 23వ రోజు : అష్టమినాడు కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవాలకు వేస్తే ధనప్రాప్తి సిద్ధిస్తుంది.
♦ 24వ రోజు : నవమినాడు శ్రీ దుర్గను పూజించి వెండి లేదా రాగితో చేసిన కలశంలో నీరు పోసి పండితులకు దానం చేయడంతో పితృదేవతలు తరిస్తారు.
♦ 25వ రోజు : దశమిరోజున అన్నసంతర్పణలు చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి.
♦ 26వ రోజు : ఏకాదశి రోజున కుబేరుడిని పూజిస్తారు. వైష్ణవ ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ, విశేష ఫలితాలు ఇస్తాయి.
♦ 27వ రోజు : ద్వాదశి పర్వదినాన కార్తీక దామోదరుడిని పూజించాలి. అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించాలి. ఫలితంగా మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి లభిస్తాయి.
♦ 28వ రోజు : త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన మంచిది. దీంతో గ్రహదోషాలు తొలగుతాయి.
♦ 29వ రోజు : చదుర్దశి మాసశివరాత్రి నాడు ఈశ్వరార్చన, అభిషేకం చేస్తే అపమృత్య దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి.
♦ 30వ రోజు : అమావాస్యనాడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు, పప్పుతో కూడిన సమస్త పదర్ధాలను దానం చేయాలి. దీని వల్ల పెద్దలకు నరకబాధలు తొలగుతాయి. స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయి.
Note: HTML is not translated!