తిరుప్పావై పాశురము - 3
ఓంగి యులగాళన్ద ఉత్తమన్ పెర్పాది
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెళ్ ఊడు కయులుగళ
పూంగువళై పోదిల్ పోరివన్డు కన్పడుప్ప
తేంగాదే పుక్కరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్
నోము నోచడడంవల్ల లోకానికి కలిగే మేలు ...
మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముని నోరారా కీర్తిస్తూ సంకల్పం చెప్పుకొని, నోముపట్టి చన్నీట స్నానం చేస్తే శుభాలు కలుగుతాయి, పాపాలు తొలగుతాయి. రోగాలు, దుర్భిక్ష తస్కరాది భయాలు ఉండవు. దేశమంతా నెలకు మూడువానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి. ఆ సమయంలో ఎగసిపడే చేపలతో నీటికయ్యలూ, మత్తుగా తేనెతాగి నిద్రిస్తున్న తుమ్మెదలతో నిండిన ఎఱ్ఱని కలువలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. నిండిన పొదుగులు కలిగి ఎంతసేపు పాలు పితికినా కదలని గోగణాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి. ఇటువంటి వ్రతాన్ని మనం ఆచరిద్దాం రారే! అని ఆండాళ్ తన చెలియలతో చెప్పి పిలుస్తోంది.
Note: HTML is not translated!