తిరుప్పావై పాశురము - 10
నోట్రుచ్చు వర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాత్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియానాల్, పన్నోరునాళ్,
కూట్రిత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్
శ్రీకృష్ణునితో ఎక్కువ చనువు కలిగిన గోపికను మేల్కొల్పడం ...
ఓ చెలీ! మంచి నోము నోచి స్వర్గసుఖాలు అనుభవించుచున్నదానా! తలుపు బిగించి పడుకొంటివేమే? తలుపు తీయవే? పోనీలే తలుపు తియ్యకున్నా ఫరవాలేదు. ఒక్క మాటైనా నోటితో పలుకరాదా! నీతోడి ఒక్కమాటకైనా మేము నోచుకోలేదా! కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను నీకిచ్చి వెళ్ళాడేమోకదా! అందుకే అంత మొద్దునిద్ర నీకు ఆవహించింది. దివ్యపరిమళభరితమగు తులసీమాలలను ధరించివున్న శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించినట్లయితే మనకు కావలసిన కోరికలిస్తాడు. మా గోపికాబృందమునకు అలంకార ప్రాయమైనదానా! ఇకనైనా తెలివి తెచ్చుకొని నిద్దురలేచి తలుపు తెరు! ఈ వేకువన మనమందరం వ్రతమాచరిద్దాం.
Note: HTML is not translated!