తిరుప్పావై పాశురము - 12
కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనితైలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్ని జ్ఞ్గే క్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నేళులున్దిరాయ్ ఈదెన్న పెరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
కృష్ణుని నేస్తమైన ఒక సంపన్నుని చెల్లెల్ని మేల్కొల్పడం ...
ఓ గోపికామణీ! తాళ్ళతో కట్టివేసిన దూడల అరుపువిని, వాటిమీద వాత్సల్యంచేత పొదుగులు చేపి, వాటినుండి పాలు కారిపోవడం వల్ల ఇంటి ముంగిట బురద బురదగా అయిన పశుసంపద వృద్ధిపొందిన గోపకునికి చెల్లెలైనదానా! తలలపై కురిసే మంచువల్ల తడుస్తూ నీ ఇంటిముంగిట కాచుకొనివున్నాం. తన సతిని చెరబట్టిన లంకేశుని చంపినట్టి శ్రీరామచంద్రుని గూర్చి పాడుతున్న మమ్ము చేరరావే! చేరి నీవు నోరారా పరమగానం చెయ్యవే! మేము నీకై వచ్చి రామనామం చేస్తున్నా వినీకూడా రాకున్నావటే ! ఇది ఏమి విడ్డూరం! ఇకనైనా మేల్కొని మాతో వ్రతాచరణకు రావలసింది.
Note: HTML is not translated!