తిరుప్పావై పాశురము - 13
పుళ్ళిన్ వాయ్ కీన్డానై పొల్లావరక్కనై
క్కిళ్ళి క్కళ్లైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్జత్తు
పుళ్ళుమ్ శిలుంబినకాణ్, పొదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిరక్కుడైవి\న్దు నీరాడాదే
పక్కిళ్ళి డత్తియోపావాయ్! నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కులన్దేలో రెమ్బావాయ్
మరో సుందరాంగిని మేల్కొల్పడం ...
ఓ గోపికా! బకరాక్షసుణ్ణి చెండాడిన శ్రీ కృష్ణభగవానుని, రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని కళ్యాణగుణలీలలను ప్రకటించే పాటలను పాడుకుంటూ మనకంటే చిన్న వయసుగల కన్యకలు అందరూ నోము నోచే చోటికి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూవుంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు. గూళ్ళను వదలిన పక్షులు రొదచేస్తూ ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి. పద్మములవంటి, జింకవంటి అందమైన కన్నులు కలదానా! చన్నీట జలకాలాడ తగిన సమయంలో ఇంకా పానుపుపై నిదిరిస్తున్నావా? ఈ శుభదినాన ఇంకా నిద్రేల? మేలుకో కపటం మాని మాతో కలు, జాగు చేయకు, వ్రతమాచరించడానికి మాతోరా!
Note: HTML is not translated!