తిరుప్పావై పాశురము - 16
నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కోడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే! మణి క్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మయన్ మణివన్నన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్
నందుని భవన ద్వారపాలకుని గోదాదేవి ప్రార్థించడం …
మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలివున్న ద్వారపాలకస్వామీ! మకరతోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనపడుతున్న రతనాల వాకిలి గడియతీసి తలుపులు తెరచిపెట్టు. మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం! విచిత్రమైన మాయగాడు, నీలమణుల వంటి శరీరచ్చాయగలిగిన ఆ నల్లని కన్నయ్య, మాకు ఓకే వాద్యాన్ని (వరాన్ని) ఇస్తానని నిన్ననే బాసచేసి ఇక్కడికి రమ్మని చెప్పినాడు. అందువల్ల ఈ వేకువజామున మేలుకొలుపు మంగళగీతాలను చక్కగా గానం చేస్తూ ఆ కృష్ణమూర్తిని నిద్రలేపటానికి వచ్చివున్నాం. ఓ ద్వారపాలకా! తొలుదొల్తనే మమ్ము నోటితో వారించకు, దయచేసి తలుపు తెరువు. మేము వ్రతం ఆచరించవలసి వుంది.
Note: HTML is not translated!