తిరుప్పావై పాశురము - 20
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్! శెట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్! తిరువే! తుయిలెలాయ్
ఉక్కముమ్ తట్టోళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్
గోదాదేవి తమతో పాటు స్వామిని నీరాడజేయమని ప్రార్థించడం
ముప్పైమూడుకోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణా! ఇక నిద్దుర మేలుకొనవయ్యా! (కృష్ణయ్య పలుకనందువల్ల) స్వర్గ కలశాలవంటి వక్షోజాలు, పగడాలవంటి ఎఱ్ఱని పెదవులు, సొంపైన సన్నని నడుమూ గలిగి శ్రీమహాలక్ష్మి వంటి సౌందర్యంగల ఓ నీలాదేవీ! నీవైనా నిద్ర మేల్కొనవమ్మా! మా నోమునకు కావలసిన ఆలవట్టం, అద్దం మున్నగునవి ఇచ్చి నీ ప్రియుడైన కృష్ణయ్యతో పాటు మమ్మల్నీ ఇప్పుడే నీరాడజేయవమ్మా! మేము చేస్తున్న ఈ నోమును ఫలింపజేయవమ్మా!
Note: HTML is not translated!