Aditya Hrudayam

తాత్పర్యంతో ఆదిత్య హృదయం

 

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం

 రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం  1

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపాగమ్యాబ్రవీద్రామమగ స్త్యో భగవానృషిః    2

తాత్పర్యం : ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణునిపై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలిసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంభోధించెను.

 

రామ రామ మహోబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వానరీన్వత్స సమరే విజయుష్యసి   3

తాత్పర్యం: ఓ దశరథ కుమారా! గొప్ప బాహువులు కల రామా! ఈ రహస్యమును వినుము. దీనివలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!

 

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం

జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం   4


తాత్పర్యం: ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.

 

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం

చింతాశోకప్రశమనం ఆయుర్వర్థనముత్తమం  5

తాత్పర్యం: ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.

 

రశ్మి మంతం సముద్యంతం దేవాసురనమస్కృతం

పూజయస్య వివస్వంతం భాస్కరం భువనేశ్వరం  7

తాత్పర్యం: పూర్తిగా ఉదయించి ప్రకాశకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించబడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.

 

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసురగాణాన్ లోకాన్ పాతి గభస్తిభిః   8

తాత్పర్యం: సూర్యభగవానుడు సర్వదేవతలయందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపేవాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోకజీవరాశికి జీవము కలిగించి కాలచక్రాన్ని ముందుకు నడిపేవాడు.

 

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః

తాత్పర్యం: ఆ సూర్యభగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.

 

పితరో వాసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః

వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః

 

తాత్పర్యం: ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.

 

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః

తాత్పర్యం: సూర్యభగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త కార్యములకు ప్రేరణ కలిగించేవాడు, ఆకాశము, వివిధ లోకముల తిరిగేవాడు, స్థితికారుడు, బంగారు కాంతితో ప్రకాశించేవాడు, దినకరుడు.

 

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండాం శుమాన్

 

తాత్పర్యం: సూర్యభగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యాపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించువాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.

 

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్ని గర్భో దితేః పుత్రః శంఖః శిశిరనాశానః

తాత్పర్యం: సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించేవాడు, సకల వేదపారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్యపర్వతములను దాటి బ్రహ్మనాడిలో క్రీడిస్తున్నాడు.

 

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోధవః

 

సూర్యభగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించేవాడు, లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్తవర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.

 

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమో స్తుతే

 

తాత్పర్యం: సూర్యభగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గినవారికి తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.

 

నమః పూర్వాయ గిరయే పశ్చిమయాద్రయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః

 

తాత్పర్యం: తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి), తారాగణములకు, దినమునకు అధిపతి అయిన సూర్యభగవానునికి నమస్కారములు

 

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

 

తాత్పర్యం: జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్యభగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు. 

 

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః

తాత్పర్యం: ఉగ్రుడు, వీరుడు, అమిత వేగంగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసేవాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.\

 

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్వవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తాత్పర్యం: బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారంములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దహించేవాడు, తీక్షణమైన రుద్రరూపము కల ఆదిత్యునికి నమస్కారములు.

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తాత్పర్యం: సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించేవాడు, భయమును తొలగించేవాడు, శత్రునాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మస్వరూపుడు. కృతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర,గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే

నమస్తమో భినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే

తాత్పర్యం: కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్నిరూపుడు, సర్వజ్ఞాన ప్రకాశకుడు, విశ్వకర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

తాత్పర్యం: స్సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసే, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగనమండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.

ఏష సుస్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష ఏవాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం

తాత్పర్యం: సూర్యభగవానుడు సుషుప్రావస్థలో (నిద్రా సమయంలో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్ని హోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే అయినవాడు.

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

తాత్పర్యం: సూర్యభగవానుడు వేదసారుడు, క్రతువులు, వాటి ఫలము తానే అయినవాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫలశ్రుతిః

ఏనమాపత్సు క్రుచ్చ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్నా వసీదతి రాఘవ

తాత్పర్యం: రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టాలు కలిగిన సమయంలో దిక్కుతోచక ఉన్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

తాత్పర్యం: రాఘవా! దేవదేవుడు, జగత్పతియైన సూర్యభగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.

 అస్మిన్ క్షణే మహాబావో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదా గస్త్యో జగామ చ యథాగతం

తాత్పర్యం: ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళాడు.

ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్శమవాస్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

తాత్పర్యం: రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు సార్లు పఠించి సచ్చిదానందుడు అయ్యాడు.

మూడు మార్లు ఆచమనం చేసి శుద్దుడై ధనుర్భాణములు ధరించెను.

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధే తస్య దృతో భవత్

తాత్పర్యం: రావణుడు యుద్ధానికి వచ్చుట చూచి ధైర్యంతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.

అథ రవిరవదన్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతిసంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి

తాత్పర్యం: అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయం ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనంతో 'ామా! ముందుకు సాగుము!' అని పలికెను.

Products related to this article

Herbal Bath Powder

Herbal Bath Powder

Herbal Bath Powder ..

₹60.00

Designed Simhasanam (Medium)

Designed Simhasanam (Medium)

Designed Simhasanam (Medium)..

₹800.00

0 Comments To "Aditya Hrudayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!