తిరుప్పావై పాశురము - 24
అన్రిప్పులగా మళన్దాయ్! ఆడిపోట్రి
చ్చేన్రజ్గత్తెన్ని లజ్గేశెత్తాయ్! తిఱల్ పోట్రి
కన్రు కుణిళా వెఱిన్దాయ్ ! కళళ్ పోట్రి
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి
వెన్రు పగిక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరజ్గేలో రెమ్బావాయ్
గోదాదేవి పాడిన మంగళా శాసనం …
పూర్వం లోకాలన్నిటినీ నీ అడుగులతో కొలిచిన స్వామీ! నీ పాదాలకు మంగళం! లంకలోని రక్కసుల్ని అందర్నీ మట్టుపెట్టినవాడా! నీ బాహుబలానికి శుభమంగళం! శకటాసురుణ్ణి చిన్నపాదాలతో తన్నిన స్వామీ! నీ కీర్తికి మంగళం! వత్సాసురుణ్ణి ఒడిసెలరాయివలె విసిరివేసి, కపిత్థాసురుని కూల్చివేసిన బలశాలీ! నీ అడుగులకు మంగళం ! శుభమంగళం!! గోవర్థనగిరిని గొడుగుగా ఎత్తి కాపాడిన స్వామీ నీ కృపకు దివ్య మంగళం ! శత్రువులను కూల్చే నీ చేతి దివ్యాయుధానికి జయమంగళం! నిత్యశుభమంగళం !! అని ఈ విధంగా ఈ రోజు స్వామివారి శౌర్యాన్ని గానం చేయడమే మా వ్రతం. కనుక స్వామీ పఱై పురుషార్థాలను అనుగ్రహించి మా వ్రతాన్ని పూర్తిగా సిద్ధింపచేయవలసింది.
Note: HTML is not translated!