తిరుప్పావై పాశురము - 26
మాలే! మనివన్నా! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వెన్డువన కేట్టియేల్
జ్ఞాలత్తై యేల్లామ్ నడుజ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాజ్ఞశన్నియమే
పోల్వన శాజ్గజ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పణై యే, పల్లాన్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదానమే
ఆలినిలైయామ్ ! అరుళేలో రెమ్బావాయ్!
ఆశ్రిత వ్యామోహము కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావము కలవాడా! అఘటితఘటినా సామర్థ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడా! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి, నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదను. ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనెడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద 'పఱ' అణు వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్టు కావలెను. పై పరికరములను కృప చేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ఈ పాశురమున ప్రార్థించిరి.
Note: HTML is not translated!