తిరుప్పావై పాశురము - 27
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొన్డుయామ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తొళ్ వళైయే, తోడే శెప్పూవే,
పాడగమే, ఎన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళజ్గెవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ !
తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పైభాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రములు ధరించవలెను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా - హాయిగా భుజించవలెను.
Note: HTML is not translated!