తిరుప్పావై పాశురము - 30
వజ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిజ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైజ్ఞ
అజ్గప్పరై కొన్డువాత్తై, అణిపుదువై
పైజ్గమల త్తన్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శాజ్గత్తిమిళ్ మాలై ప్పారీరన్డు మాల్వరైత్తోళ్
శె జ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎజ్గమ్ తిరువరుళ్ పెత్తున్బురువ రంబావాయ్ !
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపజేసి, లక్ష్మీదేవిని పొంది, మాధవుడైన వానిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణ ఆభరణములు దాల్చివారును, అగు గోపికలు చేరి, మంగళము పాడి 'పఱ' అను వాద్యమును లోకులకొరకును, భగవద్దాస్యమును తమకొరకు పొందిరి. ఆ ప్రాకారమున అంతనూ లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీభట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో వారు ఆనాడు గోపికలు ఆ కృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి, పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యాయనము చేయుటచేతనే పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బహు శిరస్సులు కలవాడును, శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు ఆ శ్రీమన్నారాణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును.
Note: HTML is not translated!