ఆంజనేయస్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు?
హిందూ సాంప్రదాయ పూజలలో తాంబూలానిది అగ్రస్థానం. అందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీ, ఆంజనేయస్వామికి ఆకుపూజ అత్యంత ప్రీతికరం. అయితే ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? శ్రీసీతారామాంజనేయులు కొలువై ఉండగా సీతమ్మ తమలపాకులు చిలుకలు చుట్టి ఇస్తుండగా శ్రీరాముడు ఎంతో ప్రీతికరంగా సేవిస్తున్నారట. తమలపాకుల సేవనం తరువాత శ్రీరాముడి నోరు ఎర్రగా పండిందట. ఇది చూసిన ఆంజనేయస్వామి శ్రీరాముడిని చూసి 'స్వామీ ఏమిటిది? మీ నోరు ఎందుకు అంత ఎర్రగా అయ్యింది' అది అడిగారట. దానికి శ్రీరాముడు సమాధానం ఇస్తూ 'తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది' అని సెలవిచ్చారట. దాంతో ఆంజనేయస్వామి వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయి కొంత సమయం తరువాత వొంటినిండా తమలపాకులు చుట్టుకుని వచ్చారట. ఆంజనేయస్వామి ఎక్కువగా తమలపాకు తోటలలో, కదళీవనాలలో (అరటి) విహరిస్తారు. రుద్రసంభూతుడైన ఆంజనేయస్వామిని తమలపాకులు శాంతిని చేకూరుస్తాయి. కాబట్టి తమలపాకులతో ఆంజనేయస్వామిని పూజించడం వలన శాంతిసౌఖ్యాలు సిద్ధిస్తాయి. అలాగే తమలపాకులకు నాగవల్లీదళాలు అనే మరొక పేరు వుంది. తమలపాకులతో ఆంజనేయస్వామిని పూజించడం వలన నాగదోష శాంతి కలుగుతుంది.
ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజిస్తే …?
ఆంజనేయస్వామికి మాలరూపంలో తమలపాకులను సమర్పిస్తే కలిగే ఫలితాలు ఏమిటి అని చాలామంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. వారికోసం ఈ వివరణ ….
- ► దీర్ఘకాలం అనారోగ్యంతో, రోగాలతో బాధపడేవారు ఆంజనేయస్వామికి లేత తమలపాకుల హారాన్ని వేస్తె త్వరగా రోగాలు తిరోగామిస్తాయి.
- ► ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేసినట్లయితే గృహంలో మంత్రిక దోషాలు ఏమైనా ఉంటే, మంత్ర సంబంధిత పీడలు తొలగిపోయి గృహంలో శాంతి నెలకొంటుంది.
► ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేసి, పళ్ళు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారంలో సంభవించే నష్టాలు తొలగి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
► ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేసి పూజిస్తే సంసారంలో ప్రశాంతత, సుఖం లభిస్తాయి.
► ఆంజనేయస్వామికి తమలపాకుల హారం వేసినట్లయితే సమాజంలో నీచంగా, హీనంగా చూడబడుతున్న వ్యక్తికి, సమాజంలో గౌరవనీయమైన వ్యక్తిగా ప్రశంసలు పొందుతారు.
► ఆంజనేయస్వామికి తమలపాకుల మాల వేసి పూజిస్తే శనైశ్చర దృష్టి తొలగి, శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
► ఆంజనేయస్వామి సుందరకాండ పారాయణ చేసి ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలోనూ విజయం సిద్ధిస్తుంది.
► వాద, వివాదాలలో ఆంజనేయస్వామిని ప్రార్థించి, సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తే జయం సిద్ధిస్తుంది.
Note: HTML is not translated!