ఆంజనేయస్వామికి 'వడమాల' ఎందుకు సమర్పిస్తారో తెలుసా?
ఆంజనేయస్వామి బాల్యంలో సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి తినడానికి ఆకాశానికి ఎగిరివెళ్ళాడని మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో ఒక పరమార్థం వుంది. అదేమిటంటే రాహు దోషం తొలగిపోవడం. అదెలా అంటే … ఆంజనేయస్వామి సూర్యుడిని మింగడానికి నింగికి ఎగురుతున్న సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తాడు. అప్పుడు ఆంజనేయస్వామి, రాహువుల మధ్య పోరు జరిగింది. ఆ పోరులో ఆంజనేయస్వామి రాహువుపై విజయం సాధిస్తాడు. దీనికి సంతోషించిన రాహువు … ఎవరైతే నాకు ప్రీతికరమైన మినుములతో చేసిన పదార్థాలను కాని, నా ఆకారంలో అంటే సర్ప ఆకారంలో కాని నీకు సమర్పిస్తారో వారికి రాహుదోషం తొలగిపోతుంది అని వరం ప్రసాదించాడు. అందుకే ఆంజనేయస్వామికి వడమాల సమర్పిస్తారు.
Note: HTML is not translated!