మకర సంకక్రాంతి రోజున విష్ణు నృసింహ సాధన విధానం
శ్రీమహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారం నృసింహస్వామి నృసింహస్వామి రూపాన్ని నేటి రోజులలో సాధన చేయడం ఎంతో శ్రేష్ఠం. అందులోనూ మకరసంక్రాంతి రోజుల చేయడం మరింత శ్రేష్ఠం. ఈ రూపంలో నృసింహస్వామి ఒకవైపు సౌమ్యత, మరొక వైపు పరాక్రమం ఉంటుంది. నృసింహస్వామి సాధవ చేయడంవల్ల మూడు రకాల బాధలు దూరం అవుతాయి అని పండితులు చెబుతున్నారు. మొదటిది శత్రుభయం నుండి విముక్తి లభిస్తుంది. రెండవది చెడుకలల నుండి శాంతి లభిస్తుంది, మూడవది రోగబాధలు నివారింపబడతాయి. (చెవి, నేత్ర, శిరోభారం, కంఠ రోగాలు). శతృ, వివాదాలపై విజయం చేకూరుతుంది.
నృసింహస్వామి సాధనకు కావలసిన పూజా సామాగ్రి: (శక్తి కొలది)
విష్ణు నృసింహ మహాయంత్రం,
మంత్రం జపమాల
30 దీపాలు
కుంకుమపువ్వు,
బియ్యం,
నైవేద్యం,
పువ్వులు
సాధన విధానం
సంక్రాతి రోజున బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానాదికాలు పూర్తిచేసి, ప్రశాంత మనస్సుతో నృసింహస్వామి సాధనకు సిద్ధం కావాలి. శుభ్రమైన ఎరుపురంగు వస్త్రాలు ధరించాలి. వీలు అయితే ఎర్రటి ధోవతి, పైన ఎర్రకండువా ధరించాలి. ఎర్రటి కుర్తా పైజామా అయినా సరే. ప్రశాంతమైన గదిలో, పూజామందిరంలో, ఏకాంత ప్రదేశంలో, గుడి ప్రాంగణంలో, నది, చెరువు ఒడ్డున అయినా సరే సాధనకు అనువైన ప్రదేశాలు. ఎరుపురంగు ఊలుతో చేసిన ఆసనం లేదా దర్భాసనంపై సాధకుడు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఎదురుగా ఒక పీట ఉంచి, దానిపై పసుపుపట్టు వస్త్రం పరచుకోవాలి. పీట మధ్యలో ఒక పాత్రలో విష్ణు నృసింహస్వామి మహాయంత్రం స్థాపించాలి. వీటికి నాలుగుకోణాలలో నాలుగు ఆకులు ఉంచి, వాటిపై బియ్యపురాశులు పోసి, నాలుగు వక్కలు ఉంచాలి. నాలుగు కోణాలలో శ్రీం, హ్రీం, ద్యుతి, పుష్ఠిని ధ్యానిస్తూ పూజ చేయాలి. విష్ణు నృసింహ మహాయంత్రం ఎదురుగా 30 దీపాలు వేలిచించి, ఒక్కక్క దీపం ముందు, నృసింహస్వామి స్వరూపంగా ఒక్కొక్క ఆకుపై బియ్యం పోసి, వక్కను ఉంచి, క్రింద ఇచ్చిన శ్రీవిష్ణువు 30 స్వరూపాలు పఠిస్తూ భక్తిశ్రద్ధలతో పూజించాలి.
ఓం కృష్ణాయ నమః , ఓం మహాధారాయ నమః, ఓం భీశణాయ నమః, ఓం కరాలాయ నమః, ఓం దైత్యాంతాయ నమః. ఓం రక్తాక్షాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భీమాయ నమః, ఓం ఉజ్వలాయ నమః, ఓం వికరాలాయ నమః, ఓం మధుసూదనాయ నమః. ఓం పింగళాక్షాయ నమః, ఓం అంజనాయ నమః, ఓం సుధోరణాయ &am
Note: HTML is not translated!