ఇంట్లో దీపారాధనకు నియమాలు ఏమిటి?
దీపం జ్యోతి పరః
బ్రహ్మ దీపం సర్వతమోపహం !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే !!
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగానూ, మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ అంధకారం అనే చీకటి ఉండడు కాబట్టే హిందూ సాంప్రదాయంలో ఎటువంటి శుభకార్యానికైనా దీపాన్ని వెలిగించి మొదలుపెడతారు. దీపం వెలిగించే సమయంలో 'దీప రాజాయ నమః' అని స్మరిస్తూ దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో దీపారాధనకు ఎటువంటి నిమయాలు ఉన్నాయి అంటే …
దీపం రోజూ రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి పూర్వమే సందాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో క్రమం తప్పకుండా దీపారాధన చేయాలి. దీపాన్ని వెలిగించమని చెప్పలేదు మన పూర్వికులు కానీ దీపాన్ని పూజించండి అని అన్నారు. ఎందుకంటే మనం చేసే నిత్యపూజలు, కైంకర్యాలు ఇలా అన్ని దైవకార్యాలలో తోలిపూజను అందుకునేది దీపమే కాబట్టి. దీపం వెలిగించగానే ఆ ప్రాంతం అంతా దైవీశాక్తులతో నిండిపోతుంది. ఇంట్లో దీపారాధనకు ఎటువంటి నియమాలు లేవు కానీ ఉదయం శుచిగా స్నానం చేసి దీపారాధన చేయాలి అలాగే సాయంత్రం కూడా అయితే స్నానం చేయలేని వారు ముఖమూ, కాళ్ళూ, చేతులూ, నోటిని శుభ్రంగా కడుక్కుని దీపం వెలిగించాలి. దీపాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు. అది దీపాన్ని అగౌరపరచినట్లే అని పండితులు చెబుతున్నారు. దీపం క్రింద మట్టి లేదా ఇత్తడి ప్లేట్ పై పెట్టాలి.దీపం ప్రజ్వలన చేసే ముందు ఇళ్ళు శుభ్రపరచుకుని, దీపం పెట్టే ప్రదేశాన్ని శుచిగా నీటితో కడిగి, తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి దానిపై కొద్దిగా పసుపుకుంకుమలు చల్లి పెట్టాలి. కుందులలోని దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో కుందులోని దీపాన్ని వెలిగించాలి. దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో వెలిగించకూడదు కనీసం రెండు వత్తులు వేయాలి అంటే రెండు వత్తులను కలిపి వేయాలి. విడివిడిగా వెలిగించకూడదు. రెండు జ్యోతులు వెలిగించాలని చెబుతారు. దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమం అని దాని తరువాతనే నువ్వులనూనె మిగిలిన నూనెలు వాడుకోవచ్చు. దీపం వెలిగించిన తరువాత కుందుకు గంధం, కుంకుమ పెట్టి, పూలు నివేదించిన తరువాత సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క, పటికబెల్లం లేదా ఎదో ఒక పండును దీపానికి నివేదించాలి. ఇవే ఇంట్లో దీపారాధనకు పాటించవలసిన అతి చిన్న చిన్న నియమాలు.
Note: HTML is not translated!