శ్రీ శంకరాచార్య విరచిత శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్
శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఈ స్తోత్రములోని అన్ని శ్లోకాలలో నాలుగు పాదములలో చివర శివపంచాక్షరమంత్రము ఏర్పరిచారు. ఇందులో స్తోత్రముతో కలిసి ఉచ్చరించిన శివస్తుతితో పాటు శివపంచాక్షరమంత్రము 332 సార్లు జపించినట్లు అవుతుంది.
శ్రీమదాత్మనే గుణైకసింధవే నమః శివాయ
ధామలేశ ధూతకోకబంధవే నమః శివాయ
నామశేషితానమద్బవాందవే నమః శివాయ
పామరేతరప్రధానబంధవే నమః శివాయ
శ్రీమంతమైన ఆత్కకలవాడు, సద్గుణసముద్రుడు, తన కాంతి లేశముచే సూర్యుని అవహేళనచేయువాడు, భక్తుల సంసార దుఃఖములను పోగొట్టువాడు, జ్ఞానులకు బంధువైనవాడు, అగు శివునకు నమస్కారము.
కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
శూలభిన్నదుష్టదక్షఫాలతే నమః శివాయ
మూలకారణాయ కాలకాల తే నమః శివాయ
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ
యముని చూచి భయపడు మార్కండేయుని రక్షించినవాడవు, దుష్డుడైన దక్షప్రజాపతి నుదుటిని శూలముచే భేదించినవాడవు, అన్నిటికీ మూలకారణమైనవాడవు, మ్రుత్యువుకే మృత్యువైనవాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.
ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ
దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ !
సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ
అష్టమూర్తయే వృషేంద్రకేతనే నమః శివాయ !!
భక్తులకు ఇష్టమైనవాటిని ముఖ్యముగా ప్రసాదించువాడు, దుష్టరాక్షస వంశములనే వెదురు బొంగులను తగులబెట్టు అగ్నిహోత్రుడు, సృష్టికి కారణమైనవాడు, ధర్మమునకు ఆనకట్ట్ట వంటివాడు, భూమి-వాయువు-అగ్ని-జలము-ఆకాశము-సూర్యుడు-చంద్రుడు-జీవుడు అను ఎనిమిది రూపములున్నవాడు, జెండాపై వృషభచిహ్నము ధరించినవాడు అగు శివునకు నమస్కారము.
ఆపడాద్రిఖేదటంకహస్త తే నమః శివాయ
పాపహారిదివ్యసింధుమస్త తే నమః శివాయ !
పాపహారిణే లసన్నమస్తతే నమః శివాయ
శాపదోషఖండనప్రాశస్త తే నమః శివాయ !!
ఆపదలనే కొండలను పగులగొట్టు టంకాయుధమును చేతిలో పట్టుకొన్నవాడవు పాపమును పోగొట్టు గంగానదిని తలపై మోయుచున్నవాడవు, పాపమును నశింప చేయువాడవు, అందరిచే నమస్కరింపబడువాడవు, శాపదోషములను ఖండించుటలో శ్రేష్టుడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.
వ్యోమకేశదివ్యభవ్యరూప తే నమః శివాయ
హేమమేదినీధరేంద్రచాప తే నమః శివాయ !
నామమాత్రదగ్దసర్వపాప తే నమః శివాయ
కామనైకతానహృద్దురాప తే నమః శివాయ !!
ఆకాశమే కేశములుగా కలవాడవు, దివ్యమంగళస్వరూపుడవు, మేరుపర్వతమును విల్లుగా చేసుకొన్నవాడవు, నీ నామమును పలికినంతనే పాపములన్నిటినీ దహించి వేయువాడవు. కోరికలతో నిన్ను కొలుచువారికి దొరకని వాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.
బ్రహ్మమస్తకావలీనిబద్ద తే నమః శివాయ
జిహ్మగేంద్రకుండలప్రసిద్ధ తే నమః శివాయ !
బ్రాహ్మణే ప్రణీతవేదపద్దతే నమః శివాయ
జింహకాలదేహదత్త పద్దతే నమః శివాయ !!
బ్రహ్మకపాలములను మాలగా ధరించినవాడవు, పాములను కుండలములుగా అలంకరించుకొన్నవాడవు, బ్రహ్మదేవునకు వేదములు బోధించినవాడవు, యముని శరీరము కాలితో తన్నిన వాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.
కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ
సామగానజాయమానశర్మణే నమః శివాయ !
హేమకాన్తిచాకచక్యవర్మణే నమః శివాయ
సామజాసురాంగలబ్ధచర్మణే నమః శివాయ !!
మన్మథుని సంహరించినవాడు, పుణ్యకర్ముడు, సామగానము విని ఆనందించువాడు, బంగారు కాంతితో తళతళలాడుచున్న కవచమును ధరించినవాడు, ఏనుగు చర్మమును కట్టుకున్నవాడు అగు శివునకు నమస్కారము.
జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ
చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ !
మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ
సన్మనోగతాయ కామవారిణే నమః శివాయ !!
జన్మ - మరణము మొదలవు ఘోరదుఃఖములను పోగొట్టువాడు, చిన్మయస్వరూపుడు, నా కోరికలను తీర్చువాడు, సజ్జనుల మనస్సులందుండువాడు, మన్మథుని శత్రువు అగు శివునకు నమస్కారము.
యక్షరాజబంధవే దయాలవే నమః శివాయ
దక్షపాణిశోభికాంచనాలవె నమః శివాయ !
పక్షిరాజవాహహృచ్చయాలవే నమః శివాయ
అక్షిపాల వేదపూతతాలవే నమః శివాయ !!
కుబేరుని బంధువు, దయామయుడు, కుడిచేతిలో బంగారు కుండికను ధరించినవాడు, విష్ణుమూర్తి హృదయములో నివసించువాడు, నుదిటి యందు మూడవకన్ను కలవాడు, వేదంపఠనముచే పవిత్రమైన దవడలు కలవాడు అగు శివునకు నమస్కారము.
దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ
అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ !
దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ
ఉక్షరాజవాహ తే సతాంగతే నమః శివాయ !!
కుడిచేతిలో అగ్ని కలవాడు, నిత్యమైన ఆత్మస్వరూపుడు, ఇంద్రునిచే నమస్కరింపబడువాడు, ధర్మదీక్ష కలవారిపై తన తేజస్సును ప్రసరింపజేయువాడు, వృషభవాహనుడు, మంచివారికి గతియైనవాడు అగు శివునకు నమస్కారము.
రాజతాచలేన్ద్రసామవాసినే నమః శివాయ
Note: HTML is not translated!