Which Lamp offered to which God?
ఏ దేవుడికి ఏ దీపం పెట్టాలి?
వ్యాపారస్థులు ఆర్ధిక లాభాల కోసం నియమపూర్వకంగా పూజగదిలో లేదా దేవాలయాలలో స్వచ్చమైన నేతి దీపం వెలిగించాలి. భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించి పూజిస్తే శత్రుపీడ విరగడ అవుతుంది. సూర్యభగవానుడి ప్రసన్నం కోసం నేతిదీపం వెలిగించాలి. శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీదేవతల పూజలో అయినా ఆవునేతి దీపం, నువులనూనె దీపం తప్పకుండా వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీదేవీల కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే మూడు వత్తుల దీపం వెలిగించాలి.
Note: HTML is not translated!