ఈ సంవత్సరం ఏ రాశివారు ఏ స్తోత్రం పఠించాలి? ఎవరిని పూజించాలి?
భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. మనిషి జీవితంలో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది వారి వారి జననకాల గ్రహస్థితి ప్రకారం, శరీర లక్షణాలు, అరచేతులు మొదలైన వివిధ అంశాలను ఆధారం చేసుకుని చెప్పబడుతుంది జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలను మూడు గణాలుగా విభజించారు. ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణం, రేవతి అనే తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు కాగా భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర, కృత్తిక, ఉత్తరాబాద్ర అనే తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు. రాక్షస గణ నక్షత్రాలు … ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ఠ, శతభిషం మిగిలిన తొమ్మిది నక్షత్రాలు. సాధారణంగా ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి అలాగే ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం రాశులు పన్నెండు అవి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. మీ రాశిఫలాన్ని బట్టి ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో ఏ దేవుడిని ఆరాధించాలి? ఏ స్తోత్రం పఠించాలి?
మేష రాశి
మేష రాశి వారు హనుమాన్ ఛాలీసా పఠించాలి, నవగ్రహ ఆరాధన చేయాలి. రోజూ తప్పకుండా 11సార్లు ఈ శ్లోకాన్ని పఠించడం అత్యంత శ్రేష్ఠం.
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్ !
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్వం
దే భక్తి జనాశ్రమం చ వరదం వందే శివం శంకరమ్ !!
వృషభం రాశి
వృషభం రాశి వారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నవగ్రహ ఆరాధన చేయాలి, ప్రతిరోజూ తొమ్మిదిసార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి.
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్ !
సిక్త్యాతు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీశ నాథ మమ దేహి కరావలంబమ్ !! మిథునరాశి వారు ఎల్లప్పుడూ శివ అష్టోత్తర పారాయణ చేయడం అత్యంత లాభదాయకం. అలాగే రోజూ మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి.
విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ
శరణం భవ భూతేశ కరుణాకర శంకర
హరాశంభో సార్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే !
హర శంకర సర్వాత్మాన్ విశ్వేశ్వర వల్లభ
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయతే నమః !!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి శని-రాహు-కేతువులకు జపదానాలు చేయాలి. రోజూ తొమ్మిదిసార్లు ఈ శ్లోకాన్ని పఠించడం సర్వోత్తమం.
యాదేవీ మధుకైటభారీ దమనీ యమాహి సోమ్మాలినీ
యా దూమ్రేక్షణ చండముండ దమనీ యా రక్త బీజాశనీ !
శక్తిశ్శుంభ నిశుంభ దైత్యదమనీ యా సిద్ధి దాత్రీపరా
సా దేవీ నవకోటి మూర్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ !!
సింహరాశి
సింహరాశి వారు ఈ సంవత్సరంలో నవగ్రహ శాంతికి ప్రాధాన్యతను ఇవ్వాలి, అనునిత్యం కాలభైరవ అష్టకం, అర్గళా స్తోత్రం పారాయణ చేయడం శ్రేష్ఠం. వీటితో పాటు ఈ శ్లోకాన్ని రోజూ మూడు సార్లు పఠించాలి.
లంబోదరాంఘ్రి ద్వయ మంబుజ శ్రీ సర్వస్వహారస్వహ మార్చయామిః !
యదర్చయా బ్రహ్మముఖా మరేశా నిరంత రాయం సఫలీకృతార్థః !!
కన్య రాశి
కన్య రాశివారు గురు కవచ పారాయణ చేయాలి, రోజుకి పన్నెండుసార్లు సూర్యుడికి నమస్కరించాలి, ఈ శ్లోకాన్ని పఠించాలి.
మిత్ర రవి సూర్యభాను ఖగ పూష్ణ హిరణ్యగర్భ !
మరీచి ఆదిత్య సవిత్కార్క భాస్కరేభ్యోనమః !!
తుల రాశి
తుల రాశివారు శని-రాహువులకు పరిహారాలు చేస్తుండాలి అనునిత్యం ఆదిత్య ఆరాధన చేసుకోవాలి, ఈ శ్లోకాన్ని పఠించాలి.
ధ్యాయేత్ సూర్యమనంత శక్తికిరణం తేజో మయం భాస్కరమ్
భక్తానా మభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ !
ఆదిత్యం జగదీశ మచ్యుతమజం త్రైలోక్య చూడామణిమ్
భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్ !!
వృశ్చికం రాశి
వృశ్చికం రాశి వారు నవగ్రహ శాంతికోసం ప్రాధాన్యత ఇవ్వాలి, అనునిత్యం ఆపదుద్ధారక సోత్రం పారాయణ చేస్తుండాలి, రోజూ పదకొండు సార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి.
వనమాలీ గడీ శార్జీ శంఖీ చక్రీచ నందకీ !
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భి రక్షతు !!
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు శని శాంతి కోసం ఒకసారి జపదానాలు చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధనకు ప్రాధాన్యతను ఇవ్వాలి, అనేకసార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి.
ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్ !
లోకాభిరాం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ !!
మకర రాశి
మకర రాశి వారు అనునిత్యం మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి.
దుర్గే స్మృతా హరసి భీతి మశేషజన్తోః స్వస్థైః మతి మతీవ శుభం దదాసి !
దారిద్ర్య దుఃఖ భావహారిణి కాత్వదన్యా సర్వోపకార కారణాయా సదార్థ్ర చిత్తా !!
కుంభ రాశి
కుంభ రాశి వారు క్రమం తప్పకుండా నమక పారాయణలు చేయిస్తూ నిత్యం అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ ప్రతినిత్యం క్రమం తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించాలి.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణే
నమోవయం వైశ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః !
మీన రాశ
మీన రాశి వారు నవగ్రహ ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి, గురు-రాహువులకు ఒకసారి జపదానాలు చేయాలి, మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి.
సర్వమంగళ మాంల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
సర్వారుణ నవద్యాంగే శివా స్వాధీనవల్లభా !!
Note: HTML is not translated!