శ్రీ సాయి పూజా విధానం
విఘ్నేశ్వర ప్రార్థన
శ్లో శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం !
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే !!
గురుస్తుతి
శ్లో గురుర్భ్రహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః !
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః !!
పూజా కల్పారంభః
ఆదౌ శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే (అని విఘ్నేశ్వరునిపై అక్షతలు వేసి నమస్కరించవలెను) దీపారాధన చేసి, దానిని గంధ పువ్వులు, కుంకుమలతో అలంకరించాలి.
ఆచమ్యం : ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః, ఓం మధుసూధనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమఃమ్ ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్థనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః
భూశుద్ధి మంత్రం
శ్లో ఉత్తిష్ఠస్తు భూతపిశాచాః యేతే భూమిభారకాః !
ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే !!
(అని రెండు అక్షితలు వాసన చూసి వెనుకకి వేసుకోవాలి)
శ్లో యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా !
తయోః సంస్మరణాపుంసాం సర్వతో జయమంగళ్ !!
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభయం నమః ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఓం శ్రీ సర్వేభ్యో
మహాజనేభ్యః
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహాః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్
సంకల్పమ్
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే, శ్రీమహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ …. నామ సంవత్సరే … ఆయనే … ఋతౌ … మాసే … పక్షే … తిథౌ … వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః … నామధేయః, శ్రీమతః … గోత్రస్య … నామధేయస్య (ధర్మపత్నీ సమేతస్య)మను సహకుటుంబానాం, క్షేమస్థయిర్య విజయా యురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విద ఫలసిద్ధ్యర్థం, శ్రీసాయినాథ మహారాజ దేవతా ముద్దిశ్య, శ్రీ సాయినాథ మహారాజ దేవతా ప్రీత్యర్థం పురుషసూక్త విధానేన ధ్యాన, ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలాశారాధానం కరిష్యే. (అని గ్లాసులోని నీటిని తాకి, ఆ గ్లాసును గంధ, పుష్ప, కుంకుమాదులతో అలంకరించి, దానిపై కుడిచేతిని మూసిపెట్టి ఇలా అనుకోవాలి)
శ్లో కలష్య ముఖే విష్ణుః కంఠేరుద్రస్సమాశితః !
మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాఃస్మృతాః !!
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా !
ఋగ్వేదోధయుజుర్వేద స్సామవేదోహ్యధర్వణః !!
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితః
శ్లో గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే !
సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు !!
కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథ
చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితా !!
ఆయంతు శ్రీ సాయినాథ పూజార్థం మమ దురితక్షయకారకాః !
కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య !!
అధ గానాప్తి పూజా ధ్యానం
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,
ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి
పాదయోః పాద్యం సమర్పయామి
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామ
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్దోదకస్నానం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
శ్రీమహాగణాధిపతయే నమః శ్రీగంధం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః దూర్వాది నానావిధ పుష్పైః సమర్పయామి
సుముఖాయ నమః
ఏకదంతాయ నమః
కపిలాయ నమః
గజకర్ణికాయ నమః
లబోదరాయ నమః
వికటాయ నమః
విఘ్నరాజయ నమః
గణాధిపాయ నమః
ధూమకేతవే నమః
గణాధ్యక్షాయ నమః
ఫాలచంద్రాయ నమః
వక్రతుండాయ నమః
శూర్పకర్ణాయ నమః
హేరంబాయ నమః
స్కంద పూర్వజాయ నమః
సర్వసిద్ది ప్రదాయకాయ నమః
(ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుతో పూజించి, చివరగా)ఓం శ్రీగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (అని పువ్వులు వేయాలి) ఓం మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. శ్రీమహాగణాధిపతయే నమః దీపం సమర్పయామి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం : భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి (రాత్రివేళ పూజ అయితే - ఋతుంత్వ సత్యేన పరిషించామి అనుకోవాలి) అమృతమస్తు అమృతోపస్తరణమసి
మంత్రపుష్పం :
ధాతాపురస్తాద్యము దాజహార శక్రఃప్రవిద్వాన్ ప్రదీశశ్చతస్రః !
తమేవం విద్వాన్ అమృత ఇహభవతినాన్యః పంథా అయనాయ విద్యతే !!
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాత్కాలమంత్రపుష్పం సమర్పయామి
క్షమాపణమ్ : యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ - తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః - పాహిమాం కృపయా దేవ ! శరణాగత వత్సల అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ - తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్ధన !!
క్షమాపణవిధి :
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన !
యత్పూజితం మాయాదేవ! పరిపూర్ణం తదస్తుతే !!
అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి స్సుప్రతస్సుప్రసన్నో వరదో భవతు.
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భావంతో బృవంతు - ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు తథాస్తు !! శ్రీమహాగణాధిపతయే ప్రసాదం శిరసా గృహ్ణామి.
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం సమర్పయామి
పూజావసాన విధిః
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ !
తెహానాకం మహిమానస్సచంతేయత్రపూర్వేసాధ్యాస్సంతి దేవాః !!
శ్రీ మహాగణాధిపతిం యథాస్థాణముద్వాసయామి (సు)
శోభనార్థం పునరాగమనాయచ. (వినాయక ప్రతిమను వెనక్కి జరపాలి)
శ్రీ సాయిబాబా పూజా ప్రారంభః
ధ్యానం : బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం - ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమస్వాది లక్ష్యం ఏకం నిత్యం అమల మచలం సర్వ దీసాక్షిభూతం - సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ఓం శ్రీ సాయిసమర్థాయ నమః ధ్యానం సమర్పయామి
ఆవాహనం : ఓం సహస్రశీర్షాపురుషః సహస్రాక్షస్సహస్రపాత్ - సభూమిం విశ్వతోవృత్వా అత్యతిష్ఠద్ధశాంగులమ్ ఓకే శ్రీ సాయి సమర్తాయ నమః - ఆవాహయామి. (పుష్పాక్షతలు - ప్రతిమపైగాని, పటంపై కాని ఉంచాలి).
ఆసనం : పురుషఏవేదగ్ం సర్వం యద్భూతం యచ్చభవ్యం - ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ఓం ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ఆసనం సమర్పయామి.
పాద్యం : ఎతావానస్యమహిమా అతోజ్యాయాగ్ శ్చ పూరుషః - పాదోస్య విశ్వాభూతాని, త్రిపాద స్యామృతం దివిః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - పాదయోః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం : త్రిపాదూర్ధ్వం, ఉదైత్పురుషః పాదోస్యేహాభవాత్పునః - హస్తయోరర్ఘ్యం సమర్పయామి.
ఆచమనం : ఓం తస్మాద్విరా డజాయత విరాజో ఆధిపూరుషః - సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మథోపురః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ముఖే ఆచమనీయం సమర్పయామి ఆచమనం : ఓం తస్మాద్విరా డజాయత విరాజో ఆధిపూరుషః - సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మథోపురః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ముఖే ఆచమనీయం సమర్పయామి.
స్నానం : ఓం యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞ మతన్వత - వసంతో అస్యాసే దాజ్యమ్ గ్రీష్మ ఇద్మశ్శరద్ధవిః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - శుద్దోదకేన స్సపయామి.
పంచామృత స్నానం
ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - క్షీరేణ స్నపయామి
ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - దద్నా స్సపయామి
ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - ఆజ్యేన స్సపయామి
ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - మధ్వేన స్సపయామి
కొబ్బరికాయ లేదా పళ్ళరసం :
ఓం శ్రీ సాయిసమర్థాయ నమః నారికేళోదకేన/ఫలరసేన స్సపయామి.
వస్త్రం : ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్రసమిధః కృతాః - దేవాయద్యజ్ఞం తన్వానా అబధ్నన్ పురుషం పశుమ్ ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - శుద్దోదక స్నానం సమర్పయామి
యజ్ఞోపవీతమ్ : ఓం తం యజ్ఞం బర్హిపిప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః - తేనదేవాఅయజంత సాధ్యారుషయశ్చయే ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి
చందనం : ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం - పశూగ్ం శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - దివ్య శ్రీచందనం సమర్పయామి
అక్షతలు : ఓం తస్మాద్యజ్ఞాట్ సర్వ హుతః ఋచస్సామానిజిజ్ఞిరే - చాందాగ్ం జిజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయతః ఓం శ్రీ సాయిసమర్థాయ నమః - సువర్ణక్షతాన్ సమర్పయామి
పుష్పసమర్పణం : ఓం తస్మాదశ్వా అజాయంత యేకేచోభయాదతః - గావోహజిజ్ఞిరే తస్మాత్ తస్మాజ్ఞాతా అజావయః ఓం శ్రీ సాయిసామర్థాయ నమః - పుష్పాణి సమర్పయామి
మంగళ ద్రవ్యాదికం : ఓం సాయిసమర్థాయ నమః - సమస్త విధ మంగళద్రవ్య ఆభరణాదీన్ సమర్పయామి.
అథాంగ పూజ
ఓం శ్రీ షిరిడీనివాసాయ నమః - పాదౌ పూజయామి
ఓం భక్తహృదయావాసితాయ నమః - గుల్ఫౌ పూజయామి
ఓం సర్వాపన్నివారకాయ నమః - జంఘే పూజయామి
ఓం సర్వ శుభప్రదాతాయ నమః - జానునీ పూజయామి
ఓం సర్వ భూత హితరతాయ నమః - ఊరూ పూజయామి
ఓం ప్రేమమూర్తయే నమః - కటిం పూజయామి
ఓం సర్వమతసారభూతాయ నమః - ఉదరం పూజయామి
ఓం ఆపద్భాందవాయ నమః - వక్షస్థలం పూజయామి
ఓం మహాద్భుత ప్రదర్శకాయ నమః - బాహున్ పూజయామి
ఓం దీపప్రియాయ నమః - కంఠం పూజయామి
ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః - వక్త్రం పూజయామి
ఓం అనాధనాథ దీనబంధవే నమః - దంతాన్పూజయామి
ఓం సర్వాభీష్టప్రదాయ నమః - నాసికాం పూజయామి
ఓం సర్వమంగళరాయ నమః - నేత్రౌ పూజయామి
ఓం త్రికాలజ్ఞాయ నమః - శిరః పూజయామి
ఓం సత్యతత్త్వభోధకాయ నమః - శ్రీ సాయిసమర్థాయ నమః సర్వాణ్యంగాని పూజయామి (ఇప్పుడు అష్టోత్తర శతనామాలతో కానీ పసుపురంగు పూవులతో కాని, అక్షతలతో కాని పూజించాలి)
Note: HTML is not translated!