పాదరస లక్ష్మీదేవి పూజా విధానం వాటి ఫలితాలు?
యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతను తెలియజేశారు. ఆ 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతలో పాదరస లక్ష్మీదేవి గురించి కూడా వివరించబడింది. పాదరస లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమనిష్టలతో వెండి, పాదరసం కలిపి అనుభవం ఉన్నవారు చేస్తారు. పాదరస లక్ష్మీదేవిని కుబేరుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, దిక్పాలకులు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యులు పూజించారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నారు. పాదరస లక్ష్మీదేవి విగ్రహాలు విశిష్టమైన అద్భుతశక్తులు కలిగి ఉంటాయి. పాదరస లక్ష్మీదేవిని పూజించేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానసంధ్యలు పూర్తిచేసుకున్న తరువాత పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని శుభ్రమైన నీళ్ళతో కడిగి, గంగాజలంతో, పచ్చిపాలతో అభిషేకించాలి. పాదరస లక్ష్మీదేవిని అభిషేకించిన నీరు, పాలు త్రాగడానికి ఉపయోగపడవు. ఎందుకంటే పాదరసం ఎముకల క్షీణతకు పాల్పడతాయి కాబట్టి. పాదరస లక్ష్మీదేవిని పువ్వులు, గంధం, సుగంధద్రవ్యాలతోను, తీయని పండ్లతోను, తామరమాల మొదలైన పూజాద్రవ్యాలతో పూజించాలి. తామరమాలతో శ్రీసూక్తం చదువుతూ పూజించాలి.
పాదరస లక్ష్మీదేవిని అనునిత్యం పూజ చేసేవారికి దీర్ఘకాలం సంపదను కలిగిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. సంపదతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని అందుకుంటారు, ఉన్నత విద్యను కలిగిస్తుంది. పాదరస లక్ష్మీదేవిని పూజించినవారికి మనస్సు ప్రశాంతంగా ఉండడంతో పాటు చంచలత్వం కూడా దరిచేరదు మరియు కార్య సాధనలో ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం పొందని వారు కూడా కార్యసాదనలో విజయం సాధిస్తారు. వాణిజ్య వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వ్యాపార సంస్థలలో కాని దుకాణాలలో కాని నిత్యం పాదరస లక్ష్మీదేవిని పూజిస్తే వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దినదినాభివృద్ధి కలిగిస్తుంది. చంద్ర, బుధ గ్రహ దోషాలు ఉన్నవారు పాదరస లక్ష్మీదేవిని తప్పక పూజించాలి అని వేదపండితులు తెలియజేస్తున్నారు.
Note: HTML is not translated!