లక్ష్మీదేవికి పాదపూజ చేయవచ్చా?
లక్ష్మీదేవి పాదాలకు పూజ చేయకూడదు అనేది భక్తులలో నెలకొన్న ఒక అపోహ మాత్రమే కానీ లక్ష్మీదేవి పాదాలనే పూజించాలని అని అంటున్నాయి గ్రంథాలు. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతీబ్రహ్మ విశ్వమంతా వ్యాపించి ఉంటారు. మరి పరమాత్మను అర్చించే సమయంలో ప్రక్కన అమ్మవార్లు కూడా ఉంటారు కదా. అలాగే మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం, తీర్థప్రసాదాలు తీసుకున్న తరువాత పూజారులు మన తలపై శఠగోపం పెడతారు కదా మరి దానిపై మందిరాల దేవుళ్ళ పాదముద్రలు వాటిపై ఉంటాయి. కొల్హాపురంలోని అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో ఉంటాయి. అటు బాసర నుండి ఇటు ఎటువంటి అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా పూజారులు భక్తుల తలపై శఠగోపం పెడతారు కదా మరి మనం అమ్మవారి పాదపూజ చేయడంలో తప్పు ఎందుకు ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ ప్రస్తావించాలి. శ్రీలక్ష్మీదేవి సర్వంగ్యాని స్తోత్రం పరిశీలించినట్లయితే 'చంచలాయై నమః - పాదౌపూజయామి' అని మొట్టమొదటే ఉంది. కాబట్టి భక్తులు లక్ష్మీదేవిని అమ్మవార్లకు పాదపూజ చేయడం తప్పు అనే నానుడి నుండి ప్రక్కకు వచ్చి తప్పకుండా అమ్మవార్లకు పాదపూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.
Note: HTML is not translated!