కొబ్బరినూనెతో దేవుని ఎదుట దీపాలు వెలిగిస్తే ...?
► శ్రీమహాలక్ష్మీదేవి ఎదుట ప్రతి రోజూ కొబ్బరినూనెతో దీపం వెలిగించి, పంచదార, కొబ్బరి నైవేద్యంగా నివేదిస్తారో వారి ఇంట జరిగే ఎటువంటి శుభకార్యాలు అయినా నిర్విఘ్నంగా, అడ్డంకులు లేకుండా శుభప్రదంగా పూర్తి అవుతాయి
► కులదేవత ముందు కొబ్బరినూనెతో అఖండదీపం వెలిగించిన వారి ఇంట్లోని వారు సిరిసంపదలతో తులతూగుతారు.
► ఎవరి ఇంట ప్రతిరోజూ దేవిదేవతల ముందు కొబ్బరినూనెతో దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లో శుభకార్యాలు శీఘ్రంగా, దిగ్విజయంగా జరుగుతాయి.
► ఎటువంటి హోమాలలో అయినా పూర్ణాహుతి సమయంలో పట్టువస్త్రాన్ని కొబ్బరినూనెతో తడిపి హోమగుండంలో వేస్తారో వారికి అష్టనిధి, నవనిధులు సమకూరుతాయి.
► ఒక మండలం రోజుల పాటు (48 రోజులు) శ్రీ మహాలక్ష్మీదేవిని ఈశాన్యంలో ప్రతిష్టించి కొబ్బరి నూనెతో దీపాలను వెలిగిస్తే వారికి రావలసిన ఎంతటి మొండి బకాయిలు అయినా వసూలు అవుతాయి, ఇంట్లో శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి
► శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదుట కొబ్బరినూనెతో దీపాలు వెలిగించి, శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పఠించి అటుకులు, బెల్లం, పాలు, పళ్ళు నైవేద్యంగా నివేదించినట్లయితే రావలసిన మొండి బకాయిలు శీఘ్రంగా వసూలు అవుతాయి
► ప్రతి శనివారం రోజున శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదట కొబ్బరినూనెతో దీపాలను వెలిగించి, పూజించి, తులసిదళం లేదా తులసిదళం మాలను వేసిన వారికి ఆర్ధిక సమస్యలు జీవితంలో ఉండవు, వివాహం మంగళకరంగా జరుగుతుంది.
► సాయంసంధ్య సమయంలో హరిద్వార్ లో గంగా దీపాన్ని వెలిగించే సమయంలో కొబ్బరినూనెతో దీపాన్ని వెలిగించి నదిలో వదిలిన వారికి, వారి కుటుంబసభ్యులకు జీవితాంతము ప్రతి ఏటా గంగాస్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది.
► సోమవారం రోజు రాత్రి ఏడు గంటలకు కాశీ విశ్వేశ్వరుడి హారతి సమయంలో కొబ్బరినూనెతో దీపం వెలిగిస్తే కోరుకున్న సకల కార్యాలు శరవేగంగా, దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు వారు కోరుకున్న విధంగా జరుగుతుంది.
► గృహప్రవేశ సమయంలో, హోమాలు చేసే సమయంలో, దేవతలను ఆవహన చేసే సమయంలో, మందిరాలలో దేవతల ఆవాహన సమయంలో, ప్రత్యక్ష దేవత (సూర్యుడు, జలపూజ వగైరా) పూజా సమయంలో కొబ్బరినూనెతో దీపాలు వెలిగించిన వారికి జన్మ జన్మల్లో దేవి సంస్కారం చేకూరుతుంది.
► కాత్యాయని దేవి పూజ చేసే సమయంలో దేవి ఎదుట కొబ్బరినూనెతో దీపాలు వెలిగిస్తే పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలకి త్వరగా పెళ్ళిళ్ళు జరుగుతాయి.
► సంతానం లేని దంపతులు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని మంగళవారం రోజున పూజించి కొబ్బరినూనెతో దీపం వెలిగిస్తే సంతానవంతులు అవుతారు.
► సంతాన గోపాలకృష్ణుడిని పూజించే సమయంలో స్వామివారి ఎదుట కొబ్బరినూనెతో దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు చేసిన వారికి సంతానం ప్రాప్తిస్తుంది
► రావిచెట్టు కింద ఉండే నాగదేవతలను పూజించే సమయంలో కొబ్బరినూనెతో దీపం వెలిగించిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కీచులాటలు, ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. కలహాలు ఉన్నా అవి తొలగిపోతాయి.
► జాతకం ప్రకారం కుజదోషం ఎక్కువగా ఉన్నవారు మంగళవారం లేదా శుక్రవారం రోజులలో దేవిని పూజించే (శక్తి, గ్రామ దేవతలను)సమయంలో కొబ్బరినూనెతో దీపాలు వెలిగించి, పప్పుతో చేసిన బొబ్బట్లు నైవేద్యంగా నివేదించి పూజ పూర్తయిన తరువాత వాటిని దానంగా ఇస్తే కుజదోషం నివారణ అవుతుంది.
► పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపాన్ని (విష్ణు పాదాలు లేదా కులదేవత ముందు) వెలిగించి, పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టినట్లయితే వారి పితృదేవతలు మహోన్నతమైన లోకాలను చేరుకుంటారు.
Note: HTML is not translated!