Saibaba Satcharitra 21 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవై ఒకటవ అధ్యాయం

1. వి.హెచ్. ఠాకూర్ 2. అనంతరావు పాటంకర్ 3. పండరీపురం ప్లీడరు - వీరి కథలు

ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బి.ఏ., అనంతరావు పాటంకర్ (పూణా), పండరీపురము ప్లీడరు  గోరించిన కథలు చెప్పారు. ఈ కథలు అన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగ్గా చదివి గ్రహించినట్లయితే, ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపిస్తాయి.

ప్రస్తావన :

సామాన్యంగా మన గతజన్మ పుణ్య సముపార్జనం వల్ల మహాత్ముల సాన్గాత్యభాగ్యం పొంది దానివలన మేలు పొందుతాము. దీనికి ఉదాహరణగా హేమాడ్ పాంగ్ తన సంగతినే చెపుతున్నారు. బొంబాయికి దగ్గరగా వున్నా బాంద్రాకి యితడు చాలాకాలం మేజిస్త్రేటుగా వున్నాడు. అక్కడ పీరు మౌళానా అనే మహమ్మదీయ మహాత్ముడు నివశిస్తూ ఉండేవాడు. అనేకమంది హిందువులు, పారశీలు, ఇతర మతస్థులు వెళ్ళి వారిని దర్శించేవారు. హేమాడ్ పంత్ పురోహితుడైన ఇనుస్, పీరుమౌళానాను దర్శించుకోమని అనేకసార్లు హేమాడ్ పంత్ కి చెప్పారు. కానీ ఏవో కారణాల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముడిని దర్శించుకోలేకపోయారు. అనేక సంవత్సరాల తరువాత అతని వంతు వచ్చింది. అతను షిరిడీకి వెళ్ళి శ్రీసాయి దర్బారులో శాశ్వతస్థానాన్ని పొందాడు. దురదృష్టవంతులకు ఇటువంటి మహాత్ముల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే అలాంటిది లభిస్తుంది.

యోగీశ్వరుల వ్యవస్థ

అత్యంత ప్రాచీనకాలం నుండి ప్రపంచంలో యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేకమంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికీ విధింపబడిన పనులను నెరవేరుస్తారు. వారు అనేక చోట్ల పనిచేసినా అందరూ భగవంతుడి ఆజ్ఞానుసారం నెరవేరుస్తారు. కాబట్టి ఒకరు చేసేది ఇంకొకరికి తెలుసు. ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేస్తారు. దీన్ని బోధించడానికి ఒక ఉదాహరణ కింద ఇస్తున్నాను.

వి.హెచ్. ఠాకూర్ :

వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండేవారు. ఆయన ఒకానొక సమయంలో బెళగాం సమీపంలోని వడ్ గం అనే పట్టణానికి ఒక సర్వేపార్టీతో వచ్చారు. అక్కడ 'అప్ప' అనే కన్నడ యోగిని దర్శించుకుని వారి పాదాలకు నమస్కరించారు. ఆ యోగి నిశ్చలదాసు రచించిన 'విచారసాగర' అనే వేదాంత గ్రంథాన్ని సభలో ఉన్నవారికి బోధిస్తూ ఉన్నారు. ఠాకూర్ వెళ్ళినప్పుడు వారి సెలవు కోరగా వారు ఇలా చెప్పారు 'ఈ పుస్తకం నీవు చదవవలెను. నీవు అలా చేసినట్లయితే నీ కోరికలు నెరవేరుతాయి. ముందుముందు ఈ ఉద్యోగానికి సంబంధించిన పనిమీద ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు నీ అదృష్టవశాన నీకొక గొప్ప మహాత్ముడి దర్శనం కలుగుతుంది. వారు నీ భవిష్యత్తుకు మార్గం చూపిస్తారు. నీ మనస్సుకి శాంతి ఆనందాలు కలగజేస్తారు.’ ఆ తరువాత తాకూరు జున్నూరుకు బదలీ అయ్యారు. అక్కడికి వెళ్ళడానికి నాన్హే ఘాటు లోయను దాటి వెళ్ళవలసి ఉండేది. ఈ లోయ మిక్కిలి లోతైనది. దాన్ని దాటడం చాలా కష్టం. దాన్ని దాటడానికి ఎనుబోతు తప్ప వేరేవాటిని ఉపయోగించరు. కాబట్టి ఎనుబోతుపై లోయను దాటడం వల్ల అతనికి బాధ కలిగింది. అక్కడినుండి కళ్యాణ్ కి పెద్ద ఉద్యోగంపై బదలీ అయ్యారు. అకక్డ నానాసాహెబు ఛాందొర్కర్ తో పరిచయం కలిగింది. అయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శించాలని అనుకున్నారు. ఆ మరునాడే నానాసాహెబు షిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. కాబట్టి ఠాకూరును కూడా తనతో రావలసిందిగా అడిగారు. ఠాకూరు తనకి ఠాణాలో సివిల్ కేసు ఉండటంతో రాలేనని చెప్పారు. అందుకే నానాసాహెబు ఒక్కడే వెళ్ళారు. ఠాకూరు ఠాణా వెళ్లారు. కనీ అక్కడ కేసు వాయిదా పడింది. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవడంతో అమితంగా పశ్చాత్తాపపడ్డాడు. అయినప్పటికీ షిరిడీ వెళ్లారు. అంతకు ముందురోజే నానాసాహెబు షిర్ ఇదీ విడిచిపెట్టారని తెలిసింది. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిశారు. వారు ఠాకూరును బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అతడు బాబాను చూసి, వారి పాదాలకు నమస్కరించి మిక్కిలి సంతోషించారు. అతని కళ్ళు ఆనందభాష్పాలతో నిండుకున్నాయి, ఒళ్ళు గగ్గుర్పాటుకు గురయ్యింది. కొంతసేపటికి సర్వజ్ఞుడైన బాబా ఇలా అన్నారు 'ఇక్కడి మార్గం అప్పా బోధించే నీతులు అంత సులభం కాదు. నాన్హే ఘాటులో ఎనుబోతుపైన సవారి చేయడం కంటే కష్టం! ఈ అధ్యాత్య మార్గం అత్యంత కఠినమైనది. దీనికి ఏంటో కృషి అవసరం.’ తకూరు ఒక్కడికే అర్థమైన ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడు అయ్యాడు. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థాలని గ్రహించాడు. రెండు చేతులు జోడించిబాబా పాదాలపై శిరస్సు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించాలని ప్రార్థించారు. అప్పుడు బాబా ఇలా అన్నారు 'అప్పా చెప్పినది అంతా నిజనే! కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టాలి. ఊరికినే గ్రంథాలు చదవడం వల్ల ప్రయోజనం లేదు. నీవు చదివిన విషాన్ని గురించి జాగర్తగా విచారించి, అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. లేకపోతె ప్రయోజనం లేదు. గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం.’ విచారసాగరంలోని సిద్ధాంత భాగం అతడు చదివి ఉన్నాడు. కాని ఆచరణను షిరిడీలో నేర్చుకున్నాడు. ఈ క్రింద చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యాన్ని బలపరుస్తుంది.

అనంతరావు పాటింకర్ :

అనంతరావు పాటింకర్ అనే పూణా పెద్దమనిషి ఒకడు బాబాను చూడాలని కోరుకున్నారు. షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. అతి కళ్ళు సంతృప్తి చెందాయి. అతడు ఆనందించాడు. అతడు బాబా పాదాలపై పడి, తగు విధంగా పూజించి, తరువాత బాబాతో ఇలా అన్నాడు 'నేను ఎక్కువగా చదివాను,  వేదాలను, వేదాన్తాలను చదివాను, అష్టాదశ పురాణాల వంటివి. నా మనస్సుకు శంతి కలగడం లేదు. కాబట్టి నా పుస్తక జ్ఞానం అంతా నిష్ప్రయోజనం. పుస్తకజ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందకపోయినట్లయితే పుస్తకజ్ఞానం అంతా వ్యర్థం. నీ దృష్టి వల్లా నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదిస్తావని విన్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నాపట్ల దాక్షిణ్యం చూపించు. నన్ను ఆశీర్వదించు.’ అప్పుడు బాబా ఒక నీతికథను ఈ విధంగా చెప్పారు.

తొమ్మిది ఉండల గుఱ్ఱపులద్ది నీతికథ (నవవిధభక్తి)

ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాడు. అతని ముందు ఒక ఆడ గుఱ్ఱం లద్ది వేసింది. అది తొమ్మిది ఉండలుగా పడింది. జిజ్ఞాసువు అయిన ఆ వర్తకుడు పంచెకొంగు చాచి తొమ్మిది లద్ది ఉండలు అందులో పెట్టుకున్నాడు. ఇలా ఆతడు మనస్సును కేంద్రీకరించగలిగాడు.’

ఈ మాటలు అర్థాన్ని పాటంకర్ గ్రహించలేక పోయాడు.అందుకే అతడు గణేశ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కరుని ఇలా అడిగాడు 'ఆ మాటలలో బాబా ఉద్దేశ్యం ఏమిటి? కేల్కరు ఐనా జవాబు ఇచ్చాడు 'నాకు కూడా బాబా చెప్పింది అంత తెలియదు కానీ, వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెపుతాను. ఆడగుఱ్ఱం అంగా ఇక్కడ భగవంతుడి అనుగ్రహం. తొమ్మిది ఉండల లద్ది అంటే నవవిధ భక్తులు అవి ఏమిటంటే 1. శ్రవణం (వినడం) 2. కీర్తనం (ప్రార్థించడం) 3. స్మరణం (జ్ఞానపకం పెట్టుకోవడం) 4. పాదసేవ (పదాలకు సేవచేయడం) 5. అర్చనం (పూజ) 6. నమస్కారం (వంగి నమస్కరించడం) 7. దాస్యం (సేవ) 8. సఖ్యత్వం (స్నేహం) 9. ఆత్మనివేదనం (ఆత్మను సమర్పించడం).

‘ఇవి నవవిధభక్తులు. వీటిలో ఏదయినా ఒక మార్గాన్ని హృదయపూర్వకంగా అనుసరించినట్లయితే బహ్గావంతుడు సంతృప్తి చెందుతాడు. భక్తుని గృహంలో ప్రత్యక్షం అవుతాడు. భక్తిలేని సాధనాలు అన్నీ అనగా జపం, తపం, యోగం, ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం, వాటిలోని సంగతులను ఇతరులకు బోధించడం మొదలైనవి నిష్ప్రయోజనం. భక్తే లేకపోతె వేదాలలోని జ్ఞానం, జ్ఞాని అయిన గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రానికే చేసే భజన, ఇవి అన్నీ కూడా వ్యర్థం. కావలసింది ప్రేమాస్పదమైన భక్తి మత్రమే. నీవు కూడా ఆ వర్తకుడివి అనుకో. లేదా సత్యాన్ని తెలుసుకోవడానికి  ప్రయత్నిస్తున్న వ్యక్తిని అనుకో. వాడిలాగా నవవిధ భక్తులను పోగు చేసుకో. ఆతృతతో ఉండు, వాడిలా నవవిధభక్తులను ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉండు. అప్పుడే నీకు మనఃస్థైర్యం, శాంతి కలుగుతాయి.

ఆ మరుసటి రోజు పాటంకర్ బాబాకు నమస్కరించడానికి వెళ్ళగా 'తొమ్మిది గుఱ్ఱపులద్ది ఉండలను పోగుచేశావా లేదా?’  ప్రశ్నించారు. అతడు తాను నిస్సహాయుడిని అణీ, బాబా అనుగ్రహంతో మాత్రమె వాటిని సులభంగా పోగు చేయవచ్చు అన్నాడు. అప్పుడు బాబా శాంతి క్షేమాలు కలుగుతాయని ఆశీర్వదించారు. పాటంకర్ కూడా ఆత్మానందం భరితుడు అయ్యాడు.

పండరీపురము ప్లీడరు :

ఒక చిన్న కథతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాము. ఆ కథ బాబా సర్వజ్ఞుడు అని తెలుపుతుంది. ప్రజలను సరైన మార్గంలో పెట్టడానికి, వారి తప్పులను సవరించడానికి, బాబా సర్వజ్ఞాత్వాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. ఒకరోజు పండరీపురం నుండి ఒక ప్లీడరు వచ్చాడు. అతడు మసీదుకు వెళ్ళి సాయిబాబాను దర్శించుకున్నాడు. జరుగుతున్నా సంభాషణ వినడానికి ఒక మూల కూర్చున్నాడు. బాబా అతనివైపు ముఖం తిప్పి ఇలా అన్నారు 'ప్రజలు ఎంత టక్కరులు? వాడు పాదాలపై పడతారు, దక్షిణ ఇస్తారు కనీ, చాటున నిందిస్తారు. ఇది చిత్రం కాదా?’ ఆ మాటలు ప్లీదరుకు సూటిగా తగిలాయి, ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు. ప్లీడరు మాత్రం గ్రహించాడు. కాని అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు వెళ్ళిన తరువాత ప్లీడరు కాకాసాహెబు దీక్షిత్ తో ఇలా అన్నారు 'బాబా చెప్పినది అంతా యదార్థమే, ఆ బాణం నాపై ప్రయోగించారు. అది నాగురించే, నేను ఎవరినీ నిందించకూడదు, తృణీకరించకూడదని బోధిస్తూ ఉంది. పండరీపురం సబ్ జడ్జి అయిన నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కోసం షిరిడీకి వచ్చాడు. ఇక్కడే మకాం చేశారు. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గురించి వివాదం జరిగింది. రోగంతో బాధపడుతున్న సబ్ జడ్జి ఔషదాన్ని సేవించకుండా, షిరిడీకి వెళితే మాత్రం బాగావుతుందా? అని మాట్లాడుకున్నారు. సబ్ జడ్జిని వ్యాఖ్య చేశారు. సాయిబాబాను నిందించారు. నేను కూడా అందులో కొంతభాగం వహించాను. నేను చేసింది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించారు. ఇది నాకు దూషణ కాదు. నాకిది ఆశీర్వాదమే. ఇది నాకు ఒక ఉపదేశం. నేను ఇకమీదట ఎవరినీ దూషించరాదు. ఎవరినీ నినదించరాదు. ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకోకూడదు.’ పండరేపురానికి షిరిడీ మూడు వందల మైళ్ళు దూరంలో ఉన్నది. బాబా సర్వజ్ఞుడు కావడంతో పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగిందో తెలుసుకున్నారు. ఈ మధ్యలో ఉన్న స్థలం, నదులు, అడవులు, పర్వతాలు, వారి సర్వజ్ఞత్వానికి అడ్డుపడలేదు. వారు సర్వాన్ని చూడగలిగారు. అందరి హృదయాలలో ఉన్న దాన్ని చదవగలిగారు. వారికి తెలియని రహస్యం ఏమీ లేదు. దగ్గర ఉన్నవి దూరంగా ఉన్న ప్రతి వస్తువు కూడా పగటి కాంతిలా వారికి తేటతెల్లం. ఎవడయినా దూరంగా గాని దగ్గరగా గని ఉండనివ్వండి. బాబా సర్వాంతర్యామి కావడంతో వారి దృష్టి నుంచి తప్పించుకోవడానికి వీలులేదు. దీన్ని బట్టి ప్లీడరు ఒక నీతిని నేర్చుకున్నారు. ఒకరిని గురించి చెడు చెప్పకూడదు, మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయకూడదు. అలా బాబా అతని దుర్గుణాన్ని పోగొట్టి సన్మార్గంలో పెట్టారు.

ఇది ఒక ప్లీదరుని గురించినది అయినప్పటికీ అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞాపకం ఉంచుకుని మేలు పొండుదాము.

సాయిబాబా మహిమ అగాధం, వారి లీలలు కూడా అలాంటివే, వారి జీవితం అలాంటిదే, వారు పరబ్రహ్మ యొక్క అవతారమే.

శ్రీసాయినాథాయ నమః ఇరువై ఒకటవ అధ్యాయం సంపూర్ణం

సమర్థ సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు 

ఇరవైరెండవ అధ్యాయం

0 Comments To "Saibaba Satcharitra 21 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!