whom to Worship as per Birth Raasi's ?

జన్మ రాశుల ప్రకారం ఎవరిని పూజించాలి ?

మీన రాశి : ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆవునేతి దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేసిన తరువాత దేవాలయంలో ఉన్న రావిచెట్టుకి కూడా ఐదు ప్రదక్షిణాలు చేయాలి. రోజూ గురు పాదుక స్తోత్రం పఠించాలి.

మేష రాశి : పౌర్ణమి రోజున పార్వతి, దుర్గా, శక్తి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించాలి. శక్తిమేరకు శక్తిపీఠాల దర్శనం చేసుకోవాలి

కుంభ రాశి : ప్రతి నెలా వచ్చే త్రయోదశి రోజున దుర్గాదేవి ఆలయానికి లేదా కాళభైరవ దేవాలయానికి వెళ్ళి నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. అలాగే దేవాలయంలో దీపం వెలిగించడానికి నువ్వులనూనెను దానంగా ఇవ్వాలి. మందిరంలో ఉన్న భక్తులకు తీపి ప్రసాదాన్ని పంచిపెట్టాలి లేదా ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నల్లకుక్క లేదా నల్లఆవుకి ఏదైనా పెట్టాలి.

మకర రాశి : ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజున రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి నువ్వులనూనెతో దీపం వెలిగించి, బిల్వదళం సమర్పించి బిల్వాష్టకం పఠించాలి లేదా ఇంట్లోనే ఆ రోజు పరమేశ్వరుడిని బిల్వాదళంతో పూజించిన తరువాత బిల్వాష్టకం పఠించాలి.

ధనుస్సు రాశి : నెలలో ఎదో ఒక రోజు నృసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించాలి లేదా నృసింహస్వామి దేవాలయంలో దీపారాధనకు ఆవునెయ్యిని దానంగా ఇవ్వాలి. అలాగే రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదించాలి

కన్యా రాశి : ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాత ఆవునేతితో దీపం వెలిగించాలి.

కర్కాటక రాశి : ప్రతి నెలా వచ్చే త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి నువ్వులనూనెతో దీపం వెలిగించాలి మరియు రుద్రాభిషేకం చేయించాలి

మిథున రాశి : ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి విష్ణాలయం లేదా శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయానికి వెళ్ళి సామూహిక సత్యనారాయణవ్రతం చేసుకోవాలి

సింహ రాశి : ప్రతినెలా ఎదో ఒక రోజున శ్రీరామాలయానికి కానీ శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించిన తరువాత తులసిదళంతో అర్చన చేసుకోవాలి.

తులా రాశి : ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజున విష్ణాలయానికి కాని లక్ష్మీనారాయణస్వామి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించి తులసిదళంతో అర్చన చేయాలి

వృశ్చిక రాశి : నెలలో ఎదో ఒక రోజున దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి ఎర్ర గన్నేరుపువ్వులు లేదా ఎర్ర గన్నేరుపువ్వుల మాలను అందజేసి ఆవునేతితో దీపం వెలిగించాలి. ప్రతి రోజూ దుర్గా అష్టోత్తరం పఠించాలి

వృషభ రాశి : ప్రతి శుక్రవారం లేదా నెలలో ఎదో ఒక శుక్రవారం రోజున గోమాతకు ఏదైనా తినిపించి, శ్రీమహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. లేదా గోమాతకి ఏదైనా తినిపించిన తరువాత ఇంట్లోనే శ్రీమహాలక్ష్మీదేవి అష్టకం పఠించాలి.

0 Comments To "whom to Worship as per Birth Raasi's ?"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!