నెయ్యి దీపాలు వెలిగిస్తే …. ?
హిందువులు తమ ఇళ్ళలో దేవీదేవతల ముందు దీపాలను వెలిగిస్తుంటారు. కొందరు నూనెతో వెలిగిస్తే మరొకొందరు నేతితో వెలిగిస్తుంటారు. నేతితో దీపాలను వెలిగిస్తే లభించే లాభాలు … …
నేతి దీపాలను తూర్పు - ఉత్తర దిశలలో వెలిగించాలి. పశ్చిమం - దక్షిణ దిశలలో వెలిగించినట్లయితే తలపెట్టిన శుభకార్యాలు నెమ్మదిగా సాగుతాయి.
ఇంట్లో ఆవు వెన్న కాచి ఆ నేతితో దీపాలను వెలిగిస్తే ఆ ఇంట్లో కోరుకున్న సిద్ధి లభిస్తుంది, దైవభక్తి, లక్ష్మీ కటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తూ ఉంటాయి. నేతి దీపాలను దేవునిముందు కూర్చుని వెలిగించాలి.
నేతి దీపాలను దేవుని ముందువైపు ఉంచి, దేవుడి పటాన్ని తూర్పువైపు ఉంచి, దయం వెలిగిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, నవవిధులు లభిస్తాయి.
కులదేవత శాపాలు తొలగిపోవడానికి, అనుగ్రహం పొందటానికి ఇంట్లో దేవుడికి నేతిదీపాలు వెలిగించాలి.
దేవీదేవతలకు వెలిగించే నేతి దీపాల నెయ్యి తెల్లని ఆవు నుంచి తీసుకున్నది అయినట్లయితే ఆ ఇంట్లో సంతోషం, సమృద్ధి, మంగళమైన కార్యాలు అతి వేగంగా జరుగుతూ ఉంటాయి.
సుబ్రహ్మణ్యస్వామి, నాగదేవతలు లేదా సర్పదేవతల ముందు నేతి దీపాలను వెలిగిస్తే, వెలిగించిన వారికి, వారి కుటుంబసభ్యులకు సర్పదోషాలు కలగవు.
21 రోజులలో అనుకున్న కార్యాలు నెరవేరాలంటే వినాయకుడి ముందు నేతి దీపాలను వెలిగించాలి.
మంగళవారం, శుక్రవారం రోజులలో దేవీ ఆలయంలో ఒక మూల నేతి దీపం వెలిగిస్తే తలచుకున్న పనులు నెరవేరతాయి.
శ్రీచక్ర దేవతలకి, గాయత్రిదేవి, కామాక్షి, త్రిపుర సుందరిదేవీలకు నేతి దీపాలను వెలిగిస్తే కోరుకున్న కార్యాలు శీఘ్రంగా పూర్తవుతాయి.
పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు నేతి దీపాలను క్షేత్ర దేవతల ముందు వెలిగిస్తే క్షేత్ర ఫలం పొందుతారు.
శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుడి ఎదుట నేతిదీపాలు వెలిగించి పూజ చేసినవారికి వారి కుటుంబసభ్యులకి, అన్నదమ్ములకు ఎప్పుడూ కలహాలు రావు.
ఉగాది, విజయదశమి, బలిపాడ్యమి, అక్షయ తృతీయ రోజులలో దేవుని ముందు నేతి దీపాలను వెలిగించిన వారికి వారి కుటుంబ సభ్యులకి కులదేవత, ఇష్టదేవతల అనుగ్రహం సంవత్సరమంతా ఉంటుంది.
నవరాత్రి పూజా సమయాలలో శక్తిదేవత లేదా కులదేవత ముందు నేతిదీపాలను వెలిగించి పూజించిన వారి ఇంటికి వారి ఇంట్లోని వారికి అన్ని దుష్టశక్తుల నుంచి, శత్రువుల సమస్యలు తొలగి, సర్వదుఃఖాలనుండి విముక్తి పొంది దేవి అనుగ్రహం లభించి సుఖంగా జీవిస్తారు.
ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, అమావాస్య రోజు (దీపావళి) సాయంకాల గోధూళి లగ్నంలో శ్రీమహాలక్ష్మీదేవి ఎదుట నేతిదీపాలు వెలిగించి, తీపి పదార్థాలను నైవేద్యంగా నివేదించి, పిల్లలకి, బంధువులకి, స్నేహితులకి పంచిపెడతారో వారికి వారి కుటుంబ సభ్యులకు సంవత్సరమంతా దారిద్ర్యం దరిచేరకుండా ఉంటుంది.
కులదేవత, ఇష్టదేవతల ముందు ప్రతిరోజూ ఉదయం పూట ప్రతిరోజూ నేతి దీపాలు వెలిగించే వారు పట్టు చీరను కట్టుకుని వెలిగించినట్లయితే ఆ ఇంట్లోని వారికి అష్టైశ్వర్యాలు లభించి ఆగర్భ శ్రీమంతులు అవుతారు.
ప్రతిరోజూ కులదేవత, ఇష్టదేవతల ముందు మధ్యాహ్నం సమయంలో నేతి దీపాలను వెలిగించేవారు పట్టు చీర కట్టుకుని వెలిగించినట్లయితే పితృదోషాలు నశించిపోతాయి.
కులదేవత, ఇష్టదేవతల ముందు సాయంత్రం పూట ప్రతిరోజూ నేతి దీపాలను పట్టు చీరలను ధరించి వెలిగించినట్లయితే వారికి, ఇంట్లోని వారికి రావలసిన బాకీలు, నగదు చేతికి అందడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.
గాయత్రి హోమం చేసే సనయంలో నేతి దీపాలను ప్రధాన కలశం ఎదుట పెట్టి ప్రార్థన చేసి హోమాన్ని చేసినట్లయితే సకల సంకష్టాలు తొలగిపోయి తలచుకున్న సర్వ కార్యక్రమాలు వేగంగా పూర్తి కావడంతో పాటు గాయత్రి అనుగ్రహం కలుగుతుంది.
శ్రీచక్రం ముందు అనుష్ఠానం చేసేవారు ప్రతిరోజూ నేతిదీపాలను వెలిగించి శ్రీ లలితాదేవి షోడశోపచార పూజను చేసి, శ్రీ లలితపంచమి లేదా షోడశ మంత్రాన్ని పఠించినట్లయితే మంత్రసిద్ధి దేవి అనుగ్రహం కలుగుతుంది.
భైరవి ఉపాసకులు నేతిదీపాలను వెలిగించి భైరవ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్లయితే, మంత్ర-తంత్రాలు ఎవరైనా ప్రయోగిస్తే ఆ మంత్రాలు పనిచేయవు.
సంతానం లేనివారు, సంతానం కలిగినా పిల్లలు మరణించినవారు వారు సంతాన గోపాల కృష్ణుడి ముందు నేతిదీపాలు వెలిగించి, సంతాన గోపాలకృష్ణుడి మూల మంత్ర జపాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తారో వారికి సంవత్సరంలోగా సంతాన యోగం కలుగుతుంది. పుట్టిన పిల్లవాడు ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు
ఆడపిల్ల కోసం అయితే శ్రీ దుర్గా సప్తసతీ పారాయణం చేసే సమయంలోనే నేతిదీపాలను వెలిగించి ప్రార్థన చేయాలి. అలా చేసినవారికి సంవత్సరంలోపు ఆడపిల్ల పుడుతుంది. ఆ పాప ఆయురారోగ్యాలతో పాటు దైవభక్తిని కూడా కలిగి ఉంటుంది.
వైద్య పరీక్షలు చేసుకున్న తరువాత ఇక సంతానం కలగరు అని తెలిసిన దంపతులు శ్రీ షష్ఠిదేవతను పూజించి, దేవికి నేతిదీపాలను వెలిగించి షోడశోపచార పూజలు చేసి, భక్తితో ప్రసాదాన్ని స్వీకరిస్తారో దైవసంకల్పంతో సంతాన భాగ్యం కలుగుతుంది.
Note: HTML is not translated!