అనంతపద్మనాభస్వామి వ్రతవిధానం ...
సెప్టెంబర్ 15వ తేదీ
ఈ మాసంలో శుద్ధ చతుర్థశిని అనంతపద్మనాభ చతుర్థశి అంటారు. అందుకే అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి. ఈ రోజున పాలకడలిపై మహాలక్ష్మీ సమేతుడైన శేషతల్ప శాయిగా కొలువైన శ్రీ మహావిష్ణువును పూజించడం హిందువుల ఆచారం. ఈ వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వ్రతం ఆచరించే స్త్రీ నదీస్నానం చేసి, ఎఱ్ఱని చీర ధరించి, వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకి దక్షిణభాగంలో ఉదకంతో కలశాన్ని పెట్టి, వేదికకి మరో భాగంలోకి యమునాదేవిని, మధ్యభాగంలో దర్భలతో చేసుకున్న సర్పాకృతి కలిగినది పెట్టి అందులోకి శ్రీ అనంతపద్మనాభ స్వామివారిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించి, అర్చించాలి. పూజకు కావలసిన ద్రవ్యాలను పద్నాలుగు రకాలు ఉండేలా చూసుకోవాలి. పద్నాలుగు ముడులు ఉన్న, కుంకుమతో తడిపిన కొత్త తోరాన్ని ఆ అనంతపద్మనాభస్వామి దగ్గర పెట్టి పూజించి, ఏడున్నర కిలోల గోధుమపిండితో 28 అరిసెలు చేసి, అనంతపద్మనాభస్వామికి నివేదించి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన 14 అరిసెలు భక్తిగా భుజించాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు వ్రతం చేసిన తరువాత ఉద్యాపన చేయాలి.
పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు వారి క్షేమ సమాచారం కనుక్కోవడానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఎదురేగి అతిథి మర్యాదలతో సత్కరించి, ఆసనం వేసి గౌరవించాడు. తరువాత కొంతసేపటికి ధర్మరాజు "కృష్ణా మేము ఇప్పుడు పడుతున్న కష్టాలు, బాధలు మీకు తెలియనివి కాదు. ఎటువంటి వ్రతం చేసినట్లయితే మా కష్టాలు తొలగిపోతాయో ఉపదేశించు" అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు "ధర్మరాజా! మీ కష్టాలు తొలగిపోవాలంటే 'అనంత పద్మనాభస్వామి వ్రతం' చేయండి.” అని తెలిపాడు.
ధర్మరాజు "కృష్ణా అసలు అనంతుడు ఎవరు?’ అని తిరిగి ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు బదులిస్తూ 'ధర్మరాజా! అనంతపద్మనాభుడు అంటే ఎవరో కాదు, నేనే. నేనే కాలస్వరూపుడినై అంతటా వ్యాపించి ఉంటాను. రాక్షసులను సంహరించడానికి నేనే కృష్ణుడిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడినైన పద్మనాభస్వామిని కూడా నేనే. మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు కూడా నావే. నాలో పద్నాలుగు ఇంద్రులు, అష్ట మనువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తఋషులు, చతుర్థశ భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యంగా ఉన్నాయి. కాబట్టి 'అనంత పద్మనాభస్వామి వ్రతం' ఆచరించు అని చెప్పాడు. దానికి ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు "కృష్ణా! ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఇంతకుముందు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా?” అని అడిగాడు.
కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు "పూర్వం కృతయుగంలో వేదవేదాంగ శాస్త్రాలలో పండితుడు అయిన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైన కుమార్తె పేరు సుగుణవతి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్తవయస్సు వచ్చేసరికి తల్లి దీక్షాదేవి మరణించింది. సుమంతుడు మళ్ళీ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య పరమగయ్యాళి. అందుకే సుమంతుడు తన కుమార్తెని, కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకుని ఈ విషయం రెండవ భార్యకు చెప్పాడు. ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి, పెళ్ళికోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపించాడు.
సుగుణవతి తన భర్త కౌండిన్యతో కలిసి వెళుతుండగా మార్గమధ్యలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొంతమంది స్త్రీలు ఎఱ్ఱని చీరలు ధరించి 'అనంత పద్మనాభస్వామి వ్రతం' నిర్వహిస్తున్నారు. సుగుణవతి వారి దగ్గరికి వెళ్ళి ఆ వ్రతం గురించి వారికి అడిగింది. వాళ్ళు ఈ విధంగా చెప్పారు "ఈ అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ నదీస్నానం చేసి, ఎఱ్ఱని చీర ధరించి, వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకి దక్షిణ భాగంలో ఉదకంతో కలశాన్ని పెట్టి, వేదికకి మరో భాగంలోకి యమునాదేవిని, మధ్యభాగంలో దర్భలతో చేసుకున్న సర్పాకృతి కలిగినది పెట్టి అందులోకి శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించి, అర్చించాలి. పూజకు కావలసిన ద్రవ్యాలు పద్నాలుగు రకాలు ఉండేలా చూసుకోవాలి. పద్నాలుగు ముడులు, కుంకుమతో తడిపిన కొత్త తోరాన్ని ఆ అనంతపద్మనాభస్వామి దగ్గర పెట్టి పూజించి, ఏడున్నర కిలోల గోధుమపిండితో 28 అరిసెలు చేసి, అనంతపద్మనాభస్వామికి నివేదించి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానం ఇచ్చి, మిగిలిన అరిసెలు భక్తిగా భుజించాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు వ్రతం చేసిన తరువాత ఉద్యాపన చేయాలి" అని చెప్పారు.
సుగుణవతి వెంటనే అక్కడే శ్రీఅనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించి, తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తించింది. దీంతో కౌండిన్యుడికి గర్వం బాగా పెరిగింది. ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకుని, తోరం కట్టుకుని భర్త దగ్గరకి రాగా, కౌండిన్య మహర్షి తన భార్య సుగుణవతిని ఆమె ధరించిన తోరాన్ని చూసి కోపంగా "ఎవరిని ఆకర్షించాలని ఇది చేతికి కట్టుకున్నావు'’ అంటూ ఆ తోరాన్ని తెంపి నిప్పులలో పడేశాడు.
అంతే, ఆ క్షణం నుండి వారికి కష్టకాలం మొదలై, ఆగర్భ దరిద్రులు అయిపోయారు. కౌండిన్యుడిలో పశ్చాత్తాపం మొదలై 'శ్రీఅనంతపద్మనాభస్వామివారిని' దర్శించాలనే కోరిక తీవ్రమైనది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. మార్గమధ్యలో పళ్ళతో నిండుగా వున్న మామిడిచెట్టుపై ఎటువంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. అలాగే పచ్చగా, నిండుగా ఉన్న పొలంలోకి వెళ్ళకుండా దూరంగానే ఉన్న ఆంబోతుని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలోకి దిగకుండా గట్టునే నిలబడి ఉన్న జలపక్షులను, మరొక ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒక గాడిదను, ఏనుగుని చూసి ఆశ్చర్యపోతూ "మీకు అనంతపద్మనాభస్వామి తెలుసా?” అని అడిగాడు. అవి అన్నీ తమకు తెలియదు అని బదులిచ్చాయి.
ఆ అనంతపద్మనాభస్వామిని అన్వేషిస్తూ అన్ని చోట్లా గాలించి ఒక ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు శ్రీఅనంతపద్మనాభస్వామికి కౌండిన్యుడిపై జాలి కలిగింది. వెంటనే ఒక వృద్ధబ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వచ్చి, సేదతీర్చి తన నిజరూపంతో దర్శనం ఇచ్చాడు. కౌండిన్య మహర్షి అనంతపద్మనాభస్వామిని అనేక విధాల స్తుతించాడు. తన దారిద్ర్యం తొలగించి, అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు.
కౌండిన్యుడు తాను మార్గమధ్యలో చూసిన వింతలు గురించి అనంతపద్మనాభస్వామిని అడిగాడు. దానికి అనంతపద్మనాభస్వామి ఈ విధంగా బదులిచ్చాడు. “ఓ విప్రమోత్తమా! తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడిచెట్టుగాను, మహాధనవంతుడిగా పుట్టినా అన్నార్తులకు అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆంబోతుగాను, తాను మహారాజుని అనే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటిముందు నిలబడిన పక్షులుగా, నిష్కారణంగా ఇతరులను దూషించేవాడు గాడిదగా, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులా జన్మిస్తారు. నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించే విధంగా చేశాను. నువ్వు 'అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని' పద్నాలుగు సంవత్సరాలు చేసినట్లయితే నీకు నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను" అని చెప్పి శ్రీమహావిష్ణువు మాయం అయ్యాడు.
కౌండిన్య మహర్షి తన ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగినది అంతా తన భార్య సుగుణవతికి చెప్పాడు. శ్రీఅనంతపద్మనాభస్వామి వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు.’’ అని ధర్మరాజుకు, శ్రీకృష్ణుడు శ్రీఅనంతపద్మనాభస్వామి వ్రతం గురించి తెలిపాడు.
శ్రీఅనంతపద్మనాభస్వామి వ్రత విధానం
ముందుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అందులో దర్భలతో పద్నాలుగు పడగల అనంతుడిని చేసుకోవాలి తరువాత గణపతిని, నవగ్రహాలను పూజించిన తరువాత యమునా పూజ చేయాలి. అనంతుడిని షోడశోపచారాలతో పూజించి 28 అరిసెలు చేసుకుని శ్రీఅనంతపద్మనాభస్వామికి నైవేద్యంగా నివేదించి, వ్రత కథ చెప్పుకుని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి, అక్షింతలు తలపై వేసుకోవాలి. 14 బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి మిగిలినవి భక్తితో తినాలి. ఎరుపు రంగులో ఉన్న పద్నాలుగు పొరలతో తయారుచేసుకున్న తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు ఆచరించిన తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి.
శ్రీఅనంతపద్మనాభస్వామి పూజాకల్పం
ధ్యానం : క్రుత్వాదర్భ మాయం దేవం పరిధాన సమన్వితం
పనైసప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షిణాగ్రకరే పద్మం శంఖం తస్యాపధ్య కారే
చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యా పద్య కారే
అవ్యయం సర్వలోకేశం పీతాంభర్రధరం హరిం
అనంతపద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి
ఆవాహనం :
ఆగచ్చానంత దేవేశ తేజోరాశే జగత్పతే
ఇమాంమయాకృతం పూజాం గృహాణ సురసత్తమ
అనంతపద్మనాభాయ నమః ఆవాహనం సమర్పయామి
ఆసనం :
అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాయాం
అనంతపద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి
తోరస్థాపనం :
తస్మాగ్రతో దృఢం సూత్రం కుంకుమాక్తం సుదోరకం
చతుర్థశి గ్రంధి సంయుక్తం వుపకల్ప్య ప్రజాజాయే
అనంతపద్మనాభాయ నమః తోరస్థాపనం కరిష్యామి
అర్ఘ్యం :
అనంతగుణ రత్నాయ విశ్వరూప ధరాయ ఛ
అర్ఘ్యం దదామితేదేవ నాగాదిపతయే నమః
అనంతపద్మనాభాయ నమః అర్ఘ్యం సమర్పయామి
పాద్యం :
సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన
పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి
ఆచమనీయం :
దామోదర నమోస్తుతే నరకార్ణవతారక
గృహాణాచమనీయం దేవ మయాదత్తం హే కేశవా
అనంతపద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి
మధుపర్కం :
అనంతానంత దేవేశ అనంత ఫలదాయక
దధి మద్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే
అనంతపద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి
పంచామృతం :
అనంతగుణ గంభీర విశ్వరూప ధరానమ
పంచామృతైశ్చ విడివ త్స్నా పయామి దయానిధే
అనంతపద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి
శుద్దోదక స్నానం :
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
స్నానం ప్రకల్పయేతీర్థం సర్వపాప ప్రముక్తయే
అనంతపద్మనాభాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి
వస్త్రయుగ్మం :
శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే
పీతాంబరం ప్రదాస్వామి అనంతాయ నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం :
నారాయణ నమోస్తుతే త్రాహిం మాం భావసాగారాట్
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ
అనంతపద్మనాభాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం :
శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాదీ భిరన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం
అనంతపద్మనాభాయ నమః గంధం సమర్పయామి
అక్షతాన్ :
శాలియాన్ తండులాన్ రంయాన్ మయాదత్తాన్ శుభావహాన్
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీ కురుశ్వా ప్రభో
అనంతపద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి
పుష్పపూజ :
కరవీరై ర్జాతికుసుమై శ్చమ్పకైర్వకులైశుభై
శాతపత్రైశ్చ కల్హారై రర్చయే పురుషోత్తమ
అనంతపద్మనాభాయ నమః పుష్పాణి సమర్పయామి
అథాంగపూజ :
ఓం అనంతాయ నమః - పాదౌ పూజయామి
ఓం శేషయ నమః గుల్ఫౌ - పూజయామి
ఓం కాలాత్మనే నమః జంఘే - పూజయామి
ఓం విశ్వరూపాయ నమః - జానునీ పూజయామి
ఓం జగన్నాథాయ నమః - గుహ్యం పూజయామి
ఓం పద్మనాభాయ నమః - నాభిం పూజయామి
ఓం సర్వాత్మనే నమః - కుక్షిం పూజయామి
ఓం శ్రీవత్సవక్షసే నమః - వక్షస్థలం పూజయామి
ఓం చక్రహస్తాయ నమః - హస్తాన్ పూజయామి
ఓం ఆజానుబాహవే నమః - బాహూన్ పూజయామి
ఓం శ్రీకంఠా నమః - కంఠం పూజయామి
ఓం చంద్రముఖాయ నమః - ముఖం పూజయామి
ఓం వాచాస్పతయే నమః - వక్త్రం పూజయామి
ఓం కేశవాయ నమః - నాసికాం పూజయామి
ఓం నారాయణాయ నమః - నేత్రే పూజయామి
ఓం గోవిందాయ నమః - శ్రోత్రే పూజయామి
ఓం అనంతపద్మాయ నమః - శిరః పూజయామి
ఓం విష్ణవే నమః - సర్వాంగణ్యాని పూజయామి
అనంతపద్మనాభ స్వామి అష్టోత్తరం :
1. ఓం శ్రీ కృష్ణాయ నమః
2. ఓం కమలనాథాయ నమః
3. ఓం వాసుదేవాయ నమః
4. ఓం సనాతనాయ నమః
5. ఓం వసుదేవాత్మజాయ నమః
6. ఓం పుణ్యాయ నమః
7. ఓం లీలామానుషవిగ్రహాయ నమః
8. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
9. ఓం యశోదావత్సలాయ నమః
10. ఓం హరయే నమః
11. ఓం చతుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుదాయ నమః
12. ఓం దేవకీనందనాయ నమః
13. ఓం శ్రీశాయ నమః
14. ఓం నందగోపప్రియాత్మజాయే నమః
15. ఓం యమునావేగాసంహారిణే నమః
16. ఓం బలభద్రప్రియానుజాయ నమః
17. ఓం పూతనాజీవితహరణాయ నమః
18. ఓం శకటాసురభంజనాయ నమః
19. ఓం నందప్రజజనానందినే నమః
20. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
21. ఓం నవనీతవిలీప్తాంగాయ నమః
22. ఓం నవనీతనటాయ నమః
23. ఓం అనఘాయ నమః
24. ఓం నవనీతనవాహారాయ నమః
25. ఓం ముచుకుందప్రసాడకాయ నమః
26. ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
27. ఓం త్రిభంగినే నమః
28. ఓం మధురాకృతయే నమః
29. ఓం శుకవాగమృతాబ్దీందనే నమః
30. ఓం గోవిందాయ నమః
31. ఓం యోగినాంపతయే నమః
32. ఓం వత్సవాటచరాయ నమః
33. ఓం అనంతాయ నమః
34. ఓం ధేనుకసురభంజనాయ నమః
35. ఓం తృణీకృతతృణావర్తాయ నమః
36. ఓం యమళార్జునభంజనాయ నమః
37. ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
38. ఓం తమాలశ్యామలాకృతయే నమః
39. ఓం గోపగోపీశ్వరాయ నమః
40. ఓం యోగినే నమః
41. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
42. ఓం ఇళాపతయే నమః
43. ఓం పరంజ్యోతిషే నమః
44. ఓం యాదవేంద్రాయ నమః
45. ఓం యాదుద్వాహాయ నమః
46. ఓం వనమాలినే నమః
47. ఓం పీతవాసనే నమః
48. ఓం పారిజాతాపహారకాయ నమః
49. ఓం గోవర్థనాచలోద్ధర్త్రే నమః
50. ఓం గోపాలాయ నమః
51. ఓం సర్వపాలకాయ నమః
52. ఓం అజాయ నమః
53. ఓం నిరంజనాయ నమః
54. ఓం కామజనకాయ నమః
55.ఓం కంజలోచనాయ నమః
56. ఓం మధుఘ్నే నమః
57. ఓం మధురానాథాయ నమః
58. ఓం ద్వారకానాయకాయ నమః
59. ఓం బలినే నమః
60. ఓం బృందావనాంతసంచారిణే నమః
61. ఓం తులసీదామభూషణాయ నమః
62. ఓం శ్యమంతమణిహర్త్రే నమః
63. ఓం నరనారాయణాత్మకాయ నమః
Tags: ananthapadmanabha-swamy-vrat-vidhanam anantapadmanabhaswami-vrata-poojaa-vidhanam pooja-vidhanam-anantapadmanabha-vratam procedure-of-anantha-padmanabha-vrata-pooja proceedings-in-ananthapadmanabha-swami-vrata-pooja
Note: HTML is not translated!